శ్రీ మేధా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం

మీరు జన్మించిన తేది, సమయం, ప్రదేశం ఈ మూడు సమాచారములు మాకు తెలియచేసినచో మీ వ్రుత్తి,వ్యాపార,ఆరోగ్య,ఆర్ధిక పరిస్తితులు, దాంపత్యం, విద్య, ఉద్యోగ, వివాహ, కుటుంబవ్యవహారాలు, సంతానం, రాజకీయ వ్యవహారాలు,ప్రేమ వ్యవహారములు,కుజ దోషం, కాలసర్ప దోషం మరియు వివాహ, ఉపనయన, గృహప్రవేస, జప, హోమ, వ్రత, అన్నప్రసన, నామకరణం లకు ముహూర్తములు పెట్టబడును. P.V.RADHAKRISHNA CELL :+91 7013390324, Mail us :parakrijaya@gmail.com
Get your horoscope by giving Date, time and place of birth. Do you have mobile no. 9966455872 Live chat with WhatsApp Pantula Venkata RadhaKrishna.Get a solution to your horoscope problems

28, డిసెంబర్ 2013, శనివారం

Gomata


:మరిన్నివివరములకుసంప్రదింపుడు:

See My 4 Blogs - P.V.Radhakrishna cell:9966455872, 9966680542

Like the face book page శ్రీ మేధా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం : https://www.facebook.com/SRIMEDHADAKSHINAMURTYJYOTISHANILAYAM

పరాక్రి పదనిసలు : http://jayaparakri.blogspot.in/

శ్రీ మేధా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం : http://medhadakshinamurtyjyotishanilayam.blogspot.in/,

సాధన ఆరాధన : http://sadhanaaradhana.blogspot.in/ ,

తెలుగు పండిత దర్శిని : http://teluguteachers-parakri.blogspot.in/


జాతకం- ప్రశ్న- ముహూర్తం-వాస్తు-యంత్రం-రక్షాకవచాదులు-పొందగోరువారు సంప్రదించండి.


Consultation Timings :
      Everyday 06:00AM to 09:00 AM(With appointemnt )
     Everyday 05:30PM to 09:00PM (Without appointemnt)
Sunday (or)Any public & govt holidays we are available full day 06:00 AM To 8:00 PM (With appointemnt )


