శ్రీ మేధా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం

మీరు జన్మించిన తేది, సమయం, ప్రదేశం ఈ మూడు సమాచారములు మాకు తెలియచేసినచో మీ వ్రుత్తి,వ్యాపార,ఆరోగ్య,ఆర్ధిక పరిస్తితులు, దాంపత్యం, విద్య, ఉద్యోగ, వివాహ, కుటుంబవ్యవహారాలు, సంతానం, రాజకీయ వ్యవహారాలు,ప్రేమ వ్యవహారములు,కుజ దోషం, కాలసర్ప దోషం మరియు వివాహ, ఉపనయన, గృహప్రవేస, జప, హోమ, వ్రత, అన్నప్రసన, నామకరణం లకు ముహూర్తములు పెట్టబడును. P.V.RADHAKRISHNA CELL :+91 7013390324, Mail us :parakrijaya@gmail.com
Get your horoscope by giving Date, time and place of birth. Do you have mobile no. 9966455872 Live chat with WhatsApp Pantula Venkata RadhaKrishna.Get a solution to your horoscope problems

13, డిసెంబర్ 2014, శనివారం

నవగ్రహ స్వరూప వర్ణనలు

నవగ్రహ స్వరూప వర్ణనల
ఆదిత్యుడు :
కశ్యపుని కుమారుడు సూర్యుడుభార్య అదితిఅందుకేఆదిత్యుడు అని పిలుస్తాముసప్త అశ్వాలతో ఉన్న రధం అతనివాహనం సప్త అశ్వాలు ఏడు చక్రాలకు ప్రతీకలు.
మూలాధారంస్వాదిష్టానంమణిపూరకంఅనాహతం,విశుద్ధఆగ్య్హ్నా చక్రం , సహస్రారం )వివాహ పరిబంధన దోషంపుత్ర దోషంపుత్ర పరిబంధన దోషం,విద్యా పరిబంధన దోషంఉద్యోగ పరిబంధన దోషంసూర్య దోషంమొదలైన దోషాలతో బాధ పడే వారు సూర్యుని పూజించటంవలన ఫలితం పొందుతారు.సింహరాశి కి అధిష్టాన దేవుడు సూర్యుడునవగ్రహాలలో మద్య స్థానం ఆదిత్యుడిది.అధిదేవత అగ్నిప్రత్యధి దేవత రుద్రుడుఆదిత్యుడు ఎరుపు వర్ణం లో ఉంటాడు.
ఇష్టమైన ధాన్యం : గోధుమలు
పుష్పం : తామర
వస్త్రం : ఎర్రని రంగు గల వస్త్రం
జాతి రాయి : కెంపు
నైవేద్యం : గోధుమలురవ చక్కర పొంగలి

_____________________________________________________________________________________

చంద్రుడు :
చాల అందమైన వాడిగా మనం వర్ణిస్తూ ఉంటాంవర్ణనలకుకంటే మిన్నగా చంద్రుడు చాల అందమైన వాడుపది తెల్లటిగుర్రాలతో ఉన్న రధాన్ని అధిరోహిస్తాడునిశాదిపతి ( రాత్రికి రాజు), క్షుపరక (రాత్రిని కాంతివంతం చేసే వాడుఅనిపేర్లు కూడా కలవుఇరవైఏడు నక్షత్రాలను సూచిస్తునట్టు,ఇరవైఏడు మంది భార్యలను కలిగి ఉన్నాడుతండ్రి సోమతల్లి తారక.అనారోగ్యం తో బాధ పడుతూ ఉన్న తల్లిచర్మ వ్యాధులు మొదలైన సమస్యలు కలవారుచంద్రుని పూజ వలన ఫలితం పొందగలరు.కర్కాటక రాశి కి అధిపతి చంద్రుడుతూర్పు - దక్షిణ అభిముఖుడై ఉంటాడు.
అధిదేవత : నీరు.
ప్రత్యధిదేవత : గౌరి
వర్ణం : తెలుపు
ధాన్యం : బియ్యం / వడ్లు
పుష్పం : తెల్లని తామర
వస్త్రం : తెల్లని వస్త్రం
జాతి రత్నం : ముత్యం
నైవేద్యం : పెరుగన్నం
_____________________________________________________________________________________ మంగళ :అంగారకుడు ( ఎర్రని వర్ణం కలవాడుఅని కూడా పిలుస్తాం.ఇతను భూదేవి కుమారుడుమేషవృశ్చిక రాసులకిఅధిపతిదక్షినాభిముఖుడురుచక మహాపురుష యోగవిద్యను భోదిస్తాడుతమోగుణ వంతుడు.భార్య / పిల్లలు / అన్నదమ్ముల వల్ల సమస్యలు ఉండేవారు,స్నేహితులతో శత్రుత్వంసంపదను కోల్పోయిన వారు మంగళ దేవుడిని పూజించటంవలన సత్ఫలితాలను పొందుతారు.
అధిదేవత : భూదేవి
ప్రత్యదిదేవత : క్షేత్ర పాలకుడు
వర్ణంఎరుపు
ధాన్యం : కందిపప్పు
పుష్పం : సంపంగి మరియు తామర
వస్త్రం : ఎరుపు రంగు వస్త్రం
జాతి రత్నం : ఎర్రని పగడం
నైవేద్యం : కందిపప్పు తో కూడిన అన్నం

