శ్రీ మేధా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం

మీరు జన్మించిన తేది, సమయం, ప్రదేశం ఈ మూడు సమాచారములు మాకు తెలియచేసినచో మీ వ్రుత్తి,వ్యాపార,ఆరోగ్య,ఆర్ధిక పరిస్తితులు, దాంపత్యం, విద్య, ఉద్యోగ, వివాహ, కుటుంబవ్యవహారాలు, సంతానం, రాజకీయ వ్యవహారాలు,ప్రేమ వ్యవహారములు,కుజ దోషం, కాలసర్ప దోషం మరియు వివాహ, ఉపనయన, గృహప్రవేస, జప, హోమ, వ్రత, అన్నప్రసన, నామకరణం లకు ముహూర్తములు పెట్టబడును. P.V.RADHAKRISHNA CELL :+91 7013390324, Mail us :parakrijaya@gmail.com
Get your horoscope by giving Date, time and place of birth. Do you have mobile no. 9966455872 Live chat with WhatsApp Pantula Venkata RadhaKrishna.Get a solution to your horoscope problems

22, మార్చి 2013, శుక్రవారం

విశ్వనాధీయ స్వప్నశాస్త్రము - పంతుల విశ్వనాధం

గ్రహావస్థలు - శత్రువులు మిత్రులు సములు

గ్రహాలు శత్రువులు మిత్రులు సములు

గ్రహం మిత్రుడు శత్రువు సముడు
రవి చంద్రుడు, కుజుడు, గురువు శని,శుకృడు బుధుడు
చంద్రుడు రవి, బుధుడు శత్రువులు లేరు మిగిలిన వారు సములు
కుజుడు గురువు, చంద్రుడు, రవి బుధుడు శుక్రుడు, శని
బుధుడు శుకృడు, రవి చంద్రుడు కుజుడు, గురువు, శని
గురువు కుజుడు, చంద్రుడు బుధ, శుకృడు రవి, శని
శుకృడు శని, బుధుడు రవి, చంద్రుడు కుజుడు, గురువు
శని శుకృడు, బుధుడు రవి, చంద్రుడు, కుజుడు గురువు
రాహువు శని, శుకృడు రవి, చంద్రుడు, కుజుడు గురువు, బుధుడు
కేతువు రవి, చంద్రుడు, కుజుడు శని, శుకృడు బుధుడు, గురువు

జన్మలగ్నము

భూమి తనచుట్టూ తాను తిరిగే ఆత్మ ప్రదక్షిణ కాలంలో ప్రతి రెండు గంటలకు లగ్నం మారుతూ 24 గంటల సమాయాన్ని 12 రాశుల లగ్నాలుగా విభజిస్తూ జ్యోతిష్య గణన చేస్తారు. చైత్రమాసం పాడ్యమి సూర్యోదయం మేష లగ్నంతో ఆరంభం ఔతుంది. ఒక రోజుకు నాలుగు నిమిషాల కాలం ముందుకు జరుగుతూ చేర్చుకొని ఒక మాసకాలంలో 120 నిమిషాలు లగ్న కాలం మారుతూ వైశాఖమాస ప్రారంభం వృషభ లగ్నంతో ఉదయం ఆరంభం ఔతుంది. ఈ విధంగా లగ్న గణన చేస్తూ జాతకుడు పుట్టిన లగ్న నిర్ణయం చేస్తారు.

ఛాయాగ్రహాలు

జ్యోతిష్య శాస్రంలో రాహుకేతువులు ఛాయా గ్రహాలు. వీటికి జ్యోతిష్య శాస్రంలో ఇల్లు లేదు. రాహుకేతువులు అపసవ్య మార్గంలో ప్రయాణం చేస్తాయి. రాహువు కేతువుకు సరిగ్గా ఏడు రాశులు దూరంలో ప్రయాణం చేస్తాయి. కనుక ఈ రెండు గ్రాహాలు ప్రయాణకాలం సమమే. రాహువును కాలసర్పంగా వ్యవహరిస్తారు. రాశి చక్రంలో రాహువు కేతువుకు మద్యలో అన్ని గ్రహాలు ఉంటే దానిని కాలసర్ప దోషంగా నిర్ణయిస్తారు.

గ్రహస్థితి బలాబలాలు

జ్యోతిష శాస్త్రమున గ్రహములు దిగ్బలం, స్థానబలం, కాల బలం, చేష్టాబలం అను నాలుగు విధముల బలనిర్ణయం చేస్తారు , లగ్నంలో గురువు, బుధుడు ఉన్న బలవంతులు. నాలుగవ స్థానములో చంద్రుడు, శుక్రుడు ఉన్న బలవంతులు. పదవ స్థానమున సూర్యుడు, కుజుడు బలవంతులు. స్వ స్థానమున, ఉచ్ఛ స్థానమున, త్రికోణమున, మిత్ర స్థానమున, స్వ నవాంశ అందు ఉన్న గ్రహములు, శుభ దృష్టి గ్రహములు బలముకలిగి ఉంటాయి. స్త్రీ క్షేత్రములైన వృషభము, కటకము, కన్య, వృశ్చికము, మకరము, మీనములందు చంద్రుడు, శుక్రుడు బలవంతులు. పురుష రాశులైన మేషము, మిధునము, సింహము, తుల, ధనస్సు, కుంభములందు సూర్యుడు, కుజుడు, గురువు, బుధుడు, శని బలవంతులు. సూర్యుడు, కుజుడు, శుక్రుడు పగటి అందు బలవంతులు. రాత్రి అందు బుధుడు, శని, గురువు బలవంతులు. సర్వ కాలమందు బుధుడు బలవంతుడు. శుక్ల పక్షమున శుభగ్రహములు, కృష్ణ పక్షమున పాపగ్రహములు బలవంతులు. యుద్ధమున జయించిన వాడు, వక్రగతి కల వాడు, సూర్యుడికి దూరముగా ఉన్న వాడు చేష్టా బలం కలిగిన వాడు. అంటే ఉత్తరాయణమున కుజుడు, గురువు, సూర్యుడు, శుక్రుడు దక్షిణాయనమున చంద్రుడు, శని రెండు ఆయనముల అందు స్వక్షేత్రమున ఉన్న బుధుడు చేష్టా బలము కల వారు. స్త్రీ గ్రహములైన చంద్రుడు, శుక్రుడు రాశి మొదటి స్థానమున ఉన్న బలము కలిగి ఉంటారు. పురుష గ్రహములైన సూర్యుడు, కుజుడు, గురువు రాశి మధ్యమున ఉన్న బలము కలిగి ఉంటాయి. నపుంసక గ్రహములైన బుధుడు, శని రాశి అంతమున ఉన్నచేష్టా బలము కలిగి ఉంటాయి. రాత్రి అందు మొదటి భాగమున చంద్రుడు, అర్ధరాత్రి అందు శుక్రుడు, తెల్లవారు ఝామున కుజుడు, ఉదయకాలమున బుధుడు, మధ్యహ్న కాలమున సూర్యుడు, సాయం కాలమున శని సర్వ కాలమందు గురువు బలవంతులు. శనికంటే కుజుడు, కుజుని కంటే బుధుడు, బుధునికంటే గురువు, గురువుకంటే శుక్రుడు, శుక్రునికంటే చంద్రుడు, చంద్రునికంటే సూర్యుడు బలవంతులు.

గ్రహావస్థలు

గ్రహావస్థలు పది రకాలు. (1) స్వస్థము, (2) దీప్తము, (3) ముదితము, (4) శాంతము, (5) శక్తము, (6) పీడితము, (7) దీనము, (8) వికలము, (9) ఖల, (10) భీతము అనేవి ఆ అవస్థలు.
 1. స్వస్థము: స్వక్షేత్ర మందున్న గ్రహము స్వప్నావస్తను పొందును.
 2. దీప్తము: ఉచ్ఛక్షేత్ర మందున్న గ్రహము దీప్తావస్త నందుండును.
 3. ముదితము: మిత్ర క్షేత్ర మందున్న గ్రహము ముదితావస్తను పొందును.
 4. శాంతము: సమ క్షేత్ర మందున్న గ్రహము శాంతావస్తను పొందును.
 5. శక్తము: వక్రించి యున్న గ్రహము శక్త్యావస్తను పొందును.
 6. పీడితము: రాశి అంతమున 9 సక్షత్ర పాదములలో చివరి పాదము నందున్న గ్రహము పీడావస్థను పొందును.
 7. దీనము: శత్రు క్షేత్ర మందున్న గ్రహము దీనావస్థను పొందును.
 8. వికలము: అస్తంగత మయిన గ్రహము వికలావస్థను పొందును.
 9. ఖల: నీచ యందున్న గ్రహము ఖలావస్థను పొందును.
 10. భీతము: అతిచారము యందున్న గ్రహము భీత్యావస్థను పొందును.
ఉచ్ఛ స్థానమున ఉన్న దీప్తుడు, స్వక్షేత్రమున ఉన్న స్వస్థుడు, మిత్రక్షేత్రమున ఉన్న ముదితుడు, శుభవర్గమున ఉన్న శాంతుడు, సూర్యునకు దూరమున ఉన్న శక్తుడు, అస్తంగతుడైన వికలుడు, యుద్ధమున పరాజితుడైన పీడితుడు, పాప వర్గమున ఉన్న ఖలుడు, నీచ అందు ఉన్న భీతుడు అని అంటారు. అలాగే సూర్యుడి సామీప్యాన్ని ఆధారంగా చేసుకుని గ్రహగతులను నిర్ణయిస్తారు. సూర్యునితో చేరి ఉన్న గ్రహము అస్తంగత గ్రహం అంటారు.సూర్యునికి రెండవ స్థానంలో ఉన్నశీఘ్రగతిని పొందిన గ్రహం అంటారు. సూర్యుని నాల్గవ స్థానమున ఉన్న గ్రహాన్ని మందుడు అంటారు. సూర్యునికి అయిదు ఆరు రాశులలో ఉన్న గ్రహం వక్రగతిని పొందిన గ్రహం అంటారు. సూర్యునికి ఏడు ఎనిమిది స్థానాలలో ఉన్న గ్రహం అతి వక్రగతిని పొందిన గ్రహం అంటారు.సూర్యునికి తొమ్మిది, పది స్థానాలలో ఉన్న గ్రహం కుటిలగతి పొందిన గ్రహం అంటారు. సూర్యునికి పదకొండు, పన్నెండు స్థానాలలో ఉన్న గ్రహాన్ని అత్యంత శీఘ్రగతిన ఉన్న గ్రహం అంటారు.

21, మార్చి 2013, గురువారం

గోచార ఫలదర్శన చక్రం

 గోచార ఫలదర్శన చక్రం

స్థానం రవి చంద్రుడు కుజుడు బుధుడు గురువు శుక్రడు శని రాహువు కేతువు
1 స్థానచలనం సౌజన్యం దు॰ఖం బంధనం గమనం ఆరోగ్యం విపత్తు భయం భయం
2 భయం వ్యయం వ్యయం లాభం ధనలాభం భాగ్యం హాని కలహం విరోధం
3 సంపత్తు లాభం లాభం వ్యయం విపత్తు సౌభాగ్యం సంపద సౌఖ్యం సుఖం
4 మానభంగం హాని రిపుభయం శుభం వ్యయం సుఖం రోగం మానహాని మానహాని
5 భయం కార్యనాశం రిపుభయం దరిద్రం సంపద పుత్రలాభం సుతక్షయం ధనవ్యయం క్లేశం
6 రిపుహాని శుభం ధనలాభం భూషణం దు॰ఖం వ్యయం సంపద సుఖం సంతోషం
7 దేహపీడ లాభం కలహం వ్యసనం ఆరోగ్యం క్లేశం రాజాగ్రహం భయం భీతి
8 రోగం వ్యయం భయం సంతోషం హాని భయం దు॰ఖం మృత్యువు హాని
9 భయం వ్యాకులం వ్యయం దు॰ఖం ధనాగమం ధనలాభం రోగం సంతానం కలహం
10 లాభం లాభం చలనం శుభం హాని సౌఖ్యం జాడ్యం కలహం విరోధం
11 ఆరోగ్యం శుభం లాభం సుఖం సంతోషం సౌఖ్యం లాభం లాభం ధనాగమం
12 వ్యయం దు॰ఖం రోగం వ్యయం పీడ లాభం క్లేశం హాని హాని

విశ్వనాధీయ ప్రశ్నశాస్త్రము - పంతుల విశ్వనాధం

19, మార్చి 2013, మంగళవారం

వాస్తు - వర్గులు


స్వవర్గు - ధన లాభం
ద్వితీయ వర్గు - స్వల్ప లాభం
తృతీయ వర్గు - శుభ ప్రదం
చతుర్థ వర్గు - వ్యాధులు
పంచమ వర్గు - శత్రు క్షేత్రం
షష్టమ వర్గు - కలహ ప్రదం (మతాంతరంలో లక్ష్మీ ప్రదం)
సప్తమ వర్గు - సర్వ సౌభాగ్యం
అష్టమ వర్గు - మరణ ప్రదం
18, మార్చి 2013, సోమవారం