20, డిసెంబర్ 2013, శుక్రవారం

జ్యోతిషం శాస్తం లో పర్యాలోచన - 3

                                                                    
                                     ఈ విశ్వములో ప్రతి ప్రాణి కోరుకునేది “నిత్యానందము” మాత్రమే. దాని కొరకై ఆరాటపడుతుంది వర్తమాన శరీరము. కానీ ప్రతి శరీరములో గల సూక్ష్మ శరీరము యుగధర్మమును అనుసరించి నీకు ఆనందమైన జీవితాన్ని చూపిస్తూ తన గమ్యాన్ని చేరుకోవచ్చు. లేదా అత్యంత కష్టాలకు గురిచేస్తూ తన గమ్యం చేరుకోవచ్చు. దానికి కారణము సూక్ష్మ శరీర ప్రవర్తనే. ఈ సూక్ష్మ శరీరాన్నే “ఆత్మ” అని అంటారు. ఈ ఆత్మను జ్యోతిష్యశాస్త్ర రీత్యా కర్మసాక్షి ఐనా సూర్యునితో పోలుస్తారు. ఆయనే పుట్టని(unborn) “భగవంతుడు”. అందుకనే ప్రతి జీవిని భగవంతుని అవతారమని చెబుతారు. ఆత్మ అధిరోహించిన వాహనమే వర్తమాన కాలాములో కలిగిన ఈ శరీరము. ఇలా వచ్చే ఆత్మ “సర్వేజనా స్సుఖినోభవంతూ” అను ధర్మసూక్ష్మం మేరకు తప్పు చేసినదైతే సరిదిద్దుకొనుటకు నూతన శరీరములోకి ప్రవేశించి యుగధర్మానుసారముగా ప్రవర్తిస్తుంది. అలా సరిదిద్దుకొనే ప్రయత్నములో ఎన్నో అడ్డంకులు వర్తమాన శరీరమునకు ఎదురవుతుంది. అవన్నియు “కర్మ” ఫలితమే. ఈ వర్తమాన శరీరమును స్టూలమని, ఆత్మను సూక్ష్మమని జ్యోతిష్య పరిభాషలో అంటారు. ఇవి కాక కారణ శరీరము అనునది మూలము. కారణ శరీరము అనగా పై రెండు శరీరాలకు (స్థూల, సూక్ష్మ) హేతువై అంటే సంబందపడి నిర్ణీతమార్గమున నడిపించునది. ఉదాహరణకు ఆత్మ ప్రయాణించే వాహనం శరీరమైతే, ఆ వాహనాన్ని నడిపే డ్రైవరు కారణ శరీరమవుతుంది. ఇలా మానవజన్మ ఎత్తిన మనము మనకు తెలియకుండా మరో మూడు రూపములకు (SPLIT PERSONALITY) మనలో నివాసాన్ని కలిగించి జీవితానికి పరమర్ధాన్ని కలిగిస్తుంది. ఈ రూపాలు వయసును బట్టి మారుతూ ఉంటాయి. అంటే పెళ్లైక భార్య/భర్త లో ఉండే రూపాలకు సంబంధపడుతుంటాయి. అందువలనే ‘MARIAGES ARE MADE IN HEAVEN’ అను నానుడి సార్ధకమైనది. ఎన్ని జన్మలు ఎత్తిన భార్యాభర్తల సంబంధము ఆత్మల రూపములో తిరిగి కలుస్తూనే ఉంటుంది. కేవలం ఎవరి జాతకాలలో లగ్నాత్తూ 7 వ స్థానం వక్రించనంతవరకు ఈ సంబంధము చెడదు/మారాదు. ఇలా మానవజన్మ ఒక అవతారములో అనేక రూపములకు కేంద్ర స్థానమైనందువల్ల మానవ జన్మ అతి ఉన్నతమైనదని అంటారు.

