వైడూర్యము :
వైడూర్య రత్నలు కేతు గ్రహానికి సంభంధించినవి. న్యాయాన్యాయ వివేచన, పుణ్యపాప
వివక్షత, ధర్మాధర్మ పరిశీలనలు గల చిత్ర గుప్తుని అంశవల్ల ఈ వైడూర్య
రత్నాలు పుట్టినట్లు కొందరు చెబుతారు. శరత్కాలంలో చంద్రుని యొక్క షోడస కళలు
గల వెన్నెల కిరణలు కొన్ని రసాయన ధాతువులు కలిగిన శిలాభూములయందు ప్రవేశించి
అచ్చట రసధాతువులు గల శిలాభూములయందు ప్రవేశించి అచ్చటి రసధాతువులుగల శిలలకు
చంద్రకిరణములకు కలిగే పరస్పర సంయోగం వలన ఆశిలలు కొంత కాలానికి వైడూర్య
రత్నాలుగా మారతున్నవని కొందరి అభిప్రాయము.
అశ్వని, మఘ, మూల జన్మ నక్షత్రాలుగా కలిగియున్నవారువైడూర్యాన్ని ఏ సమయములో
నైనను ధరించవచ్చును. మిగిలిన నక్షత్రములు గలవారు తమ జన్మ కాలమందలి
గ్రహస్థితి ననుసరించి కేతువు యొక్క దోషప్రదమైన కాలము నందు ఈ రత్నము ధరించుట
ఉత్తమము. జన్మజాతకములందు శుభస్థానములందు కేతువు బలహీనుడై ఉన్నప్పుడు
వైడూర్యధారన చేసిన ఆ కేతువు సకల శుభముల నొసగును. బలవంతుడైన కేతుగ్రహము
6-8-12 స్థానములందుండుట ఆ స్థానాధిపతులతో కలసి చూడబడుట చాలా దోషప్రదము.
పాపగ్రహముల యతి, దృష్టి వేధల వంటి సంబంధములు కలిగియున్న కేతువు అపకారమును
చేయగలడు, లగ్నము నుండి 2 వ స్థానమునందు పాపబలముగల కేతువుండుట, ఆ విధముగా
పంచమ స్థానమందుండుట, ఏడవ స్థాన మునందుండుట 9 వ స్థానమునందుండుట కూడా
దోషప్రదమే!
జన్మ లగ్నము ననుసరించి ఏర్పడిన గ్రహములు బలాబలములందు కేతుగ్రహము పూర్తి
బలవంతుడై దుష్ఠ స్థానములందుండగా అతని మహర్దశ, అంతర్దశలు, ఇతర యోగదశలలో ఇతని
అంతర్దశలు, విదశలు సంభవించినప్పుడుషడ్వర్గబలము, అషటకవర్గ బిందు బలము కలిగి
కేతువు గోచారము నందు దుష్టస్థానములందు సంభవించు గొప్ప భయముతో కూడిన
కష్టములు ప్రాప్తించగలవు. అంతే గాక దోషప్రదమైన కేతు గ్రహానికి సంబంధించిన
కాలంలో పిచ్చి ఉన్మాదము, భిక్షుక వృత్తి, కృరప్రదేశములందు నివాసము సరియైన
ఆహార నిద్రాదులు లేకుండుట, సిరి సంపదలు అకారణముగా తొలగిపోవుట, కృషి నాశనము
ఉద్యోగ భంగము, కుటుంబకలహము విరక్తి, భార్య నష్టము పితృమృతి, సంతాన
కష్టనష్టములు, దుష్కీర్తి, అపజయము, వేదన, శతృభీతి విషజంతువులచే ప్రమాదము,
ధన సంభంధమైన ఇబ్బండులు, కోర్టు వ్యవహారములు కోర్టు వ్యవహారములలో ప్రతికూలత,
మనో వ్యద పిల్లల బాలారిష్టములు కురుపులు మొదలగు చేమ వ్యాదులు కలరా,
విడువని తల నొప్పి, అజీర్ణవ్యాధులు, దురదలు ఆటలమ్మ, తడపర, ఉబ్బాసం కాన్సర్,
ప్రసూతి బాధలు, నొప్పులు సరిగారాక పోవడం, కష్టమైన కాన్పు, గుర్రపు వాతము
తీవ్రమైన దరిద్రము, మొదలగు అనేక విషమ పరిణామములు సంభవించి దుఃఖపెట్టగలవు.
అటువంటి సందర్భాలలో వైడుర్య రత్నము ధరించడం వలన సత్ఫలితాలు
కలుగును.వైడూర్యాల ద్వారా కలిగే శుభయోగాలు : ఉత్తమ జతికి చెందిన దోషరహితమైన
వైడూర్యమును ధరించిన యెడల జీవితం అభివృద్ది దాయకంగా నుండుటయే గాక ఆర్ధిక
పుష్టి కృషిలో రాణింపు ఉద్యోగ ప్రాప్తి అధికారము జనాదరణ పలుకుబడి, కీర్తి
గౌరవ మర్యాదలు, భోగ భాగ్య సంపదలు వాహన ప్రాప్తి గృహ లబ్ది, కళత్ర సౌఖ్యము,
కుటుంబ సుఖశాంతులు శతృనాశనము, జయము కార్యశిద్ది దేహా రోగ్యము, సకల
వ్యాధినాశనము, ఆయువృద్ది, అరిష్టనివారణ, దుష్టగ్రహ బాధా విముక్తి,
దేవతానుగ్రహము సుఖము శాంతి సద్భావన, సజ్జన స్నేహము, సర్పదోష పరిహారము,
సంతానప్రాప్తి, వంశాభివృద్ది కలుగగలవు.
వైడుర్యము అత్యంత మహిమాన్వితమైనదగుట వలన దీన్ని ధరించెడి వాడికి సకల
క్షేమము కలుగ చేయగలదు. ప్రసవకాలంలో స్త్రీలకు కలుగు అనేక బాధలు నివారించి
సుఖముగా శీఘ్రముగా ప్రసవము జేయింపగలరు. ఈ రత్నమును నీటియందుంచి ఆ నీటిని
ప్రసవ స్త్రీలచే త్రాగించిన శీఘ్రముగా ప్రసవించుటయే గాక ప్రసవానంతరం
సంభవించే దుష్టలక్షణముల నుండి పూర్తిగా రక్షణ కలిగించగలదు.. చర్మ వ్యాధులు
గలవారు ఈ వైడుర్యము ఆదివాసము గావించిన నీటిచే స్నానము చేసిన అనతి కాలంలోనే
చర్మ వ్యాధుల నుండి విముక్తులై ఆరోగ్యవంతులు కాగలరు. గృహము నందలి
సింహద్వారామునకు పైభాగమున వైడూర్యములు తాపటము జేయించిన ఆ గృహమునందు
నివశించే వారికి అమ్మవారు ఆటలమ్మ, తడపర, కలరా, మొదలగు బాధించవు.
వైడూర్య రత్నము అమోఘమైన శక్తి సంపన్నమై యున్నది. ఇది ధరించిన శతృవులు సైతం
మితృలుగా మారిపోగలరు. పగవారు చేయు చేత బడి, ప్రయోగములు మొదలగు కృత్రిమములు
భూత భేతాళ, యక్ష రాక్షస, శాకినీ, కామినీ మొహిన