గ్రహముల గోచార ఫలములు

సూర్యడు:-
 • చంద్రలగ్నంలోనే ఉంటే జాతకుడు కుటుంబానికి దూరంగా ఉంటాడు. పనులకు ఆటంకాలు కలుగుతాయి. అనవసరశ్రమ, అనారోగ్యం కలుగుతుంది.
 • చంద్రలగ్నం లగాయతు రెండవరాశిలో ఉంటే అనవసరశ్రమ, అనారోగ్యం, అశాంతి కలుగుతాయి.
 • చంద్రలగ్నం లగాయతు మూడవరాశిలో ఉంటే మిత్రుల సహకారం, ఉద్యోగంలో అభివృద్ధి, ధనలాభం, సుఖశాంతులు లభిస్తాయి.
 • చంద్రలగ్నం లగాయతు నాలుగవరాశిలో ఉంటే కుటుంబంలో కలహాలు, ఋణబాధ కలుగుతాయి.
 • చంద్రలగ్నం లగాయతు అయిదవరాశిలో ఉంటే బంధువియోగం , దుఃఖము, అశాంతి కలుగును.
 • చంద్రలగ్నం లగాయతు ఆరవరాశిలో ఉంటే అనుకున్న పనులు నెరవేరుతాయి. ధనలాభం, కుటుంబంలో సుఖశాంతులు కలుగుతాయి. అనారోగ్యం కలుగుతుంది.
 • చంద్రలగ్నం లగాయతు ఏడవరాశిలో ఉంటే అధికప్రయాణాలు, అనారోగ్యం, దాంపత్యసుఖం లేకపోవుట, ఆందోళన కలుగుతుంది.
 • చంద్రలగ్నం లగాయతు ఎనిమిదవరాశిలో ఉంటే కుటుంబకలహాలు, అనారోగ్యం, అశాంతి, ధననష్టం కలుగుతాయి.
 • చంద్రలగ్నం లగాయతు తొమ్మిదవరాశిలో ఉంటే అనవసర కలహాలు, మనశ్శాంతి లేకపోవుట, ధనవ్యయం కలుగుతాయి.
 • చంద్రలగ్నం లగాయతు పదవరాశిలో ఉంటే అనుకున్న పనులు నెరవేరుతాయి. మిత్రులతో విందులు చేసుకుంటారు.
 • చంద్రలగ్నం లగాయతు పదకొండవరాశిలో ఉంటే వృత్తిలో అభివృద్ధి, కుటుంబంలో ఆనందం, ధనలాభం కలుగుతాయి.
 • చంద్రలగ్నం లగాయతు పన్నెండవరాశిలో ఉంటే మితులకు దూరంగా ఉంటారు. ఆందోళన, ధననష్టం కలుగుతుంది.
 • రవి శుభస్థానములు 3,6,10,11
 • రవి వేధాస్థానములు 9,12,4,3
 • శుభస్థానములలో ఉన్నగ్రహము, ఆగ్రహము యొక్క వేధా స్థానములలో ఏదైనా గ్రహము ఉంటే శుభఫలితాన్ని ఇవ్వలేదు. 
 చంద్రడు:-