19, డిసెంబర్ 2013, గురువారం

జ్యోతిషం శాస్తం లో పర్యాలోచన - 2

                                                     
           జాతకచక్రం అని మనము చూచే ఒక బొమ్మ నిజానికి ఒక ఊహ చిత్రము. ఈ ఊహకు రూపము నిచ్చేది పుట్టిన జీవి యొక్క భూపతన సమయము మరియు పుట్టిన ప్రదేశము యొక్క అక్షాంశరేఖాంశములు. కాలచక్రము అనేబడే ఈ “Zodiac Wheel” విశ్వము ను చుట్టి గుండ్రముగా ఆవరించుకొని ఉన్నట్టుగా ఊహించిన రేఖాచిత్రము. ఇందులో సూచించిన గ్రహాలు అనేబడేవి ‘Astronomy’ పరముగా కాక వాటి యొక్క గతులు (Rotations) మాత్రమే లెక్కలోకి తీసుకొంటూ జ్యోతిష్యశాస్త్ర పరిధిని నిర్దేశించడమైనది. అందువల్ల వక్రించడము, గ్రహణము, దృష్టి అనువాటికి “Astronomy science” కి ఎటువంటి సంబంధము లేవు. ఇక్కడ ప్రతి ఒక్కరూ అయోమయ స్తితిలో పడుతూ అందరినీ కంగారూ పెడుతూ ఉంటారు. శాస్త్ర విషయముగా తీసుకొంటే “గ్రహం”(Sanskrit) అనేది ఒక ఆకర్షణ శక్తి మాత్రమే. పుట్టిన జీవిలో ఉండే పంచ భూతాలు అనబడేవి “నీరు, గాలి, అగ్ని, భూమి మరియు ఆకాశం” ధాతు రూపములో నిక్షిప్తమై ఉంటుంది. ఇవి కాక రస ధాతువులు అనే మరో 7 ధాతువులు కూడా ఉంటుంది. ఈ ధాతువులు కాలాన్ని అనుసరించి వాటి యొక్క ధర్మమును అవి అనుసరిస్తూ మానవాళికి మంచి చెడులను అందిస్తుంది. వీటిని జ్ఞానమునకు అనుసంధిచడానికి నవగ్రహాలను వాడుకోవడం జరిగినది. అలాగే అస్ట్రానమి లోని గ్రహాగతులు(TRANSIT లేదా గోచారము) లెక్కలు కట్టుటకు ఉపయోగిస్తున్నారు. అందుకనే ఈ జ్యోతిష్య శాస్త్రము అందని పండులాగ అనేకమందిని ఊరిస్తూ ఎక్కడలేని ఊహాగానములకు తావిస్తూ అంతుచిక్కకుంది. చంద్ర బలము ఉన్నవారు శాస్త్రపరముగా వివరించగలవారు. అదే సూర్యబలము కలవారు ఆత్మబలముతో కావలసిన ఆత్మలను మాత్రమే పిలుపించుకొని “నాడీ జ్యోతిష్య” పద్దతిలో కేవలం బొటన వ్రేలి ముద్రతో వివరణను ఇస్తున్నారు. అందుకనే వీరు అమావాస్యలో పూజలు చేస్తూ ఉంటారు. ఆ రోజున సూర్యచంద్రులిరువూరు ఒకే అక్షాంశం పై ఉంటారు. ఆత్మబలము అధికముగా కలవారు అనేకమైన విచిత్రములు, లేదా విన్యాసములు చేస్తూ మిగిలిన వాళ్ళను అబ్బురపరుస్తుంటారు. ఉదాహరణకు గాలిలో నుంచి విభూదిని తీయడం, చిన్న చిన్న వస్తువులను సృస్టించడం, విచిత్రమైన మాజిక్ చెయ్యడం, శరీరమునకు ఇనుప మేకులు, తీగలు లాంటివి తగిలించుకోవడం వంటి అనేక పన్లు వీరికి అతి సులభము. ఉదాహరణకు ఇటీవల మరణించిన శ్రీ సత్య సాయి బాబా అందరకు చిరపరిచితమే. ఆయన జాతకచక్రములో ఆత్మకారకుడైన సూర్యుడు శత్రు వర్గాన్ని మొత్తం కబళించడమే అయన చేసిన మహత్తుకు కారణము. అంటే సూర్యుడు శత్రు వర్గమైన శని,శుక్ర,బుధులను వృశ్చిక రాశిలో గ్రహణము చేయుట గమనించగలరు. దీనినే శాస్త్ర రీత్యా combustion అంటారు. ఇది ఒక యోగం. అందువల్ల బాబా గారు శత్రువును కూడా మిత్రుడిలాగా చూడగల సామర్ధ్యము కలిగిఉంటారు. అంతే కాక “అర్ధనారీశ్వర తత్వం” అర్ధమైన వారికి ఈ భావము వేరొక అర్ధాన్ని కూడా ఇస్తుంది. అంతే ఇటువంటి పురుషునికి ఆడదాని అవసరము అక్కర్లేదు అన్నది తెలియచేస్తుంది. అంటే భగవంతుని పూర్తి రూపమును ఈ ఆత్మ సంతరించుకొన్నదని నా అభిప్రాయము. ప్రతి జీవి భగవంతుని స్వరూపమే అని అనుటలో అర్ధము ఇదే. అలా ఆత్మ తన శక్తులను కూడగట్టుకొనలేనప్పుడు అనేక కష్ట నష్టాలకు ఈ వర్తమాన కాలములో జీవి పరీక్షకు నిలబడుతుంటాడు. చంద్ర బలము కలవారు ప్రతి దానికి శాస్త్రీయ దృష్టిని జోడించి వివరణ ఇవ్వగల సమర్ధులు. వీరి యొక్క తార్కిక జ్ఞానము చాలా ఎక్కువ. ప్రతి దానికి ‘Reasoning’, ‘Logic’ మేళవింపు చేసి అతి సున్నితముగా సమస్యను విడకొట్టగలరు.