 • చంద్రలగ్నంలోనే ఉంటే కుటుంబసౌఖ్యం, ఆరోగ్యం, గౌరవం కలుగుతుంది.
 • చంద్రలగ్నం లగాయతు రెండవరాశిలో ఉంటే ధనవ్యయం, కార్యహాని, అపనిందలు, ఇతరులతో విభేదాలు కలుగుతాయి.
 • చంద్రలగ్నం లగాయతు మూడవరాశిలో ఉంటే మిత్రుల సహకారమ్, ఉద్యోగంలో అభివృద్ధి, ధనలాభం, కుటుంబసౌఖ్యం కలుగుతాయి.
 • చంద్రలగ్నం లగాయతు నాలుగవరాశిలో ఉంటే బంధువులతో విభేదాలు, కార్యహాని, ఆందోళన కలుగుతాయి.
 • చంద్రలగ్నం లగాయతు అయిదవరాశిలో ఉంటే పనులు నెరవేరవు. అనారోగ్యము ఏర్పడుతుంది.
 • చంద్రలగ్నం లగాయతు ఆరవరాశిలో ఉంటే నూతన వస్తువులు సమకుర్చుకుంటారు. బంధుమిత్రులతో వినోద కాలక్షేపం చేస్తారు. స్త్రీ సాంగత్యం కలుగుతుంది.
 • చంద్రలగ్నం లగాయతు ఏడవరాశిలో ఉంటే బంధువుల సమాగమం, విలాస యాత్రలు చేయుట, స్త్రీసౌఖ్యం కలుగుతుంది.
 • చంద్రలగ్నం ఎనిమిదవరాశిలో ఉంటే మానసిక ఒత్తిడి, అనారోగ్యం కలుగుతాయి.
 • చంద్రలగ్నం తొమ్మిదవరాశిలో ఉంటే మానసిక ఆందోళన, నిరాశ, బలహీనత ఏర్పడుతాయి.
 • చంద్రలగ్నం లగాయతు పదవరాశిలో ఉంటే అధికారంలో అభివృద్ధి, కుటుంబంలో సుఖసంతోషాలు, ఆర్థికాభివృద్ధి కలుగుతాయి.
 • చంద్రలగ్నం లగాయతు పదకొండవరాశిలో ఉంటే నూతన వ్యక్తులతో పరిచయాలు, స్త్రీ సాంగత్యం, కుటుంబాభివృద్ధి కలుగుతాయి.
 • చంద్రలగ్నం లగాయతు పన్నెండవరాశిలో ఉంటే మిత్రులతో విభేదిస్తారు. పనులు నెరవేరవు.
 • చంద్రుడు శుభస్థానములు1,3,6,7,10,11
 • వేధాస్థానములు 5,9,12,2,4,8
 • శుభస్థానములలో ఉన్నగ్రహము, ఆగ్రహము యొక్క వేధా స్థానములలో ఏదైనా గ్రహము ఉంటే శుభఫలితాన్ని ఇవ్వలేదు.
కుజుడు:-
 • చంద్రలగ్నంలోనే ఉంటే బంధువులతో తగాదాలు, ధననష్టం, కార్యహాని, కలుగుతాయి.
 • చంద్రలగ్నం లగాయతు రెండవరాశిలో ఉంటే అధికారుల వలన భయం, అనవసరశ్రమ కలుగుతాయి.
 • చంద్రలగ్నం లగాయతు మూడవరాశిలో ఉంటే అనుకున్న పనులు నెరవేరుతాయి. సంతానసుఖము, ఆరోగ్యం, ఉద్యోగంలో అభివృద్ధి కలుగుతాయి.
 • చంద్రలగ్నం లగాయతు నాలుగవరాశిలో ఉంటే ఇతరులను నమ్మిమోసపోతాడు. అనారోగ్యం కలుగుతుంది.
 • చంద్రలగ్నం లగాయతు అయిదవరాశిలో ఉంటే కుమారునివలన మనశ్శాంతి కోల్పోవుదురు. కోపము, బలహీనత కలుగును.
 • చంద్రలగ్నం లగాయతు ఆరవరాశిలో ఉంటే కార్యసిద్ధి కలుగుతుంది. నూతన వస్తువులను సేకరిస్తారు.
 • చంద్రలగ్నం లగాయతు ఏడవరాశిలో ఉంటే బంధుమిత్రులతో విభేదాలు, అశాంతి కలుగుతుంది.
 • చంద్రలగ్నం ఎనిమిదవరాశిలో ఉంటే నిరాశ, అశాంతి, అనారోగ్యం కలుగుతాయి.
 • చంద్రలగ్నం తొమ్మిదవరాశిలో ఉంటే ప్రయాణాలు, ధననష్టం, అవమానము, ఆందోళన కలుగుతాయి.
 • చంద్రలగ్నం లగాయతు పదవరాశిలో ఉంటే ప్రయాణాలు, ధననష్టం, అవమానము, ఆందోళన కలుగుతాయి.
 • చంద్రలగ్నం లగాయతు పదకొండవరాశిలో ఉంటే అనుకున్న పనులు జరుగుతాయి. భూ, ధనలాభం, స్త్రీసౌఖ్యం పొందుతారు.
 • చంద్రలగ్నం లగాయతు పన్నెండవరాశిలో ఉంటే అధిక ధనవ్యయం, స్త్రీలతో వైఅరం కలుగుతాయి.
 • కుజుడు శుభస్థానములు 3,6,11
 • కుజుడు వేధాస్థానములు12,9,5
 • శుభస్థానములలో ఉన్నగ్రహము, ఆగ్రహము యొక్క వేధా స్థానములలో ఏదైనా గ్రహము ఉంటే శుభఫలితాన్ని ఇవ్వలేదు.
 బుధుడు:-
 • చంద్రలగ్నంలోనే ఉంటేనీచులతో స్నేహం, బంధువులతో విరోధం, ఆస్తినష్టం కలుగుతుంది.
 • చంద్రలగ్నం లగాయతు రెండవరాశిలో ఉంటే అనుకున్న పనులు నెరవేరుతాయి. ధనలాభం కలుగుతుంది. కాని అవమానం పొందుతారు.
 • చంద్రలగ్నం లగాయతు మూడవరాశిలో ఉంటే మిత్రుల సహకారం లభిస్తుంది. బంధువులతో, అధికారులతో విభేదాలు కలుగుతాయి. ధనవ్యయం జరుగుతుంది.
 • చంద్రలగ్నం లగాయతు నాలుగవరాశిలో ఉంటే బంధు, మిత్రుల సహకారం, దనము, సుఖము లభించును.
 • చంద్రలగ్నం లగాయతు అయిదవరాశిలో ఉంటే కుటుంబం లో కలహాలు, అశాంతి ఏర్పడుతాయి. సుఖసంతోషాలు లభిస్తాయి.
 • చంద్రలగ్నం లగాయతు ఆరవరాశిలో ఉంటే నాయకుడు అవుతాడు. ధనవృద్ధి కలుగుతుంది. సుఖ సంతోషాలు లభిస్తాయి.
 • చంద్రలగ్నం లగాయతు ఏడవరాశిలో ఉంటే కార్యహాని, కలహాలు, ధనవ్యయం, అశాంతి కలుగుతాయి.
 • చంద్రలగ్నం ఎనిమిదవరాశిలో ఉంటే అధికారుల అండ లభిస్తుంది. అనుకున్న పనులు నెరవేరును. ఆనందం పొందుతారు.
 • చంద్రలగ్నం తొమ్మిదవరాశిలో ఉంటే బద్దకం పెరుగుతుంది. నీచకార్యాలపై ఆసక్తి కలుగుతుంది.
 • చంద్రలగ్నం లగాయతు పదవరాశిలో ఉంటే ఉద్యోగాభివృద్ది, కీర్తి, ధనము లభిస్తాయి.
 • చంద్రలగ్నం లగాయతు పదకొండవరాశిలో ఉంటే నూతన వ్యక్తుల పరిచయం, సంఘం లో గౌరవం ఏర్పడుతాయి. అనుకున్న పనులు సాధిస్తారు.
 • చంద్రలగ్నం లగాయతు పన్నెండవరాశిలో ఉంటే కుటుంబంలో సమస్యలు, శత్రువుల వలన బాధలు, అపజయము కలుగుతాయి.
 • బుధుడు శుభస్థానములు 2,4,6,8,10,11
 • బుధుడు వేధాస్థానములు 5,3,9,1,7,12
 • శుభస్థానములలో ఉన్నగ్రహము, ఆగ్రహము యొక్క వేధా స్థానములలో ఏదైనా గ్రహము ఉంటే శుభఫలితాన్ని ఇవ్వలేదు. 
 గురుడు:-
 • చంద్రలగ్నంలోనే ఉంటే ప్రయాణాలు, ధనవ్యయం, ఆందోళన, బంధువులతో విభేదాలు కలుగుతాయి.
 • చంద్రలగ్నం లగాయతు రెండవరాశిలో ఉంటే స్త్రీసౌఖ్యం, అధికారం లభిస్తాయి. ధనార్జన ఉంటుంది.
 • చంద్రలగ్నం లగాయతు మూడవరాశిలో ఉంటే స్థానచలనము, పనులకు ఆటంకాలు ఏర్పడుతాయి
 • చంద్రలగ్నం లగాయతు నాలుగవరాశిలో ఉంటే ఉద్యోగంలో ఇబ్బందులు, అధికారం కోల్పోవుట, ఆందోళన కలుగుతాయి.
 • చంద్రలగ్నం లగాయతు అయిదవరాశిలో ఉంటే మిత్రుల సహకారం, ధనము, అదికారము లభించును. శుభకార్యములు నెరవేర్చుదురు.
 • చంద్రలగ్నం లగాయతు ఆరవరాశిలో వుంటే శ్రమపడినా ఫలితం దక్కదు. దాంపత్యసుఖం లభించదు.
 • చంద్రలగ్నం లగాయతు ఏడవరాశిలో ఉంటే సమాజంలో గౌరవం, కుటుంబ సుఖం, ధనలాభం కలుగుతాయి.
 • చంద్రలగ్నం ఎనిమిదవరాశిలో ఉంటే ప్రయాణాలు, అనవసర శ్రమ, ధననష్టం కలుగుతాయి.
 • చంద్రలగ్నం తొమ్మిదవరాశిలో ఉంటే అనుకున్న పనులు జరుగుతాయి. కుటుంబసఖము, అధికారము లభిస్తాయి.
 • చంద్రలగ్నం లగాయతు పదవరాశిలో ఉంటే వృత్తిపరంగా, కుటుంబపరంగా ఇబ్బందులు కలుగుతాయి.
 • చంద్రలగ్నం లగాయతు పదకొండవరాశిలో ఉంటే ఉద్యోగం, అధికారం, దనము, సుఖము లభిస్తాయి.
 • గురుడు శుభస్థానములు 2,5,7,9,11
 • గురుడు వేధాస్థానములు 12,4,3,10,8
 • శుభస్థానములలో ఉన్నగ్రహము, ఆగ్రహము యొక్క వేధా స్థానములలో ఏదైనా గ్రహము ఉంటే శుభఫలితాన్ని ఇవ్వలేదు.
 శుక్రుడు:-
 • చంద్రలగ్నంలోనే ఉంటే కుటుంబసుఖం, విద్యాభివృద్ధి, ఉద్యోగం లభిస్తాయి.
 • చంద్రలగ్నం లగాయతు రెండవరాశిలో ఉంటే కుటుంబంలో ఆనందం, ధనలాభం, సుఖశాంతులు లభిస్తాయి.
 • చంద్రలగ్నం లగాయతు మూడవరాశిలో ఉంటే నూతన పరిచయాలు, సంఘంలో గౌరవం కలుగుతాయి. అధికారం లభిస్తుంది.
 • చంద్రలగ్నం లగాయతు నాలుగవరాశిలో ఉంటే మిత్రులతో వినోదయాత్రలు చేస్తారు. ధాన్యలాభం, సుఖశాంతులు పొందుతారు.
 • చంద్రలగ్నం లగాయతు అయిదవరాశిలో ఉంటే మిత్రుల సహకారంతో అనుకున్న పనులు నెరవేరుతాయి.
 • చంద్రలగ్నం లగాయతు ఆరవరాశిలో ఉంటే ధనవ్యయము అవుతుంది. ఋణము చేస్తారు.
 • చంద్రలగ్నం లగాయతు ఏడవరాశిలో ఉంటే స్త్రీల వలన సమస్యలు, ఇబ్బందులు ఏర్పడుతాయి.
 • చంద్రలగ్నం ఎనిమిదవరాశిలో ఉంటే మిత్రుల కలయిక, ధనము, స్త్రీసౌఖ్యం, ఆరోగ్యం లభిస్తాయి.
 • చంద్రలగ్నం తొమ్మిదవరాశిలో ఉంటే మిత్రులు సహకరిస్తారు. అనుకున్న పనులు నెరవేరుతాయి. సుఖశాంతులు కలుగుతాయి.
 • చంద్రలగ్నం లగాయతు పదవరాశిలో ఉంటే మిత్రులు సహకరిస్తారు. ఉద్యోగరీత్యా శుభప్రదం. వ్యసనాల వలన అవమానాలు పొందుతారు.
 • చంద్రలగ్నం లగాయతు పదకొండవరాశిలో ఉంటే మిత్రులు సహకరిస్తారు. స్త్రీ సౌఖ్యం లభిస్తుంది.
 • చంద్రలగ్నం లగాయతు పన్నెండవరాశిలో ఉంటే స్త్రీలతో పరిచయాలు, అధికవ్యయం కలుగుతుంది. అనుకున్న పనులు జరగవు.
 • శుక్రుడు శుభస్థానములు 1,2,3,4,5,8,9,10,12
 • శుక్రుడు వేధాస్థానములు 8,7,1,10,9,5,11
 • శుభస్థానములలో ఉన్నగ్రహము, ఆగ్రహము యొక్క వేధా స్థానములలో ఏదైనా గ్రహము ఉంటే శుభఫలితాన్ని ఇవ్వలేదు.
 మందుడు(శని):-
 • చంద్రలగ్నంలోనే ఉంటే దూరప్రయాణాలు, అనారోగ్యం, పనులకు ఆటంకాలు కలుగుతాయి.
 • చంద్రలగ్నం లగాయతు రెండవరాశిలో ఉంటే ఆర్థికంగా ఇబ్బందులు, అనారోగ్యం, అశాంతి కలుగుతాయి.
 • చంద్రలగ్నం లగాయతు మూడవరాశిలో ఉంటే అనుకున్న పనులు నెరవేరుతాయి. ఇతరులవలన తన పనులు జరుగుతాయి. అనారోగ్యం కలుగుతుంది.
 • చంద్రలగ్నం లగాయతు నాలుగవరాశిలో ఉంటే పనులకు ఆటంకాలు ఏర్పడును. అనవసరంగా ధనవ్యయం జరుగును.
 • చంద్రలగ్నం లగాయతు అయిదవరాశిలో ఉంటే భార్యకు అనారోగ్యం కలుగుతుంది. అనవసరంగా ధనం వ్యయమవుతుంది.
 • చంద్రలగ్నం లగాయతు ఆరవరాశిలో ఉంటే ఆరోగ్యం, ధనలాభం, కుటుంబసౌఖ్యం కలుగుతుంది.
 • చంద్రలగ్నం లగాయతు ఏడవరాశిలో ఉంటే ప్రయాణాలు, అలసట, అనారోగ్యం కలుగుతాయి.
 • చంద్రలగ్నం ఎనిమిదవరాశిలో ఉంటే కుటుంబ సమస్యలు ఏర్పడుతాయి.
 • చంద్రలగ్నం తొమ్మిదవరాశిలో ఉంటే అధికారుల వలన బాధలు అనవసర ప్రయాణాలు, అనారోగ్యం కలుగుతుంది.
 • చంద్రలగ్నం లగాయతు పదవరాశిలో ఉంటే ఉద్యోగం లభిస్తుంది. నీచకార్యాలపై ఆసక్తి కలుగుతుంది.
 • చంద్రలగ్నం లగాయతు పదకొండవరాశిలో ఉంటే కుటుంబసుఖము, గౌరవము, ధనము లభిస్తాయి.
 • చంద్రలగ్నం లగాయతు పన్నెండవరాశిలో ఉంటే అనవసర శ్రమ, అనారోగ్యం, ధననష్టం కలుగుతాయి.
 • శని శుభస్థానములు 3,6,11
 • శని వేధాస్థానములు 12,9,5
 • శుభస్థానములలో ఉన్నగ్రహము, ఆగ్రహము యొక్క వేధా స్థానములలో ఏదైనా గ్రహము ఉంటే శుభఫలితాన్ని ఇవ్వలేదు.
రాహువు:-
 • చంద్రలగ్నంలోనే ఉంటే అనారోగ్యం, ప్రాణాపాయం కలుగుతాయి.
 • చంద్రలగ్నం లగాయతు రెండవరాశిలో ఉంటే ధననష్టం కలుగుతుంది.
 • చంద్రలగ్నం లగాయతు మూడవరాశిలో ఉంటే సుఖశాంతులు కలుగుతాయి.
 • చంద్రలగ్నం లగాయతు నాలుగవరాశిలో ఉంటే కష్టములు కలుగుతాయి.
 • చంద్రలగ్నం లగాయతు అయిదవరాశిలో ఉంటే ధననష్టము కలుగును.
 • చంద్రలగ్నం లగాయతు ఆరవరాశిలో వుంటే కుటుంబ సుఖము, సంతోషము కలుగుతాయి.
 • చంద్రలగ్నం లగాయతు ఏడవరాశిలో ఉంటే పనులు నెరవేరవు. ధననష్టం జరుగుతుంది.
 • చంద్రలగ్నం ఎనిమిదవరాశిలో ఉంటే అనారోగ్యం, ఆపద కలుగుతాయి.
 • చంద్రలగ్నం తొమ్మిదవరాశిలో ఉంటే పనులు నెరవేరవు. ధననష్టం కలుగుతుంది.
 • చంద్రలగ్నం లగాయతు పదవరాశిలో ఉంటే కార్యసిద్ధి కలుగుతుంది.
 • చంద్రలగ్నం లగాయతు పదకొండవరాశిలో ఉంటే కుటుంబసుఖము, స్త్రీ సాంగత్యం లభిస్తుంది.
 • చంద్రలగ్నం లగాయతు పన్నెండవరాశిలో ఉంటే పనులు నెరవేరవు. అనవసర శ్రమ, ధనవ్యయం కలుగుతాయి.
 కేతువు:-
 • చంద్రలగ్నం లగాయతు రెండవరాశిలో ఉంటే అనారోగ్యం కలుగుతుంది.
 • చంద్రలగ్నం లగాయతు మూడవరాశిలో ఉంటే అనారోగ్యము, ధనవ్యయము కలుగుతుంది.
 • చంద్రలగ్నం లగాయతు నాలుగవరాశిలో ఉంటే ధనము, సుఖము లభించును.
 • చంద్రలగ్నం లగాయతు అయిదవరాశిలో ఉంటే కుటుంబ సుఖము, ధనము, ఆరోగ్యము లభించును.
 • చంద్రలగ్నం లగాయతు ఆరవరాశిలో ఉంటే ధనవ్యయం కలుగును.
 • చంద్రలగ్నం లగాయతు ఏడవరాశిలో ఉంటే అనారోగ్యం, ఆపద కలుగుతాయి.
 • చంద్రలగ్నం లగాయతు ఎనిమిదవరాశిలో ఉంటే ధననష్టం కలుగుతుంది.
 • చంద్రలగ్నం లగాయతు తొమ్మిదవరాశిలో ఉంటే బంధుమిత్రులు సహకారం లభిస్తుంది.
 • చంద్రలగ్నం లగాయతు పదవరాశిలో ఉంటే ధనవ్యయం , బాధలు కలుగుతాయి.
 • చంద్రలగ్నం లగాయతు పదకొండవరాశిలో ఉంటే ఆర్ధిక ఇబ్బందులు కలుగుతాయి.
 • చంద్రలగ్నం లగాయతు పన్నెండవరాశిలో ఉంటే కుటుంబసుఖము, ధనార్జన ఉంటుంది.
******************************** © *******************

17, మార్చి 2013, ఆదివారం

గ్రహముల ద్వాదశ భావాశ్రయ ఫలములు

  సూర్య:-

రవి లగ్నమందున్న ఫలము :

రవి లగ్నగతుడయిన అట్టి జాతకుడు అల్పకేశయుతుడు, చిరుపలుకులకే అలసత్వము నొందినవాడు, క్రోధి - ప్రచండస్వభావి - పొడగరి - గర్వి - అల్పదృష్టికలవాడు - ఉద్రేకి - కౄరహృధయుడు - నిర్గుణుడు అగును. అది కర్ణాటక లగ్నమయి అందు రవియున్న కనులయందు పూవులు కలవాడు, మేషము లగ్నమయి అందు రవియున్న నేత్రవ్యాధి పీడితుడు; రవి సింహమందుండి సింహలగ్నమయిన రేచీకటి కలవాడు; తులాలగ్నమయి అందు రవియున్న దారిద్ర్యపీడితుడూ, సంతాననష్టము పొందువాడూ అగును.

రవి ద్వితీయ, తృతీయ, చతుర్థములలో యున్న ఫలములు :

రవి ద్వితీయమునయున్న విద్యాహీనుడు, వినయములేనివాడు, నిర్ధనుడు, దుర్వచనప్రియుడు అగును. రవి తృతీయమునయున్న బలవంతుడు, ధైర్యవంతుడు, ధనవంతుడు, ఉదారుడూ అగును. కానీ, ఆప్తులయందు ద్వేషస్వభావియగును. రవి చతుర్థమునయున్న అట్టిజాతకుడు సుఖహీనుడు, బంధువులు లేనివాడు, క్షేత్రహీనుడు, స్నేహహీనుడు, గృహములేనివాడు అగును. ప్రభుత్వ ఉద్యోగి అగును. పిత్రార్జితమంతయా ఖర్చు పెట్టును.

రవి పంచమ, షష్ట, సప్తమ, అష్టమలయందున్న ఫలము :

రవి పంచమముయందున్న సుఖ, పుత్రహీనుడు, మరియూ అల్పాయుష్మంతుడు, జ్ఞాని, అరణ్యప్రదేశములయందు తిరుగువాడు అగును. రవి ఆరవయింటనున్న జాతకుడు రాజు, ఖ్యాతివంతుడు, ధనవంతుడు, విజయవంతుడు అగును. రవి యెనిమిదవ భావమున యున్న జాతకుడు తన ఆస్తిని పోగొట్టుకొనును. మిత్రనష్టము, అల్పాయుష్మంతుడు దృష్టిలోపము కలవాడగునో - అంధుడగునో యుండును.

రవి భాగ్య, రాజ్య, లాభ, వ్యయ క్షేత్రముల యందున్న ఫలము :

భాగ్యమున రవియున్న తండ్రిలేనివాడు, బంధుమిత్రపుత్రవంతుడు, దేవబ్రాహ్మణ భక్తి కలవాడూ అగును. రాజ్యకేంద్రమున రవియున్న జాతకుడు పుత్రవంతుడు, వాహనయుతుడు, కీర్తియశస్సు, భాగ్యమూకలవాడు, రాజూ అగును. రవి లాభస్థానమునయున్న జాతకుడు బహుధనవంతుడు, చిరంజీవి యగును. రాజు అగును. మరియూ విగశోకవంతుడు అగును. ద్వాదశమున రవియున్న పితృద్వేషి దోషదృష్టి కలవాడు, నిర్ధనుడు, అపుత్రవంతుడు అగును.

చంద్ర :-

చంద్రుడు లగ్న, ద్వితీయ, తృతీయములయందున్న ఫలము :

చంద్రుడు లగ్నమందున్న అట్టిజాతకుడు ధృడశరీరవంతుడూ, చిరంజీవి, నిర్భయుడూ, బలిష్ఠుడూ, ధనవంతుడు అగును. ( వృద్ధి చంద్రుడు ). క్షీణచంద్రుడయిన పై ఫలితములకు వ్యతిరిక్తము అగును. చంద్రుడు ద్వితీయమునందున్న జాతకుడు ధనవంతుడు, విద్యావంతుడు, మృదుభాషి యేదేని అంగవైకల్యమూ కలుగును. చంద్రుడు మూడవయింటనున్న జాతకుడు సోదరులు కలవాడు, ప్రమదాజమనస్కుడు, బలవంతుడు, శౌర్యవంతుడు, అయిననూ బహుకష్టములు పొందును.

చంద్రుడు చతుర్థ, పంచమ, షష్ట ద్వాదశభావములయందున్న ఫలము:

చంద్రుడు చతుర్థభావమునయున్న జాతకుడు సుఖీ, భోగీ, దాతా, మిత్రులు కలవాడు, వాహనములు కలవాడు, కీర్తివంతుడుగా వెలుఒందును. చంద్రుడు పంచమమునయున్న జాతకుడు సుపుత్రులు, సుమేథాసంపద, ఠీవీ, మంత్రిపదవి నలంకరించువాడూ యగును. ఆరవయింట చంద్రుడు యున్న జాతకుడు అల్పజీవి, అమాయకుడు, ఉదరశూలతో బాధపడువాడూ, దైన్యత్వముకలవాడునూ యగును. సప్తమమున చంద్రుడుయున్న జాతకుడు సౌమ్యవంతుడు, సుందరయువతీ హృదయారవిందుడు, అతి సుందర వంతుడునూయగును. ( సౌందర్యవతి యగ్గు భార్య సంప్రాప్తమగును. )

చంద్రుడు అష్టమ, నవమ ,దశమ , లాభ ద్వాదశభావములయందున్న ఫలము :

అష్టమభావమున చంద్రుడు, జాతకుని రోగపీడితుడ్నిగనూ, అల్పాయుష్మంతునిగనూ చేయును. నవమభావమున చంద్రుడు అభివృద్ధిపరునిగనూ,పవిత్రునిగనూ, పుత్రవంతునిగను, విజయునిగను, కార్యారంభముననే శుభఫలములందుటా మొదలగు ఫలములని సహాయము చేయు మనస్కుడూ అగును. ఏకాదశమమున చంద్రుడుయున్న జాతకుడు విశాలహృదయుడూ, చిరంజీవీ, ధనవంతుడూ యగును. ద్వాదశభావమున చంద్రుడు యుండ జాతకుడు ద్వేషి, దుఃఖి, క్లేశములననుభవించువాడు, అవమానింపబడినవాడు, నిరుత్సాహి యగును.

 మంగళ:-

కుజుడు లగ్న, ద్వితీయ, తృతీయ, చతుర్థములయందున్న ఫలము :

లగ్నమునందుకుజుడు యున్న, అట్టిజాతకుడు, క్షతగాత్రుడు, కౄరుడు అల్పాయుష్మంతుడు, సాహసియగును. కుజుడు ద్వితీయమునందున్న జాతకుడు - కురూపవంతుడు, విద్యావిహీనుడు, ధనహీనుడు, దుష్ప్రజలమీద ఆధారపడువాడూ యగును. తృతీయమునందు కుజుడుయున్న జాతకుడు మంచిఅలవాట్లు కలవాడు, ధనవంతుడు, ధైర్యశాలి, అప్రతిహతుడు, సుఖవంతుడు, సోదరశూన్యుడూ యగును. చతుర్థమున కుజుడుండిన జాతకునకు మిత్ర, మాతృ, భూ, గృహ, సుఖ, వాహనముల లేమి కలుగును.

కుజుడు పంచమ, షష్ట, సప్తమ, అష్టమ భావములయందున్న ఫలము :

పంచమ భావమున కుజుడున్న అట్టిజాతకుడు సుఖహీనత, నిస్సంతు, అల్పమేథావి, భాగ్యములకు అనర్ధములు కలుగును. కుజుడు షష్టభావమునయున్న జాతకుడు - అతికాముకుడు, ధనవంతుడు కీర్తికలవాడు, విజయుడూ అగును. కుజుడు కళత్రభావమునయున్న జాతకుడు దుశ్చరితుడు, వ్యాధిపీడితుడు, వృధాత్రిప్పట, భార్యానష్టము కలుగును. అష్టమమున కుజుడుండిన జాతకుడు అంగవైకల్యము పొమ్దును. నిర్ధనుడు, అల్పజీవి, జననిందితుడు అగును.

కుజుడు భాగ్య, రాజ్య, లాభరిఃఫ స్థానములయందున్న ఫలము :

కుజుడు భాగ్యభావమునయున్న జాతకుడు రాజమిత్రుడు, ప్రజలచే ద్వేషింపబడువాడు, పితృహీనుడు, జనఘాతకుడు అగును. కుజుడు రాజ్యప్రభావమున యున్న జాతకుడు కౄరస్వభావము కలరాజగును. విశాలహృదయుడు, ప్రజామన్ననలందుకొనువాడగును. కుజుడు ద్వాదశభావమునయున్న జాతకుడు ధనసుఖములతో తులతూగువాడు, ధైర్యశాలి, విగతశోకవంతుడు, సచ్ఛరిత్రుడూ యగును.

బుధ:-

బుధుడు లగ్న, ద్వితీయ, తృతీయ, చతుర్థ భావములయందున్న ఫలము :

లగ్నమున బుధుడుండిన జాతకుడు దీర్ఘాయుష్షుకలవాడు, మృదుమధుర వాక్సంపన్నుడు, సునిశిత హాస్యవాక్చాతురుడు అగును. బుధుడు ద్వితీయమునయున్న జాతకుడు స్వశక్తితో ఆస్తులను సంపాదించువాడు, కవి - ఆకర్షణీయమయిన ప్రస్ఫుటవాక్కులు కలవాడు యిష్ఠాన్నభోక్తయగును. బుధుడు తృతీయమునయున్న జాతకుడు ధైర్యశాలి, శూరుడు, సమ ఆయుష్మంతుడు, సత్సోదరయుతుడు, అలసట పొందు స్వభావము కలవాడునగును. బుధుడు చతుర్ధభావమునయున్న జాతకుడు విద్యావంతుడు హాస్యవచో విశారదుడు, భూమి, మిత్రులు, ధాన్య, ఐశ్వర్యము - సంతోషముతో కూడినవాడు యగును.

బుధుడు పంచమ, షష్ట, సప్తమ, అష్టమ స్థానములయందున్న ఫలము :

పంచమభావమున బుధుడుండిన జాతకుడు విద్యావంతుడు, సుఖవంతుడు, శౌర్యవంతుడు, మంత్రవిద్యాభినివేశి, పుత్రవంతుడు అగును. బుధుడు షష్టమభావమునయున్న జాతకుడు వివాదాస్పదుడు, క్రోధి, నిష్టురవాకులయందు నేర్పరి, రిపునాశనకర్త, అలసట కలవాడు, నిష్టురోక్తిపరుడు అగును. బుధుడు సప్తమమున యున్న జాతకుడు విద్యావంతుడు, సుందరవస్త్రధారి, ఔన్నత్యవంతుడు, ధనసంపన్నవతియగు భార్యగలవాడూయగును. బుధుడు అష్టమమునయున్న జాతకుడు మిక్కిలి ప్రఖ్యాత్వంతుడు, చిరంజీవి, కుటుంబమునకు అండగా యుండుట, ప్రభువు లేక సేనానివహము లకధిపతి యగును.

బుధుడు భాగ్య, రాజ్య, లాభ, వ్యయభావములయందున్న ఫలము :

బుధుడు భాగ్యభావమునయున్న జాతకుని విద్య, ఐశ్వర్యమూ, సచ్ఛరిత్ర, ఆచారము, ప్రావీణ్యము, స్వచ్ఛమగు, వాక్కులు గలవానినిగాచేయును. బుధుడు రాజ్యకేంద్రమున యున్న జాతకుడు తానారంభించు సకలకార్యములయందునూ విజయుడూ, మంచివిద్య, శక్తి, మేథ, సుఖము, సత్ప్రవర్తన, సత్యసంధత కలవాడును యగును. బుధుడు యేకాదశభావమునయున్న జాతకుడు చిరంజీవి, సత్యసంధుడు, బహుధనవంతుడు, సుఖీ మరియూ సేవాజనము కలవాడునగును. బుధుడు ద్వాదశభావమునయున్న జాతకుడు కష్టజీవి, విద్యాహీనుడు, నమ్రతతో యుండువాడు, కౄరుడు, నిస్తేజుడూ యగును.

గురు:-

గురుడు లగ్న, ద్వితీయ, తృతీయ, చతుర్ధ భావములయందున్న ఫలము :

గురుడు లగ్నకేంద్రమునయున్న జాతకుడు రూపవంతుడు, అదృష్టవంతుడు, చిరంజీవి, నిర్భయుడు, సంతానవంతుడు అగును. గురుడు ద్వితీయమున యున్న జాతకుడు స్వచ్చమగు వాకులు గలవాడు, భోజనప్రియుడు, సుందరవదనుడు, ధనవంతుడు, విద్యావంతుడు అగును. గురుడు తృతీయమునయున్న జాతకుడు అమర్యాదస్తుడు (మర్యాద తెలియనివాడు), కష్టముతో జీవించువాడు, ఖ్యాతిగల సోదరవర్గము కలవాడు, పాపములు చేయువాడు, మావియగును. చతుర్దభావమున గురుడుండిన జాతకుడు మిత్ర మాతృ సేవాజనముతో జీవించువాడు, భార్యాపుత్ర ధనధాన్య సంపద్విభవుడు, సుఖీ అగును.

గురుడు పంచమ, షష్ట, సప్తమ, అష్టమ స్థానములందున్న ఫలము :

గురుడు పంచమభావమునయున్న జాతకుడు పుత్రులవలన క్లేశములు గలవాడు అగును. మరియూ మేథావి, రాజసచివునిగను యుండును. గురుడు షష్టమునయున్న జాతకుడు నిరుత్సాహి, అగౌరవములు పొందువాడు, శతృనాశనకారి, మంత్రాభినివేశము కలవాడగును. గురుడు సప్తమమునయున్న జాతకుడు సత్కళత్ర, సుపుత్రులను బడయును, వినయసంపన్నుడు, అతి ఉదారుడూ అగును. గురుడు అష్టమమునయున్న జాతకుడు కడుబీదవాడగునూ, బహుతక్కువ సంపాదనాపరుడు, పాపి, అయిననూ చిరంజీవి అగును.