జ్యోతిషం శాస్తం లో పర్యాలోచన - 1          గణిత శాస్త్రములో “సమితులు – సంయోగములు” తెలిసిన వారికి జ్యోతిష్య శాస్త్రమును అభ్యసించడము చాలా తేలిక. వీరికి మనస్తత్వ విశ్లేషణపై అవగాహన ఉంటే మరింత తేలికగా నేర్చుకోవచ్చు. “సమితులు- సంయోగములు” తెలిసిన వారికి వృత్తము, చాపము, కోణమును లెక్క కట్టడము తప్పక తెలిసి ఉంటుంది. వీటి ద్వారా జ్యోతిష్య చక్రములోని అనేక సూక్ష్మ విభాగాలు వాటి యొక్క ప్రాముఖ్యత తెలుసుకోవచ్చు. జ్యోతిష్య చక్రములోని 12 సంజ్ఞలు 12 సమితులను సూచిస్తుంది. అలాగే 9 గ్రహాలు 9 సమితులను సూచిస్తుంది. ఇవికాక 12 భావాలు 12 సమితులను సూచిస్తుంది. ఈ సమితుల సంగ్రహణలో మనస్తత్వశాస్త్రము యొక్క భాగములు కూడా ఉంటాయి. అలాగే మన దిన చర్యలో భాగము పంచుకొనే భావాలు కూడా అనేకo ఉంటాయి. ఇవే కాక మన సోదర, బంధు, స్నేహిత వర్గము కూడా ఇందులో చేరి ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే “పరాశర మహర్షి” ఇచ్చిన సూచనల ప్రకారము ప్రతి జీవి చేసే అనేక రకములైన పనులను, ఆలోచనలను ఒక్కొక్క సమితులలో భాగము పంచుకొన్నాయి. వీటి యొక్క విశ్లేషణ “జ్యోతిష్య శాస్త్రము”.
        ఒక జాతక చక్రము జాతకుడిని అంటే ఉదయించే క్షేత్రజ్ఞుడిని, అలాగే అతనిని అస్తమింపచేసే శత్రువుని (Descendant) సూచిస్తుంది. ఆంతే కాక జాతకుని తండ్రిని 9 వ స్థానము ద్వారా, తల్లిని 4 వ స్థానము ద్వారా, అలాగే 5 వ స్థానము తాతను, పుత్ర స్థానమును, జాతకుని మూడో సోదర/రి లను సూచిస్తుంది. జాతకుని జన్మ సమయమును బట్టి, ఆంటే పగలు ఐతే సూర్యుడు తండ్రిగాను, రాత్రి ఐతే శని తండ్రి గాను ఉదహరిస్తారు. చుక్కపొడుపుగా వ్యవహరించే శుక్రుడు పగలు తల్లిగా, చంద్రుడు రాత్రి తల్లిగా పేర్కొంటారు. కర్కాటక, వృశ్చిక, మీన లగ్నాలకు మాత్రము చంద్రుడు తండ్రిగా ఒక్కోసారి వ్యవహరిస్తాడు. ఇందుకు కారణము “తారాశశాంఖము” అను పురాణకధలో కనిపిస్తుంది. అందుకనే ఈ లగ్నములలో 6 నవాంశలు శాపగ్రస్త జీవులకు జన్మనిస్తుంది. ప్రతి రాశిలో ఆంటే 30* ఒక సంజ్ఞలో 15* సూర్యుడు, 15* చంద్రుడు దత్తత తీసుకోవడము వల్ల దీనిని హోరా అనే పేరుతో పిలుస్తూ వ్యవహరిస్తుంటారు. ప్రతి జీవి ఇందువలన కలిగిన సౌకర్యము మేరకు సూర్యుడు హోరాగా ఐతే ఆత్మబలమును, చంద్రుడి హోరా ఐతే బుద్ది బలమును పొందుతారు. ఆత్మబలమును కలిగిన వారు అనేకమైన విద్యలు(ఎక్కువగా బుద్దిని ఉపయోగించని) ప్రదర్శిస్తుంటారు. వీటిలో ముఖ్యమైనవి గారడీ, ఆటలు, శరీర పాటవము ప్రదర్శించే అనేక అంశాలు, నాడీ జ్యోతిష్యము లాంటివి ఉంటాయి. అదే బుద్ది బలమును పొందిన వారు చేసిన పనికి వివరణ ఇవ్వగల శక్తి కలిగిఉంటారు. అంటే శాస్త్రవేత్తలు, ఉపధ్యాయవృత్తివారు, మంత్రాoగము చేయువారు, అర్ధశాస్త్ర నిపుణులు, జ్యోతిష్యశాస్త్ర పండితులు మొదలైనవారు. ప్రతి సoయోగములోనూ ఈ ‘హోర’ పని చేయుట వలన సూర్య, చంద్ర బలములు ముఖ్యకారణములైనవి.