గురుడు భాగ్య, రాజ్య, లాభ, వ్యయ భావములయందున్న ఫలము :

గురుడు భాగ్యమందున్న జాతకుడు ఖ్యాతి వహించిన మంత్రిగనూ, సంతతీ ఐశ్వర్యము గలవానిగానూ, పవిత్రకార్యాభిలాషిగనూ యుండును. గురుడు రాజ్యము నందున్న జాతకుడు బుజువర్తనుడు, తన పవిత్రకార్యములచేత ప్రఖ్యాతి వహించినవాడు, బహుధనవంతుడూ, రాజమిత్రుడూ అగును. గురుడు లాభమునందుయున్న జాతకుడు ధనవంతుడు, నిర్భయుడు, అల్పసంతానవంతుడు; చిరంజీవి, వాహనయానపరుడు అగును. గురుడు ద్వాదశమునయున్న జాతకుడు యితరుల చేత అసహ్యించుకొనబడువాడు. అసంగతప్రలాపి, అప్త్రవంతుడు, పాపకృత్యములు చేయువాడు అలసినవాడు అగును.

శుక్ర:-

శుక్రుడు లగ్న, ద్వితీయ, తృతీయ, చతుర్ధములయందున్న ఫలము :

శుక్రుడు లగ్నమునందున్న జాతకుడు ఆరోగ్యవంతుడు, సుందర శరీరుడు, సుఖీ, చిరంజీవి అగును. శుక్రుడు ద్వితీయమునందున్న జాతకుడు కవి - బహువిధములుగా ఆస్తులు కలవాడు అగును. శుక్రుడు తృతీయమందున్న భార్యాహీనుడు కష్టవంతుడు, బీదవాడు, దుఃఖి, అవిఖ్యాతుడు అగును. శుక్రుడు చతుర్ధమునయున్న జాతకుడు మంచి వాహనములు కలవాడు, మంచి గృహము కలవాడు, నగలు, వస్త్రములు, సుగంధద్రవ్యములు గలవాడుగనూ యుండును.

శుక్రుడు పంచమ, షష్ట, సప్తమ, అష్టమ స్థానములయందున్న ఫలము :

శుక్రుడు పంచమమునయున్న జాతకుడు అపారధనవంతుడు, పరరక్షకుడు, బహుమేధావి, పుత్రులతో ఆశీర్వదింపబడినవాడు అగును. శుక్రుడు షష్టమమునయున్న జాతకుడు శతృవులు లేనివాడు, నిర్ధని, యువతీజనముచేత మోసగించబడినవాడు, విచారగ్రస్తుడు అగును. శుక్రుడు సప్తమమునయున్న జాతకుడు సత్కళత్ర సంపన్నుడు అయిననూ పరస్త్రీరతుడు, విగతకళత్రుడు. ధనవంతుడూ అగును. శుక్రుడు అష్టమమున యున్న జాతకుడు చిరంజీవి, ధనవంతుడూ, రాజూ అగును.

శుక్రుడు భాగ్య, రాజ్య, లాభ, రిఃఫ స్థానములయందున్న ఫలము :

శుక్రుడు భాగ్యమునందున్న జాతకుడు భార్యా, సంతతీ, ఆప్తులూ కలిగి మరియూ రాజాశ్రయముచేత అభివృద్ధి చెందువాడునూ అగును. శుక్రుడు రాజ్యకేంద్రమునయున్న జాతకుడు మిక్కిలి ప్రఖ్యాతవంతుడు, మిత్రులు కలిగి ప్రభువుగనూ యుండును. సంతోషకరమగు వుద్యోగిగనూ యుండును. శుక్రుడు యేకాదశమునందున్న జాతకుడు పరాంగనాపరుడూ, బహుసుఖీ యగును. శుక్రుడు ద్వాదశమునందున్న జాతకుడు సురతసౌఖ్యప్రదుడు, ధనవంతుడూ యగును.

శని:-

లగ్నాది ద్వాదశ రాశులయందు శని యున్న ఫలము :

శని స్వరాశులయిన మకర కుంభములయందుండి లగ్నమయిననూ, తన ఉచ్ఛస్థానమయిన తులయందుండ అది లగ్నమయిననూ జాతకుడు రాజతుల్యుడు, ప్రధానాధికారి, నగరపాలకుడు అగును. ఇతర రాశులయందుండగా అవి లగ్నములయిన జాతకుడు బాల్యమునుండి దుఃఖపరితప్తుడు, నిస్సహాయుడు, మలినాంబరధారి, నీరసి అగును.

శని ద్వితీయ, తృతీయ భావములయందున్న ఫలము :

శని ద్వితీయమునయున్న జాతకుడు జుగుప్స కలిగిన మోము కలవాడు, నిర్ధనుడు, అన్యాయవర్తనుడు, కాలక్రమమున దూరములయందు నివసించువాడు, మరియూ ధనవాహనములు కలవాడగును. శని తృతీయ భావమునయున్న జాతకుడు మిక్కిలి విజ్ఞానవంతుడు, దానధర్మములయందుదారుడు, భార్యాసమేతుడయి సుఖములను బడయువాడు, నిరుత్సాహి, దుఃఖము లేనివాడు యగును.

శని చతుర్ధ, పంచమ, షష్టి, సప్తమ స్థానములయందున్న ఫలము :

చతుర్ధమయిన శనియున్న జాతకుడు సుఖము లేనివాడు, గృహములేనివాడు, వాహనములేనివాడు, బాల్యమున అనారోగి, తల్లిని పీడించువాడు అగును. పంచమభావమున శనియున్న జాతకుడు తిరుగాడుట, అజ్ఞాని, సుతధనసుఖహీనుడూ, దురభిమాని, దురాలోచనాపరుడూ అగును. శని షష్టమమునయున్న జాతకుడు తిండిపోతు, ధనవంతుడు, శతృవులచేత ఓడింపబడినవాడు, దుశ్చరితుడు, మానవంతుడు అగును. శని సప్తమమునయున్న జాతకుడు కళత్రయుతుడు, తిరుగాడువాడు, భయకంపితుడు అగును.

శని అష్టమ స్థానమునయున్న ఫలము :

అష్టమమున శని యున్న జాతకుడు శుభ్రములేనివాడు, నిర్ధనుడు, మూలశంక మొదలగు రోగపీడితుడు, కౄరమనస్కుడు, క్షధార్తుడు, సుహృజ్జనుల అవమానింపబడినవాడు అగును.

శని భాగ్య, రాజ్య, లాభ, వ్యయ స్థానములనున్న ఫలము :

భాగ్యస్థానమున శనియున్న జాతకునకు అదృష్టము - ఆస్తి - సంతతి - పితృధర్మము మొదలుగునవి యేమియూ వుండవు. మోసకారి యగును, శని దశమమునయున్న జాతకుడు రాజు కానీ, అమాత్యుడు గానీ యగును. వ్యవసాయమున అభిరుచి, ధైర్యవంతుడు, ధనవంతుడు, ఖ్యాతి గలవాడు అగును. శని యేకాదశములో యున్న జాతకుడు చిరంజీవి, బహుసంపాదనాపరుడు, స్థిరసంపదలు కలవాడు, నిరోగవంతుడు అగును. ద్వాదశమున శనియున్న జాతకుడు నిర్లజ్జాపరుడు, నిర్ధనుడు, అపుత్రవంతుడు, అంగవికలుడు, మూర్ఖుడు, శతృవులచేత త్రోలబడినవాడు అగును.

రాహు:-

రాహువు లగ్న, ద్వితీయ, తృతీయ, చతుర్ధముల యందున్న ఫలము :

రాహువు లగ్నమునయున్న జాతకుడు అల్పాయుర్దాయువంతుడు, ధనము ధారుడ్యము కలవాడు, ఊర్ద్వాంగములగు శిరోముఖములయందు రోగములు కలవాడు అగును. రాహువు ద్వితీయభాగమునయున్న జాతకుడు సంశయపూరిత వాక్కులు గలవాడు, ముఖమున నోటియందునా రోగములు గలవాడు, సునిశిత హృదయుడు, ప్రభుమూలకధనార్జనపరుడు, రోషవంతుడు సుఖీ అగును. రాహువు తృతీయమున యున్న జాతకుడు పుట్టుకతోనే గర్వి, బ్రాతృవిరోధి, స్థిరచిత్తుడు, చిరాయుష్మంతుడు, ధనీ అగును. రాహువు చతుర్ధమునయున్న జాతకుడు దుఃఖకారకుడు, మూర్ఖుడు, అల్పాయుష్మంతుడు, అప్పుడప్పుడు సుఖవంతుడూ అగును.

రాహువు పంచమ, షష్ట, సప్తమ, అష్టమ స్థానములయందున్న ఫలము :

రాహువు పంచమమునయున్న జాతకుడు ముక్కుతో మాట్లాడు ధ్వని కలవాడు, అపుత్రవంతుడు, కఠినాత్ముడు, గర్భముయొక్క రోగములు కలవాడు అగును. రాహువు షష్టమమునయున్న జాతకుడు శతృవులచే బాధలనొందువాడు ; లేక గ్రహబాధలు కలవాడు, గుహ్యాదియందురోగము కలవాడు, ధనవంతుడు, చిరంజీవి అగును. సప్తమమౌన రాహువు యున్న జాతకుడు పరాంగనారహ : కేళీవిలాసముయందు నష్టము పొందినవాడు, ఆత్మీయులనుంచి విడిపోవుటవలన వ్యథలపాలయినవాడు, మానవత్వము కోల్పోయినవాడు, పాపి, స్వాతంత్రభావములు కలవాడు ( ఇతరుల భావములు విననివాడు ) అగును. రాహువు అషటమమునయున్న జాతకుడు అల్పాయుషమంతుడు అపవిత్రకార్యాసక్తుడు, అంగవైకల్యమును పొందినవాడు, వికలతచెందినవాడు, వాతప్రకృతి కలవాడు, అల్పసంతతి కలవాడు అగును.

రాహువు భాగ్య, రాజ్య, లాభ, రిఃఫ స్థానములయందున్న ఫలము :

రాహువు నవమభాగమునయున్న జాతకుడు ప్రతికూలవాక్కులుగలవాడు, కులపెద్ద, గ్రామపెద్ద, పట్టణమునకు అధిపతి, పాపక్రియాపరుడు అగును. రాహువు దశమమందున్న జాతకుడు ప్రఖ్యాతి వహించినవాడు, అల్పసంతానవంతుడు, పరకార్యములు చేయ్వాడు, నిర్భయుడు, సత్కర్మరహితుడు అగును.
రాహువు లాభస్థానమునయున్న జాతకుడు అభివృద్ధిపరుడు, స్వల్పసంతానవంతుడు, చిరంజీవి మరియూ కర్ణరోగి యగును. అనియూ, రహువు ద్వాదశస్థానమునయున్న జాతకుడు రహస్యకృత దురాచారములు కలవాడు, యెక్కువ ఖర్చు చేయువాడు, శరీరమున జలసంబంధమగు రోగము కలవాడు అగును .

కేతు:-

లగ్న ద్వితీయ భావములయందున్న కేతువు ఫలము :

లగ్నమున కేతువుయున్న జాతకుడు కృతఘ్నుడు, సుఖములేనివాడు, యితరుల విషయములలో కొండెములు చెప్పువాడు అగును. మరియూ జాతిభ్రష్టుడు, స్థానభ్రష్టుడూ, అసంపూర్ణమగు అవయవములు కలవాడు, మాయావులతో కలిసియుండు వాడు అగును. కేతువు ద్వితీయభావమునయున్న జాతకుడు విద్యాహీనుడు, నిర్దనుడు, అల్పపదప్రయోగి, కుదృష్టిపరుడు, పరాన్నభుక్కుయగును.

కేతువు తృతీయ, చతుర్ధ భావములయందున్న ఫలము :

కేతువు తృతీయ భావమునయున్న జాతకుడు చిరంజీవి, శక్టిసంపన్నుడు, ఆస్తి - కీర్తి కలవాడును భార్యాసమేతముగా సంతోషజీవితము గౌడ్పును. సుఖాన్న ప్రాప్తిని పొందును. సోదరుని కోల్పోవును. కేతువు చతుర్ధమునయున్న జాతకుడు భూ, మాతృ, వాహన, సుఖములను కోల్పోవును. స్వస్థానములు వీడి అన్యప్రదేశములయందుండును. పరులధనాపేక్షతో జీవించువాడు యగును.

కేతువు పంచమ, షష్ట స్థానములయందున్న ఫలము :

కేతువు పంచమమునయున్న జాతకుడు గర్భజ్కోశవ్యాధి పీడితుడు, సంతతినష్టపోవువాడు, పిశాచపీడలచే బాధలనొందువాడు, దుర్భుద్దిపరుడు, మోసగాడు అగును. కేతువు షష్టమునయున్న జాతకుడు ఔదార్యవంతుడు, వుత్తమగుణములు కలవాడు, ధృడచిత్తుడు, విపులకీర్తివంతుడు, వున్నతోద్యోగి, శతృనాశనపరుడు, కోరికలు సిద్ధించువాడు అగును.