      కేవలం ఒకరి జాతక చక్రము నుండి పూర్తి విషయములు తెలుసుకొనుట అసాధ్యము. ఎందుకంటే ఒకరి జాతకము అతని కుటుంబ సభ్యుల జాతక చక్రములో కూడా కనిపిస్తుంది. అలా ఒక్కరి జాతకము అన్నీ మార్గాల ద్వారా అంచనా వేసిన తరువాత కానీ ఒక అంచనాకు రాలేము. ఉదా.: చంద్రుడు తల్లి గాను, పెద్ద భార్యగాను లెక్క కట్టుదురు. ఒకరి జాతకములో జాతకుని తల్లి ఐతే ఆ కుటుంభ సభ్యులలో ఒకరి ఆత్మకు పెద్ద భార్య అవవచ్చు. అంటే ఆ ఇంటి పూర్వీకులలో ఒకరికి ఇద్దరు భార్యలు ఉండవచ్చు. ఇవన్నీ తెలుసుకోవాలంటే జాతకుని సహాయము చాలా అవసరము. లేదా ఆ కుటుంబమునకు తరతరాలుగా జ్యోతిష్యశాస్త్ర పండితులు ఉంటే వారి అంచనాలు అవసరము. ఇవన్నీ కానపుడు ఆ ఇంటి కుటుంబ సభ్యులలో ఒకరికి వారి జాతక బలమును బట్టి “INTUITION” ద్వారా కానీ, లేదా ఆత్మసాక్షాత్కారము కానీ జరిగి విషయము పూర్తిగా అవగాహనకు వస్తుంది. జరగబోయే అనేక కష్టానష్టములు వారి ద్వారా బహిర్గతమవుతాయి. ఇందుకు “పరాశర మహాముని” కొన్ని మార్గములు ఉపదేశించారు. దీని ప్రకారము జాతకుడి చక్రములోని మూడు దశలలో ఒక దశలో విభాగాల ద్వారా గురువు, శుక్రుడు ఒకరికి ఎదురు ఒకరు వస్తే ఆ జాతకుని జీవితము మలుపు తిరిగి కర్మ స్థానాధిపతి ద్వారా తన జీవితములో జ్యోతిష్యశాస్త్ర అభ్యాసానికి అవకాశము అందివస్తుంది. ఇంకొక అంశము లేదా నిబందన లగ్నము నుండి 5వ రాశిలో రాహువు ఉన్నట్లైతే అటువంటి జాతకులకు “కలల” ద్వారా జరుగబోయే విషయాలు ముందస్తుగా తెలుస్తుంది. దానికి కారణము రాహువు పుత్రస్థానములో ఉంటే వారికి పిల్లలు పుట్టి మరణించడము లేదా పిల్లలు పుట్టక పోవడము లేదా వారి కారణముగా పుత్ర రుణబంధము లేకపోవడము జరుగుతుంది. ఇవన్నీ తెలుసుకోవాలంటే ఆయా జాతకుల సహకారము లేదా జ్యోతిష్కుడితో counseling చాలా అవసరము. అలా కానిచో ప్రతి ఒక్కరూ జ్యోతిష్య శాస్త్రమును నేర్చుకొని తమ తమ కర్మను అర్ధము చేసుకోవడానికి ప్రయత్నించాలి. అంతే కానీ ఏ ఒక్క జ్యోతిష్కుడు(పండితుడే కావచ్చు) వలన ఈ కలియుగములో అంటే అధర్మము మూడు కాళ్లతో నడిచే ఈ కాలములో ఒకరి(కుటుంబ) కర్మ గురించి ఇంకొకరి ద్వారా తెలుసుకోవడము నూటికి నూరుపాళ్లు అసాధ్యము.

పంచాంగం - డిసెంబర్ 19, 2013, గురువారం


సంవత్సరము : విజయ
మాసము : మార్గశిరము, పక్షము : కృష్ణపక్షం, వారం : గురువారం
తిథి : విదియ 7:47 pm
నక్షత్రము : పునర్వసు Full Night
యోగము : బ్రహ్మ 11:06 pm
కరణము : గరజ 7:49 pm, వనిజ Full Night
సూర్యరాశి : ధనుస్సు, చంద్రరాశి : మిథునము
సూర్యోదయము : 6:40 am, సూర్యాస్తమయము : 5:42 pm, చంద్రోదయం : 7:28 pm
రాహుకాలము : 1:39 pm-3:01 pm
వర్జ్యం : 5:33 pm-7:16 pm

18, డిసెంబర్ 2013, బుధవారం

రాశి మంత్ర యంత్రములు

శ్రీ మేథా దక్షిణామూర్తి జ్యోతిష నిలయ - రాశి మంత్ర యంత్రములు
aries 2012 copy
|| మేష రాశి  మన్త్రమ్ ||
" ఓం హ్రీం శ్రీం లక్ష్మీ
నారాయణాయ నమః ”
8
3
10
8
3
10
8
3
10
taurus 2012 copy
|| వృష రాశి  మన్త్రమ్ ||
" ఓం గోపాలాయ
ఉత్తర ధ్వజాయ నమః 
11
6
13
12
10
8
7
14
9
gemini 2012 copy
|| మిథున రాశి మన్త్రమ్ ||

 "ఓం క్లీం కృష్ణాయ నమః”
9
4
11
10
8
6
5
12
7
cancer 2012 copy
||కర్కటక రాశి  మన్త్రమ్ ||

" ఓం హిరణ్య గర్భాయ
అవయక్త రుపిణే నమః”
7
2
9
8
6
4
3
10
5
leo 2012 copy
|| సింహ రాశి మన్త్రమ్ ||

" ఓం క్లీం బహ్మణే
జగదా ధారాయ నమః”
8
1
6
3
5
7
4
9
2
virgo 2012 copy
|| కన్యా రాశి మన్త్రమ్ ||

" ఓం నమో ప్రీం
పీతామ్బరాయ నమః
9
4
11
10
8
6
5
12
7
libra 2012 copy
|| తులా రాశి మన్త్రమ్ ||

" ఓం తత్వ నిరంజనాయ
తారకరామాయ నమః ”
11
6
13
12
10
8
7
14
9
scorpio 2012 copy
|| వృశ్చిక రాశి మన్త్రమ్ ||

" ఓం నారాయణాయ
సురసింహాయ నమః ”
8
3
10
9
7
5
4
11
6
sagittarius 2012 copy
|| ధను రాశి మన్త్రమ్ ||

" ఓం శ్రీం దేవకృష్ణాయ
ఊర్ధ్వషంతాయ నమః
10
5
12
11
9
7
6
13
8
capricorn 2012 copy
|| మకర రాశి మన్త్రమ్ ||

" ఓం శ్రీం వత్సలాయ నమః ”
12
7
14
13
11
9
8
15
10
aquarius 2012 copy
|| కుంభ రాశి మన్త్రమ్ ||

" ఓం శ్రీం ఉపేన్ద్రాయ
అచ్యుతాయ నమః ”
13
8
15
14
12
10
9
16
11
pisces 2012 copy
|| మీన రాశి మన్త్రమ్ ||

" ఓం క్లీం ఉద్ ధృతాయ
ఉద్ధారిణే నమః ”
14
9
16
15
13
11
10
17
12
ఈ మన్త్రములను   దానిమ్మ పుల్ల ను  అష్టగంధం లో ముంచి భూర్జపత్రం మీద వ్రాసి
రాగి రక్ష లో ధరించవలెను. ||