కేతువు సప్తమ, అష్టమ స్థానములందున్న ఫలము :

కేతువు సప్తమమునయున్న జాతకుడు అగౌరవము పోమ్దుఅవడు, దుష్టస్త్రీ సమేతుడు, అంతర్గత రోగపీడితుడు, భార్య మరియు శక్తినష్టములచేత బాధపడువాడు అగును. కేతువు అష్టమమునయున్న జాతకుడు అల్పాయుష్మంతుడు, ప్రాణమిత్రులను విడిచినవాడు, కలహములతో జీవించువాడు, ఆయుధములవలన ఘాత పొందినవాడు, తానుచేయు పనులయందు నిరాశా నిస్పృహలు కలవాడు అగును.

కేతువు భాగ్య, రాజ్యములయందున్న ఫలము :

కేతువు తొమ్మిదవయింటయున్న జాతకుడు పాపప్రవృత్తిపరుడు, అశుభవంతుడు, పితృదేవులను అణచినవాడు, దురదృష్టవంతుడు, ప్రసిద్ధులను దూషించువాడు అగును. కేతువు రాజ్యకేంద్రమునయున్న జాతకుడు సత్లర్మలయందు విఘ్నములు కలవాడు, మలినుడు, నీచక్రియాసక్తుడు, శక్తిమంతుడు, బహుకీర్తిమంతుడు అగును.

కేతువు ఏకాదశ, వ్యయ స్థానములయందున్న ఫలము :

కేతువు లాభమునయున్న జాతకుడు అఖండ ధనవంతుడు, బహుగుణవంతుడు, భోగి, మంచివస్తువులు పొందుటకాస్కారము కలవాడు, తనకవసరమగు ప్రతీపనియందునా విజయము పొందువాడు అగును. కేతువు ద్వాదశమమున యున్న జాతకుడు రహస్యముగా దురాచారములు చేయువాడు, అధమక్రియాకలాపవశ ధననాశనము పొందినవాడు, అస్తిని నాశనము చేయువాడు, విరుద్ధమైననడతలు కలవాడు, నేత్రరోగి యగును.
             ******************************************************

16, మార్చి 2013, శనివారం

జన్మలగ్నఫలములు

                              -: జన్మలగ్నఫలములు :-

వివిధ లగ్నములలో జన్నించిన ఫలితమును సారావళి, ఫలదీపిక, జాతక, పారిజాతము, హోరరత్నబృహజాతకము మొదలగు గ్రంధములు ఆధారంగా రాయడమైనది, యివి సామాన్య పరిశీలనలో,అయితే గ్రహసంపత్తిని అనురించి ఫలితములు మార్పు తీసుకొనును.ప్రాధమిక పరిశీలనల కొరకు ఈ గ్రంధాలలో చెప్పబడిన జన్మలగ్న లక్షణాలను ఇందు విశదీకరిస్తాను.
సారవళిలోని నష్టజాతకాధ్యాయములోని హోర,ద్రేక్కణ,నవాంశల ఫలితములను ఆధారము చేసుకొని సంధి లగ్నములో జన్మించిన జాతకుని యొక్క జనన,లగ్న,హోర,ద్రేక్కాణ,నవాంశాలను నిర్ణయించుటకు ఈ అద్యాయమును ఉపకరిస్తుందని సారావళి నుండి యధాతధముగా తీసుకొనుట జరిగినది. దీనికి పారిజాతాది యితర గ్రంధ విశేషములను కూడ వివరించుట జరిగినది. 
 
మేష జన్మలగ్నఫలము

(జాతక పారిజాతము నుండి) బంధు ద్వేషి,తిరుగాడువాడు,కృశించిన శరీరము కలవాడు,క్రోధ స్వభావి,వివాదప్రియుడు,గర్విష్ఠి,స్థిరము లేని ధనము కలవాడు,శూరుడు.(ఫలదీపిక నుండి) గండ్రుని కన్నులు కలవాడు,దుర్భలమగు జానవులు కలవాడు,జలము వలన భయపదు వాడు,మితభుజి,చపచిత్తుడు,స్త్రీ కామకుడు,వ్రణములు కల అవయవము కలవాడు(మానసాగరి నుండి) రక్త గౌరవర్ణము కలవాడు.

మేషలగ్నము యొక్క ప్రధమహోరయందు జన్మించిన క్రౌర్యము,ధనము,అధిక వీర్యము,ఉగ్రురాలగు భార్య గలవాడు,బలిసినవాడు,తీక్షణమైనవాడు,దొంగలకధిపతి యునగును.ద్వితీయహోరయందు పుట్టిన దొంగ,ప్రమాదములు,సన్నని కాలి వ్రేళ్ళు,నిగనిగలాడు వెడల్పగు కండ్లు,నేర్పరి,మిక్కిలి లావైన శరీరము,మంచి మేధ గలవడగును.


మేషరాశి యొక్క ప్రధమ ద్రేక్కాణమున జన్మించిన వాడు దాత,సంపాదించువాడు,లోకమంతట ఖ్యాతి చెందినవాడు,యుద్ధమున మిక్కిలి తీవ్రమైన వాడు,అందమైన స్వరూపము కలవాడు,బంధువులను కఠినముగ శిక్షించువాడు నగును.ద్వితీయ ద్రేక్కాణమున జన్మింఛిన స్త్రీ చాపల్యము,విలాసముగా తిరుగుట,సంభోగము,గానమున ప్రీతి,అభిమానము,స్నేహితుల ధనము లభించుట,మంచి రూపము,భార్యకు సంభంధించిన ధనము ప్రీతికలవాడగును.తృతీయ ద్రేక్కణమున జన్మించిన గుణవంతుడు ,ఇతరులకు పనులు చేయువాడు,రాజసేవ నొనర్చువాడు,బంధుప్రేమకలవాడు,మిక్కిలి ధర్మాత్ముడు,ఆదరము కలవాడు,అంతగా సర్వ విషయములు తెలియనివాడును అగును.
వృషభ జన్మలగ్నఫలము

(జాతక పారిజాతము నుండి) పశుసంపద కలవాడు,దేవ,గురు,బ్రాహ్మణ భక్తి కలవాడు,స్వల్పపుత్ర సంపద కలవాడు,ప్రశాంత చిత్తుడు,తర్కవాదన చేయువాడు,అదృష్ఠశాలి,కామకుడు అగును.(ఫలదీపికనుండి) బలిష్టమైన తొడలు కలవాడు,విశాలమైన ముఖము కలవాడు,వ్యవసాయ ఆశక్తి కలవాడు,దానములయందు ఉదార చిత్తుడు,పార్శ్వములయందు,పృష్ఠభాఘమున పుట్టుమచ్చలు కలవాడు అగును.(మానసాగరి నుండి ) మిత్రజన వియోగి,మానసికరోగి.

వృషభముయొక్క ప్రధమహోరయందు పుట్టిన నల్లని శరీరము,విశాల నేత్రములు, మిక్కిలి సంభోగమున ఇష్టము,లావైన ఎముకలు గల శరీరము,సౌందర్యవంతుడు,ద్వీతీయహోరయందు జన్మించిన పొడవైనది లావైనది గుండ్రనైనదియు నగు శరీరము,గొప్ప బలము,మంచి వెంట్రుకలు,వ్యత్యస్థమగు కటి ప్రదేశము,వృషభము వంటి నేత్రములు గలవాడగును.


వృషభ రాశి యొక్క ప్రధమ ద్రేక్కాణమున జననంబైన ఇష్టులు పానయోగ్య పదార్ధములు భోజన సామాగ్రి భార్య మున్నగు వాటి వియోగము వలన దుఃఖించువాడు,వస్త్రములు,భూషణములు స్త్రీ ఇష్టముతో నడుచుట మున్నగునవి గలవాడనగును.ద్వితీయ ద్రేక్కణమున జన్మించిన లొటు లేని దేహము గలవాడు,స్త్రీలకు చాల ప్రియుడు,మంచి రూపము,ధనము,స్థైర్యము,అభిమానము లోభముగల స్త్రీల యొక్క ప్రేమయు గలవాడగును.తృతీయ ద్రేక్కాణమున జన్మించిన నేర్పరి,కొంచెము పాటి ధనము,పరాక్రమము గలవాడు,మిక్కిలి మలినుడు,మొదట ధనమునార్జించి పిదప దుఃఖించువాడునగును.

మిదున జన్మలగ్నఫలము

(జాతక పారిజాతము నుండి) భోగవంతుడు,దయాశాలి,ధనవంతుడు,గుణవంతుడు,తత్వవేత్త,యోగాత్మ,సుజన ప్రియుడు,సుందరాకారము కలవాడు,అనారోగ్యవంతుడు..(ఫలదీపికనుండి) నల్లటి అందమగు కనులు కలవాడు,స్త్రీ జనప్రియుడు, యితరుల మనోభావములను చెప్పగలవాడు,సంగీత,నృత్యప్రియుడు. .(మానసాగరిలో విశేషము) గౌరవర్ణము కలవాడు,రాజపండితుడు,దూతగా వ్యవహరించేవాడు,ప్రసన్నచిత్తుడు.

మిధున లగ్న ప్రధమ హోర యందు జన్మించిన లావైన నడుము,మిక్కిలి నేర్పు,ఒకపాటి ప్రమాణము గల శరీరము,మృదువగు వెంట్రుకలు,పాదములు,సురతమున ఉత్కటమగు వాంఛ,ధనము ప్రాజ్ఞత కలవాడు నగును.ద్వితీయ హోరయందైన మధురములై విశాలమగు నేత్రములు కలవాడు, కామకుడు, శౌర్యవంతుడు ,మృదువులగు పనులు,మంచి వాక్కు,యితరుల భార్యలను పొందిన వాడు.


మిధున రాశి యొక్క ప్రధమ ద్రేక్కాణమున జన్మించిన లావైన తల కలవాడు,ధనవంతుదు,పొడవైన వాడు,జూదగాడు,గుణముల విలాసముల,రాజు వలన గౌరవము,వాగ్ధాటి కలవాడు అగును.ద్వితీయ ద్రేక్కణమున జన్మించిన చిన్న మొఖము కలవాడు,లొటులేని దేహము,.పొట్టి వెంట్రుకలు కలవాడు, ధన్యుడు, మృదువైనవాడు, గొప్పబుద్ధి, ప్రతాపము, యశస్సు గలవాడు అగును.తృతీయ ద్రేక్కాణమున జన్మించిన స్త్రీలను ద్వేషించువాడు,గొప్ప శిరస్సు కలవాడు,శత్రువులు కలవాడు,పొడవైన వాడు,పురుషమైన గోళ్ళు పాదములు నిలకడలేని ధనవైభవము ధారుఢ్యము గలవాడగును.
కర్కాటక జన్మలగ్నఫలము

(జాతక పారిజాతము నుండి) మృష్టాన్నము,వస్త్రభూషణములు కలవాడు,ప్రియవాక్కులు కలవాడు,కపటస్వభావి,ధర్మవంతుడు,స్థూలకాయుడు,(ఫలదీపిక నుండి) స్త్రీలచే జయింపబడినవాడు.ఎత్తైన కటిప్రదేశము కలవాడు,పొట్టివాడు,మేధావి,రాజప్రియుడు.(మానసాగరిలో విశేషము) పిత్త ప్రకృతి కలవాడు,జలక్రీడా ప్రియుడు,సేవకులచే అభిమానింపబడేవాడు.

కర్కాటక ప్రధమహోరయందు జన్మించిన పొడవగు దేహము,మంచి శిరస్సు,ప్రగల్భమగు బుద్ధి,తక్కువ చూపు,పోకిరితనము,నల్లనుఇ శరీరము,కృతఘ్నత గలవాడు,విరిగిన ముందుపన్ను గలవాడు నగును.ద్వితీయహోరయందైన జూదములను,దేశాటనమున ఇష్టము కలవాడు,విశాలమగు వక్ష స్థలము,కఠినమగు శరీరము,మిక్కిలి కోపము కలవాడు,ప్రయాణ సంపన్నుడును అగును.


కర్కట రాశి యొక్క ప్రధమ ద్రేక్కణమున జన్మించిన దేవ బ్రాహ్మణుల యెడ భక్తి చెంచలమగు స్వభావము,పచ్చని సరీరము గలవాడు,ఇతరులకు సేవ చేయువాడు, బుద్దిమంతుడు, శుభాచారములు గల భార్య సౌందర్యము గలవాడు,ప్రియమైన వాడు నగును.ద్వితీయ ద్రేక్కణమున జన్మించిన లోభి,తీపి భుజించువాడు,స్త్రీవలన ఓడిపోవువాడు,అభిమానము సోదరులు విలాసము చాంచల్యము అనేక రోగములు గలవాడు నగును.తృతీయ ద్రేక్కాణమున జన్మించిన స్త్రీ చాపల్యము ధనము పరదేశములయందు వశించుట,మద్యములయందు ప్రీఎ\తి కలవాడు, సత్పురుషుడు, అరణ్యముల యందు సంచరించువాడు,చూపు తగ్గిన వాడు,మాలికలను ధరించువాడు నగును.