17, డిసెంబర్ 2013, మంగళవారం

after the general elections Telangana is inevitable - PV Radhakrishna


P.V.RADHAKRISHNA,
CELL :
+91 9966680542, +91 9966455872, +917659931592


Email :
parakrijaya@gmail.com

2, డిసెంబర్ 2013, సోమవారం

కేతు రత్నధారణ


                            


       

వైడూర్యము :

వైడూర్య రత్నలు కేతు గ్రహానికి సంభంధించినవి. న్యాయాన్యాయ వివేచన, పుణ్యపాప వివక్షత, ధర్మాధర్మ పరిశీలనలు గల చిత్ర గుప్తుని అంశవల్ల ఈ వైడూర్య రత్నాలు పుట్టినట్లు కొందరు చెబుతారు. శరత్కాలంలో చంద్రుని యొక్క షోడస కళలు గల వెన్నెల కిరణలు కొన్ని రసాయన ధాతువులు కలిగిన శిలాభూములయందు ప్రవేశించి అచ్చట రసధాతువులు గల శిలాభూములయందు ప్రవేశించి అచ్చటి రసధాతువులుగల శిలలకు చంద్రకిరణములకు కలిగే పరస్పర సంయోగం వలన ఆశిలలు కొంత కాలానికి వైడూర్య రత్నాలుగా మారతున్నవని కొందరి అభిప్రాయము.
అశ్వని, మఘ, మూల జన్మ నక్షత్రాలుగా కలిగియున్నవారువైడూర్యాన్ని ఏ సమయములో నైనను ధరించవచ్చును. మిగిలిన నక్షత్రములు గలవారు తమ జన్మ కాలమందలి గ్రహస్థితి ననుసరించి కేతువు యొక్క దోషప్రదమైన కాలము నందు ఈ రత్నము ధరించుట ఉత్తమము. జన్మజాతకములందు శుభస్థానములందు కేతువు బలహీనుడై ఉన్నప్పుడు వైడూర్యధారన చేసిన ఆ కేతువు సకల శుభముల నొసగును. బలవంతుడైన కేతుగ్రహము 6-8-12 స్థానములందుండుట ఆ స్థానాధిపతులతో కలసి చూడబడుట చాలా దోషప్రదము. పాపగ్రహముల యతి, దృష్టి వేధల వంటి సంబంధములు కలిగియున్న కేతువు అపకారమును చేయగలడు, లగ్నము నుండి 2 వ స్థానమునందు పాపబలముగల కేతువుండుట, ఆ విధముగా పంచమ స్థానమందుండుట, ఏడవ స్థాన మునందుండుట 9 వ స్థానమునందుండుట కూడా దోషప్రదమే! జన్మ లగ్నము ననుసరించి ఏర్పడిన గ్రహములు బలాబలములందు కేతుగ్రహము పూర్తి బలవంతుడై దుష్ఠ స్థానములందుండగా అతని మహర్దశ, అంతర్దశలు, ఇతర యోగదశలలో ఇతని అంతర్దశలు, విదశలు సంభవించినప్పుడుషడ్వర్గబలము, అషటకవర్గ బిందు బలము కలిగి కేతువు గోచారము నందు దుష్టస్థానములందు సంభవించు గొప్ప భయముతో కూడిన కష్టములు ప్రాప్తించగలవు. అంతే గాక దోషప్రదమైన కేతు గ్రహానికి సంబంధించిన కాలంలో పిచ్చి ఉన్మాదము, భిక్షుక వృత్తి, కృరప్రదేశములందు నివాసము సరియైన ఆహార నిద్రాదులు లేకుండుట, సిరి సంపదలు అకారణముగా తొలగిపోవుట, కృషి నాశనము ఉద్యోగ భంగము, కుటుంబకలహము విరక్తి, భార్య నష్టము పితృమృతి, సంతాన కష్టనష్టములు, దుష్కీర్తి, అపజయము, వేదన, శతృభీతి విషజంతువులచే ప్రమాదము, ధన సంభంధమైన