సింహ జన్మలగ్నఫలము

(జాతక పారిజాతము నుండి) స్వల్ప పుత్ర సంతతి కలవాడు,హింసాప్రవృత్తి కలవాడు,సంతుష్టుడు,శూరుడు,రాజవశీకరుడూ,శతృవిజేయుడు,కామకుడు.(ఫలదీపిక నుండి) పింగలవర్ణము వంటి కన్నులు కన్నులు వాడు,విశాలమైన ముఖము కలవాడు,మాతృ విధేయుడు,స్థిర చిత్తుడు.(మానసాగరి విశేషము) వాత పిత్త ప్రకృతి కలవాడు,ప్రగల్భుడు.

సింహ ప్రధమహోరయందు జన్మించిన ఎర్రని కన్ను యొక్క కొనలు కలవాడు,ప్రగల్భమైన వాడు,పొడవైన దేహము,కపటము,సౌఖ్యము,స్థిరములగు పనులు బలము గలవాడగును.ద్వితీయహోరయందు జన్మించిన స్త్రీలను మృష్ఠాన్నములను పానీయములను,వస్త్రములను కోరువాడు,మిక్కిలి దుష్కార్యములు కఠినములగు అవయవములు గలవాడు,దాత,మార్గమున చరించువాడు,కొంచెము సంతానము భోగము స్థిరములగు స్నేహితులు గలవాడు నగును.


సింహలగ్నము యొక్క ప్రధమ ద్రేక్కణమున జన్మించిన దాత,పోషించువాడు శతృవులను జయించువాడు,చాలా ధనము స్త్రీలు స్నేహితులు గలవాడు,అనేక రాజులను గొల్చు వాడు,మంచి బలము గలవాడు నగును.ద్వితీయ ద్రేక్కణమున పుట్టిన మంచి పనులు జేయువాడు దాత,నిలకడ గలవాడు,అందమైన వాడు,యుద్ధమున ఇష్టము గలవాడు,శౌఖ్యము,వేదవిహితములగు ధర్మములయందు ప్రీతి విశాలమగు బుద్ధి గలవాడగును.తృతీయ ద్రేక్కాణమున జన్మించిన యితరుల ధనము నపహరించు ఆశ కలవాడు,ఆరోయవంతుడు,స్తభ్ధుడు,గొప్పబుద్ధి కలవాడు,జూదగాడు,పొట్టి శరీరము కలవాడు,అనేక మంది సంతానము గలవాడు,ప్రతిభాశలియునగును.
కన్యా జన్మలగ్నఫలము

(జాతక పారిజాతము ) కార్యనిపుణుడు,ధనవంతుడు,సత్బుద్ధి కలవాడు,పండితుడు,మేధావి,వనితా విలాస రసికుడు,బంధుప్రియుడు,సాత్వికుడు.(ఫలదీపిక నుండి) కృశించిన బాహువులు కలవాడు,పరుల ఆస్తులు అనుభవించువాడు,ప్రియభాషి,పరిమిత సంతతి కలవాడు.(మానసాగరి నుండి) కఫ,పిత్త ప్రకృతి కలవాడు,మాయావి,భయస్తుడు.

కన్యాలగ్న ప్రధమహోరయందుజన్మించిన సుకుమారమగు దేహము,అందము,మంచి మాటలు,గానమున ప్రజ్ఞ,స్త్రీలయొక్క ప్రేమ,శ్రేష్టతగలవాడగును.ద్వితీయహోరయందు జన్మించిన పొట్టివాడు పంతమునకై చదువుకొనువాడు ,లావైన తల వివాదము సేవించుట యందు,చిత్ర పటము వ్యాయుట యందు,అక్షరములను వ్యాయుట యందు నేర్ప,క్షయ వృద్ధులు,సౌఖ్యము కలవాడగును.


కన్యారాశి యందలి ప్రధమద్రేక్కణమున జన్మించిన నల్లని వాడు,మంచి వాగ్ధాటి వినయము,పొడవైన శరీరము కలవాడు,సుకుమారుడు,స్త్రీ వలన భాగ్యము నందు వాడు, అస్థిరమైనవాడు, పొడవైన శిరస్సు కలవాడు,తేనె వలె తీయని మాటలనువాడు నగును.ద్వితీయ ద్రేక్కణమున జన్మించిన ధైర్యము, విదేశములలో నివసించుట, శిల్పశాస్త్రమున పాండిత్యము యుద్ధమున నేర్పు నిరర్ధకములగు పలు మాటలు పలుకు వాడు మాట నాలించువాడు అరణ్యవాసులకు ఇష్ఠుదు నగును.తృతీయ ద్రేక్కణమున జన్మించిన గానము చేయ వాడు,ఇతరుల సొత్తునపహరించువాడు,సంగీతమున ప్రేమగలవాడు గలవాడు,రాజ ప్రేమగవాడు,పొట్టి వాడు,పెద్ద తల ,నేత్రములు గలవాడునగును.
తులా జన్మలగ్నఫలము

(జాతక పారిజాతము నుండి) సుందర వదనము కలవాడు,లావణ్యమైన కన్నులు కలవాడు ,రాజ పూజితుడు,విద్వాంసుడు,రతీలోలుడు,స్త్రీ,ధన క్షేత్రములు కలవాడు,విశాలమగు పళ్ళ వరుస కలవాడు,శాంతచిత్తుడు,విషాదగ్రస్తుడు,చెంచల స్వభావి,భయస్తుడు.(ఫలదీపిక నుండి) సన్నని శరీరము కలవాడు,స్వల్పసంతతి కలవాడు ,దేవ బ్రాహ్మణులయందు అమిత భక్తి కలవాడు,పొడగరి,వాణిజ్యమునందు నేర్పరి,ధైర్యశాలి.(మానసాగరి నుండి) కఫ,ప్రకృతి కలవాడు.

తులా ప్రధమహోరయందు జన్మించిన గుండ్రని ముఖము, ఎతైనముక్కు,నల్లని పొడవగు నేత్రములు, విలాసములు, బలిసిన దేహము, ధనము, బందువుల యెడ ప్రీతీ గలవాడు, ద్వితీయహోరయందు జన్మించిన గొప్ప ధనము, నల్లని పొట్టి వెంట్రుకలు, గుండ్రనికండ్లు, మంచి శరీరము, అల్పము లగు పాదగ్రములు గలవాడునగును.


తులారాశియొక్క ప్రధమ ద్రేక్కాణమున జన్మించిన మన్మధునివలె సౌందర్యవంతుడు,మార్గమున పోవనెరిగినవాడు,నల్లని వాడు,వర్తకమొనర్చువాడు,నియోగించుటయందు ధైర్యము కలవాడు,మేధావంతుడు నగును.ద్వితీయ ద్రేక్కణమున జన్మించిన పద్మములవలె విశాలమైన నేత్రము గలవాడు,మంచి రూపము,వాగ్ధాటి సాహసము,భుషణములు తన వంశమున పేరుగన్న పెద్దలననుసరించి గలవాడు నగును.తృతీయ ద్రేక్కణమున జన్మించిన చపలచిత్తుడు, శఠు(డు, కృతఘ్నుడు, కురూపి, కపటి, స్నేహితుడు, ధనము, ప్రఖ్యాతి నశించినవాడు స్వల్పబుద్ధి కలవాడు నగును.
వృశ్చిక జన్మలగ్నఫలము

(జాతక పారిజాతము నుండి) మూర్ఖుడు, క్రూరదృష్టి కలవాడు, చంచల స్వభావి, గౌరవనీయుడు, చిరాయువుకలవాడు ధని విద్వాంసుడు,సజ్జన ద్వేషి, విషాద విషయములలో ప్రియత్వం కలవాడు.(ఫలదీపిక నుండి) గుండ్రని తొడలు కలవాడు, విశాల ప్రస్పుట నేత్రములు కలవాడు, విశాల వక్షస్థలం కలవాడు, బాల్యవస్థ నుండి వ్యాది పీడితుడు, రాజసమ్మానితుడు. (మానసాగరీ నుండి ) వృద్ధ స్వభవుడు, క్రోధి.

వృశ్చిక పూర్వార్ధమున జనించిన ఎర్రని కొనలు కల్గి పచ్చనైన నేత్రములు ,సాహసములైన పనులు, యుద్ధమున పరాక్రమము, చెడు ప్రవర్తన గల స్త్రీ యెడ ప్రేమ , ధనము గలవాడు, ద్వితీయహోరయందు జన్మించిన మిక్కిలి పొడవు, లావు గల శరీరము, రాజసేవ, చాల ఋణములు, స్నేహితులు, స్పుటమైన నేత్రములు గవాడగను.


వృశ్చికలగ్నము యొక్క ప్రధమ ద్రేక్కాణమున జన్మించిన శరీరము గలవాడు, స్థిరమైన వాడు, మక్కిలి కొపమ్ కలవాడు, యుద్ధమున గొప్ప సామర్ధ్యము గలవాడు, వశాలమగు నేత్రములు లావైనదియు పొడవైనదియు నగు శరీరము గలవాడు, కలియుగాచారములయందు, ప్రీతి గలవాడు నగును. ద్వితీయ ద్రేక్కాణమున జన్మించిన మృష్టాన్నము, పానియములు, నిలకడలేని నేత్రములు. బంగారమువలే పచ్చనైన దేహము,సౌందర్యము,ఇతరులసొత్తు,మంచినడవడి మంచి కళలుగలవాడగును. తృతీయ ద్రేక్కాణమున జన్మించిన గడ్డము మీసములు శరీరమున రోమములు లేనివాడు,ఘాతకుడు,పచ్చనికండ్లు, గలవాడు, గొప్పకడుపు గలవాడు.ఇతరుల దండించువాడు,సోదరులనుండి విడిపోయినవాడు.బలిసిన బాహువులు గలవాడు,ధైర్యము గల హృదయము గలవాడు నగును.
ధనుస్సు జన్మలగ్నఫలము

(జాతక పారిజాతము నుండి) ప్రజ్ఞావంతుడు,కులశ్రేష్టుడు,ధనవంతుడు,యశస్వి,అభివృద్ధి త్వరగా పొందువాడు.(ఫలదీపిక నుండి) పొడుగాటి ముఖము,గొంతు కలవాడు,పెద్ద చెవులు,ముక్కు కలవాడు, తన కార్యములందే నిమగ్నమగువాడు,హ్రస్వ శరీరుడు, రాజప్రియుడు, బలాఢ్యుడు, దయాళువు. (మానసాగరి నుండి ) కార్య ప్రవీణుడు ,దైవ,బ్రహ్మణప్రియుడు.

ధనుర్లగ్న ప్రధమహోరయందు జన్మించిన నోటి పూత,వెడల్పగు రొమ్ము,చిన్న నేత్రములు,దవడలు గలవాడు పసితనముననే తల్లిదాండ్రులు లేని వాడు,తపస్సు చేయువాడు నగును,ద్వితీయహోరయందు జన్మించిన పద్మములవంటి నేత్రములు,పొడవగు బాహువులు,శాస్త్రమున పరిచయము,మంచి దేహము,ధన్యత గలవాడు,సౌఖ్యవంతుడు,కీర్తిగలవాడు అగును.


ధనుర్లగ్నముయొక్క ప్రధమద్రేక్కాణమున జన్మించిన గుండ్రని కండ్లు ముఖము,మంచి గుణములు గలవాడు,స్వయముగా నభవృద్ధినొందువాడు,మంచి ఆచారములు,మార్ధవము గలవాడు నగును. ద్వితీయద్రేక్కాణమున జన్మించిన శాస్తార్ధమునెరిగిన వాడు మంచి వక్త,మంత్ర శాస్త్రవేత్తలలో అగ్రగణ్యుడు,అనేక తీర్ధముల దేవాలయములు సంచరించువాడు నగును.తృతీయద్రేక్కాణమున జన్మించిన బంధువులలో ప్రాధాన్యము,నేర్పు సత్పురుషుల కాశ్రయుడు,ధర్మ పరాయణత,అభిమానము,ఇతర స్త్రీలతోటి పొత్తు, మంచి రూపము, యశస్సు, విజయము గలవాడు నగును.

మకర జన్మలగ్నఫలము

(జాతక పారిజాతము నుండి) రమణీలోలుడు,శఠారులు,దీనవాక్యములు పలుకువాడు..(ఫలదీపిక నుండి) శరీరములో అధో భాగములు కృశించినవిగా కలవాడు.(మానసాగరి నుండి) భయస్తుడు,ఇతరులను మోసగించువాడు,ధూర్తుడు,కఫ,వాత,ప్రకృతి కలవాడు.