ఇబ్బండులు, కోర్టు వ్యవహారములు కోర్టు వ్యవహారములలో ప్రతికూలత, మనో వ్యద పిల్లల బాలారిష్టములు కురుపులు మొదలగు చేమ వ్యాదులు కలరా, విడువని తల నొప్పి, అజీర్ణవ్యాధులు, దురదలు ఆటలమ్మ, తడపర, ఉబ్బాసం కాన్సర్, ప్రసూతి బాధలు, నొప్పులు సరిగారాక పోవడం, కష్టమైన కాన్పు, గుర్రపు వాతము తీవ్రమైన దరిద్రము, మొదలగు అనేక విషమ పరిణామములు సంభవించి దుఃఖపెట్టగలవు. అటువంటి సందర్భాలలో వైడుర్య రత్నము ధరించడం వలన సత్ఫలితాలు కలుగును.వైడూర్యాల ద్వారా కలిగే శుభయోగాలు : ఉత్తమ జతికి చెందిన దోషరహితమైన వైడూర్యమును ధరించిన యెడల జీవితం అభివృద్ది దాయకంగా నుండుటయే గాక ఆర్ధిక పుష్టి కృషిలో రాణింపు ఉద్యోగ ప్రాప్తి అధికారము జనాదరణ పలుకుబడి, కీర్తి గౌరవ మర్యాదలు, భోగ భాగ్య సంపదలు వాహన ప్రాప్తి గృహ లబ్ది, కళత్ర సౌఖ్యము, కుటుంబ సుఖశాంతులు శతృనాశనము, జయము కార్యశిద్ది దేహా రోగ్యము, సకల వ్యాధినాశనము, ఆయువృద్ది, అరిష్టనివారణ, దుష్టగ్రహ బాధా విముక్తి, దేవతానుగ్రహము సుఖము శాంతి సద్భావన, సజ్జన స్నేహము, సర్పదోష పరిహారము, సంతానప్రాప్తి, వంశాభివృద్ది కలుగగలవు. వైడుర్యము అత్యంత మహిమాన్వితమైనదగుట వలన దీన్ని ధరించెడి వాడికి సకల క్షేమము కలుగ చేయగలదు. ప్రసవకాలంలో స్త్రీలకు కలుగు అనేక బాధలు నివారించి సుఖముగా శీఘ్రముగా ప్రసవము జేయింపగలరు. ఈ రత్నమును నీటియందుంచి ఆ నీటిని ప్రసవ స్త్రీలచే త్రాగించిన శీఘ్రముగా ప్రసవించుటయే గాక ప్రసవానంతరం సంభవించే దుష్టలక్షణముల నుండి పూర్తిగా రక్షణ కలిగించగలదు.. చర్మ వ్యాధులు గలవారు ఈ వైడుర్యము ఆదివాసము గావించిన నీటిచే స్నానము చేసిన అనతి కాలంలోనే చర్మ వ్యాధుల నుండి విముక్తులై ఆరోగ్యవంతులు కాగలరు. గృహము నందలి సింహద్వారామునకు పైభాగమున వైడూర్యములు తాపటము జేయించిన ఆ గృహమునందు నివశించే వారికి అమ్మవారు ఆటలమ్మ, తడపర, కలరా, మొదలగు బాధించవు.
వైడూర్య రత్నము అమోఘమైన శక్తి సంపన్నమై యున్నది. ఇది ధరించిన శతృవులు సైతం మితృలుగా మారిపోగలరు. పగవారు చేయు చేత బడి, ప్రయోగములు మొదలగు కృత్రిమములు భూత భేతాళ, యక్ష రాక్షస, శాకినీ, కామినీ మొహినీ, గ్రహబాధలు దరిజేరలేవు. దీని వలన జీవితములో మంచి అభివృద్ది, మేధాశక్తి, ఆలోచనా పటిమను, కర్య సాధన, జనాకర్షన, జనరంజనలకీ వైడూర్యమును మించిన రత్నము మరొకటి లేదు.
వైడూర్యము ధరించే పద్ధతి :
రత్నాలకు గ్రహాలకు చాలా అవినాభావ సంభంధంఉంది. అదే విధంగా మానవ జీవితాలకు కూడా దగ్గర సంభంధం ఉన్నది.జీవితంలో కలిగే కష్టసుఖాలు, వ్యాధిబాధలు, దుఃఖసంతోషా