మకర ప్రదమహోరయందు జన్మించిన నల్లని దేహము,సింహము వంటి నేత్రములు కలవాడు,ధన్యుడు,స్త్రీ వలన జయింపబడనివాడు,ప్రసన్నరూపము గలవాడు,పోకిరి,సంపన్నుడు,మృష్టాన్నము నారగించువాడు ,మంచి పనుల నొనర్చువాడు,సన్నని పెద్ద ముక్కు గలవాడు నగును.ద్వితీయహోరయందు జన్మించిన ఎర్రని కనుబొమ్మలు గలవాడు, సోమరీ, ఎల్లప్పుడు మార్గమున సంచరించువాడు, మూర్ఖుడు, నల్లనిదియు అంతటను రోమములు గల్గిన దేహము, మిక్కిలి తీవ్రత,సాహసము, రౌద్రత, గల పనులు గలవాడగును.


మకరలగ్నముయొక్క ప్రధమద్రేక్కణమున జన్మించిన పొడవగు బాహువులు గలవాడు, నల్లనివాడు, గొప్పకీర్తి కలవాడు, మంచి రూపము,కాంతిశౌఠ్యము గలవాడు,నవ్వుచు మాట్లాడువాడు, స్త్రీలవలన ఓడిపోవు వాడు, అందమగు వ్యాపారములు ధనముగలవాడు నగును.ద్వితీయద్రేక్కాణమున జన్మించిన చిన్న ముఖము చాపల్యము,స్త్రీ పరధనముల నపహరించుట,నేర్పు,సజ్జనులు నడువడి నెరుగుట, దానము, దురంతములగు పాదములు గలవాడగును.తృతీయద్రేక్కాణమున జన్మించిన వాచాలత గలవాడు, మలినుడు,కృసించువాడు,పొడవైనవాడు,తండ్రిలేనివాడు,విదేశగమనముల వలన దుఃఖములు నొందువాడు నగును.
కుంభ జన్మ లగ్న ఫలము

(జాతక పారిజాతము నుండి) మూర్ఖ మనసు, రతీకేళీ లోలుడు,కార్పణ్య స్వభావి, ధనవంతుడు అగును. (ఫలదీపిక నుండి) కుండాకార శరీరాకృతి కలవాడు, సుగంధప్రియ, పరధనాపేక్ష కలవాడు.(మానసాగరి నుండి) స్థిర స్వభావి,వాతా ప్రకృతి,జలక్రీడాప్రియుడు,శిష్ఠాచారి,జనప్రియుడు.

కుంభ ప్రధమహోరయందు జన్మించిన స్త్రీ మిత్రుల సౌఖ్యము కలవాడు,మ్రుదువైన వాడు,కొలదిపాటి పుత్రులు,సద్గుణములు,శౌర్యము,సూర్యుని వలె ఎర్రనగు దేహము,దేశాటనమున ప్రీతి , గలవాడగును. ద్వితీయ హోరయందైన ఎర్రని నేత్రములు,చిక్కిన దేహములు కలవాడు,పొట్టివాడు,సోమరి,ప్రతిక్రియ యెనర్చు వాడు,దుఃఖవంతుడు,లోభి,దుర్మార్గుడు అగును.


కుంభ లగ్నముయొక్క ప్రధమద్రేక్కనమున జన్మించిన స్త్రీలు,మానము,కీర్తి,రూపము,గొప్ప ప్రభావము కలవాడు,పొడవైన వాడు,కార్యములు ఓపికతో జేయువాడు,ధనవంతుడు,రాజసేవకుడు నగును. ద్వితీయ ద్రేక్కణమున జన్మించిన లోభి,సమర్ధుడు, మధురముగా మాటలాడువాడు,పచ్చని దేహము,పచ్చని భీకరములగు కండ్లు,పరిహాసము చేయు అలవాటు గలవాడు,దాటి గల మాట గలవాడు, బుద్ధిమంతుడు, స్నేహితులు విరివిగా గలవాడు నగును.తృతీయ ద్రేక్కాణమున జన్మించిన పొడవైన వాడు, పోకిరి, ప్రతాప వంతుడు, పొట్టి చేతులు కలవాడు,పుత్రుల వలన ధనమునొందువాడు,స్తభ్ధత గకవాడు, అసత్యము చెప్పువాడు, కపటి చీలిన నేత్రము కలవాడు,సంభోగమున చతురుడు నగును.

మీన జన్మలగ్నఫలము
(జాతక పారిజాతము నుండి) సాధారణ రతి వాంఛ కలవాడు,ఇష్టజనానుకూలుడు,తేజస్సు,బలము కలవాడు,ధన్యధాన్యములతో తులతూగువాడు అగును..(ఫలదీపిక నుండి) నీరు ఎక్కువగా త్రాగువాడు,విద్యావంతుడు,సులోచనుడు,అదృష్టవంతుడు,కృతఘ్నుడు అగును.(మానసాగరి నుండి) పిత్త ప్రకృతి,అతిక్రోధి.

మీనలగ్న ప్రధమహోరయందు పుట్టిన వాడు పొట్టివాడు,మంచిసౌందర్యము గల దేహము,వెడల్పగు నొసలు,వక్షస్థలము,స్త్రీల యెడ ప్రీతి,గొప్ప కీర్తి,కార్యముల పట్టుదల,శౌర్యము గలవాడు అగును.ద్వితీయ హోరయందు జన్మించిన ధాత్రుత్వము,పొడవగు ముక్కు,నేర్పు,చురుకైన బుద్ధి,సోభనకరములగు నేత్రములు, రాజప్రీతి ,స్త్రీలకు ప్రియుడగుట,సౌందర్యము,మంచిమాటలు గలవాడగును.


మీనలగ్నముయొక్క ప్రధమద్రేక్కాణమున జన్మించిన తేనెవంటి పచ్చని కండ్లు గలవాడు, పచ్చని శరీరము గలవాడు, సౌఖ్యవంతుడు, నీటియందు ప్రయాణము చేయువాడు, వినయవంతుడు నగును.ద్వితీయద్రేక్కాణమున జన్మించిన స్త్రీ లకు సేవించువాడు, మృష్టాన్నము నారగించువాడు, ఇతరులధనము ననుభవించువాడు,కాముకుడు, స్త్రీ లయందు, సత్పురుషులయందు ప్రేమ కలవాడు, వాగ్దాటి గలవాడు నగును.తృతీయ ద్రేక్కణమునందు జన్మించిన నల్లనివాడు, కళలయం దారితేరినవాడు, పెద్దపాదములు గలవాడు, మృష్టాన్నము దివ్యములగు పానియములు గలవాడు, పరిహాస నిపునుడు నగును. 

15, మార్చి 2013, శుక్రవారం

వాస్తులో తూర్పున పెద్ద బిల్డింగ్ ఉంటే...

వాస్తులో తూర్పున పెద్ద బిల్డింగ్ ఉంటే...

వాస్తు నియమాల్లో ఇంటి స్థలం ఎలా ఉంది, ముఖద్వారం ఎటువైపు ఉంది, తలుపులు, కిటికీలు ఎన్ని ఉన్నాయి, స్థలం రోడ్డు కంటే మెరకగా లేదా పల్లంగా ఉన్నదా తదితర అంశాలన్నీ గణనలోకి తీసుకుంటాం. ఈ అంశాలే కాకుండా ఇంటికి పక్కనున్న ఇళ్ళు ఎలా ఉన్నాయనేది కూడా పరిగణనలోకి వస్తుంది. వాస్తులో మన ఇంటికి చెందిన నియమాలు మాత్రమే కాదు, పక్కనున్న ఇళ్ళు, రోడ్లకు సంబంధించి కూడా కొన్ని సూత్రీకరణలు ఉన్నాయి. 

వాస్తులో ఇంటి ఆకృతికి కొన్ని నిర్దేశాలు ఉన్నాయి. ఇల్లు చతురస్రంగా (Square) కానీ, దీర్ఘ చతురస్రంగా (Rectangle) కానీ ఉండాలి. అలాంటి ఇల్లు మాత్రమే శ్రేయస్కరం. కొన్ని ఇళ్లను చూస్తుంటాం.. ఒక క్రమపద్ధతిలో లేకుండా కొన్నిచోట్ల లోనికి చొచ్చుకురావడం, ఇంకొన్నిచోట్ల బయటకు పొడుచుకు రావడం, మూలలు వక్రంగా తోసుకుపోవడం లాంటి ఎగుడుదిగుడులు కనిపిస్తాయి. కొన్ని ఇళ్లలో ఒకటి కంటే ఎక్కువ వంకరలు కూడా ఉండటం కనిపిస్తుంది. ఇవన్నీ దోషాలే. 

వాస్తు ప్రకారం ఇంటికి తూర్పు దిక్కునున్న నిర్మాణం మనదానికంటే పెద్దదిగా ఉంటే, అప్పుడు మనం ఏం చేయాలో చూద్దాం. తూర్పువైపున మన ఇంటికంటే పెద్ద భవనం గనుక ఉన్నట్లయితే మామూలు వాస్తు నియమాల ప్రకారం వదలాల్సిన ఖాళీస్థలం కంటే కనీసం అయిదు అడుగుల జాగాను అదనంగా వదలాలి. ఒకవేళ తూర్పున మాత్రమే గాక, పశ్చిమాన కూడా పెద్ద నిర్మాణమే ఉంటే... (తూర్పున ఉన్న భవనం అంత లేదా అంతకంటే పెద్దది అయిన నిర్మాణం) ఈ సూత్రం వర్తించదు. అంటే తూర్పు, పడమర – రెండు దిక్కులలోనూ మన ఇంటికంటే ఎత్తయిన భవనాలు ఉంటే దోషం లేదు. తూర్పున మాత్రమే ఉంటే, కొంత స్థలం వదలడం ద్వారా దోష నివారణ చేసుకోవచ్చు.
వాస్తు సవ్యంగా ఉండి, సత్ఫలితాలు రావాలంటే ముందుగా స్థలంలో ఎగుడుదిగుడులు లేకుండా, చతురస్రం లేదా, దీర్ఘ చతురస్రం ఆకృతిలో ఉన్న ఇళ్ళ స్థలాలను మాత్రమే కొనుగోలు చేయాలి. అలాంటి స్థలాల్లో కట్టిన ఇళ్లను మాత్రమే కొనుక్కోవాలి.
ఇంటికి ఈశాన్య దిక్కులో గది తప్పక ఉండాలి. అక్కడ ఖాళీగా ఉంచి "L” ఆకృతిలో ఇల్లు కట్టడం మంచిది కాదు. ఈశాన్య దిశలో ఉన్న గదిని పూజకు కేటాయించాలి. ఈశాన్య దిక్కున పొరపాటున కూడా బాత్రూం ఉండకూడదు.
ఇంటిచుట్టూ ఉండే ప్రహరీ గోడ ఇంటికి సరిహద్దును తెలియచేస్తూ రక్షణ ఇవ్వడమే కాదు, అందాన్ని ఇస్తుంది. ప్రహరీ గోడ లేకుంటే ఇల్లు సంపూర్ణంగా ఉన్నట్టు ఉండదు.
తూర్పువైపున మన ఇంటి కంటే పెద్ద బిల్డింగ్ కనుక ఉంటే మామూలుగా ఉండాల్సిన ఖాళీ స్థలం కంటే మరో 5 అడుగుల ఖాళీ స్థలం వదలాలి. ఈ నియమం మన ఇంటికి తూర్పువైపున మాత్రమే పెద్ద కట్టడం ఉన్నప్పుడు వర్తిస్తుంది.
అలాగే ఉత్తర దిక్కున మన ఇంటికంటే పెద్దదయిన భవనం ఉంటే తూర్పువైపున చెప్పినట్లే మామూలుగా వాస్తు నియమం ప్రకారం వదలాల్సిన జాగా కంటే అయిదు అడుగుల అదనపు స్థలాన్ని వదిలిపెట్టాలి.
ఉత్తరాన మన ఇంటి కంటే పెద్ద భవనం ఉన్నప్పుడు దక్షిణ నైరుతిలో ఉపగ్రహం నిర్మించాలి.
దక్షిణ ప్రహరీ గోడకి ఒక అరుగు కట్టాలి.
ఇంటికి దక్షిణాన రోడ్డు గనుక వచ్చినట్లయితే, సరిగ్గా ఈ నియమాలే వర్తిస్తాయి.
ఒకవేళ ఇంటికి దక్షిణాన గనుక ఉత్తరదిక్కున ఉన్న భవనంతో సమానమైన లేదా అంతకంటే పెద్దదైన భవనం ఉంటే అప్పుడు అదనపు ఖాళీ స్థలం వదలాల్సిన అవసరం లేదు.
ఒకవేళ తూర్పుదిక్కు మాదిరిగానే ఇంటికి పశ్చిమ దిక్కున కూడా తూర్పు వైపున ఉన్నంత లేదా అంతకంటే పెద్ద బిల్డింగ్ ఉంటే గనుక మామూలు కంటే ఇంకా 5 అడుగుల ఖాళీ జాగా వదలాలి అనే నియమం వర్తించదు.

ఈ బ్లాగును శోధించుRelated Posts Plugin for WordPress, Blogger...