_____________________________________________________________________________________ 


బుధుడు :
తారచంద్రుల పుత్రుడు బుధుడురజోగుణవంతుడుపుత్రదోషంమంద విద్యచంచలమైన మనసు కలవారు బుధునిపూజలు చేసి ఉపసమనం పొందుతారుతెలివితేటల వృద్ధి,సంగీతంజ్యోతిష్యంగణితంవైద్యం వంటి వాటిలోరానిచాలంటే బుధుడి అనుగ్రహం పొందాలి.మిధున మరియు కన్యారాశి కి అధిపతి బుధుడుతూర్పు -ఉత్తర ముఖుడై ఉంటాడు.
అధిదేవత : విష్ణు
ప్రత్యధిదేవత : నారాయణుడు
వర్ణం : చిగురాకు పచ్చ
వాహనం : సింహం
ధాన్యం : పచ్చ పెసర పప్పు
వస్త్రం : పచ్చని రంగు వస్త్రం
జాతి రత్నం : పచ్చ
నైవేద్యం : పెసరపప్పు తో కూడిన అన్నం

_____________________________________________________________________________________ 


గురు :బృహస్పతి అని కూడా అంటాము.దేవతలకుదానవులగురువైన శుక్రాచారుడికి గురువు ఇతనుసత్వగుణసంపన్నుడుపసుపుపచ్చ / బంగారు వర్ణం లో ఉంటాడు.పేరు ప్రఖ్యాతులుసంపదతోడ బుట్టినవారి క్షేమము కొరకుగురువు ని పూజించాలి 
ధన్నురాశిమీనా రాశిలకు అధిపతిఉతరముఖుడైఉంటాడు.
అధిదేవత : బ్రహ్మ
ప్రత్యధిదేవత ఇంద్రుడు
వర్ణంపసుపు
వాహనం : గజరాజు
ధాన్యం : వేరుసెనగ పప్పు
పుష్పం : మల్లె
వస్త్రం : బంగారు రంగు వస్త్రం
జాతి రత్నం : పుష్య రాగం
నైవేద్యం : సెనగపప్పు తో కూడిన అన్నం
 

 _____________________________________________________________________________________


శుక్రుడు :
ఉషనబృగు మహర్షి  సంతానంఅసురులకుగురువు ఇతనురజోగుణ సంపన్నుడుధవళ వర్ణంతో మద్యవయస్కుడిగా ఉంటాడుఒంటె / గుఱ్ఱము /మొసలి వాహనంగా కల్గి ఉంటాడు.అనుకోని పరిస్థితుల వల్లన కుటుంబాలు విడిపోవడంలేక తగాదాలు రావడం , బాగా కలిసి ఉండేవారిమద్యలో శత్రుత్వం కలగడం మొదలైన విపత్కరపరిస్థితులనుండి శుక్రాచార్యుని పూజ వలన బయటపడే అవకాశం ఉంది.

వృషభతులరాశులకు అధిపతి.
అదిదేవత : ఇంద్రుడు
వర్ణం : తెలుపు
వాహనం : మొసలి
ధాన్యం : చిక్కుడు గింజలు
పుష్పం : తెల్లని తామర
వస్త్రం : తెల్లని వస్త్రం
జాతి రత్నం : వజ్రం
నైవేద్యం : చుక్కుడు గింజల తో కూడిన అన్నం

_____________________________________________________________________________________  


శని :
సూర్యభగవానుడి పుత్రుడు శనిభార్య ఛాయా దేవి (నీడ). నల్లని వర్ణం తోనలుపు వస్త్రధారణతోకాకివాహనంగా కలిగి ఉంటాడు.శని దేవుడిని అందరు తిడ్తూ ఉంటారునిజామే అలాoటిబాధలు పెడతాడు శనిమనల్ని ఎంతగా బాధ పెట్టికష్టాలు పెడతాడోఅంతకంటే ఎక్కువ మంచి చేసివెళ్తాడు.కుంభమకర రాసులకి అధిపతిపడమటి వైపు ముఖాసీనుడై ఉంటాడు.
అదిదేవత : యముడు
ప్రత్యధిదేవత ప్రజాపతి
వర్ణం : నలుపు
ధాన్యం : నల్ల నువ్వులు
పుష్పం : నల్లని తామర
వస్త్రం : నల్లని వస్త్రం
జాతి రత్నం : నీలం
నైవేద్యం : నల్లని నువ్వులు కలిపిన అన్నం

_____________________________________________________________________________________  రాహువు :
 సూర్య చంద్ర గ్రహాణాలకు కారకుడు గా చెప్పబడేరాహువు ను ఒక పాము రూపం లో వర్ణిస్తారుఒకకత్తి ని ఆయుధంగా చేసుకొనిఎనిమిది నల్లటిగుర్రాలను అధిరోహిస్తూ ఉంటాడు.పుత్ర దోషంమానసిక రోగాలుకుష్టు మొదలైనవిరాహు ప్రభావములే.పడమర - దక్షినాభిముఖుడై ఉంటాడు.
అదిదేవత : దుర్గ
ప్రత్యధిదేవత : పాము
వర్ణం : నలుపు
వాహనం : 
నలుపు సింహం
ధాన్యం : మినుగులు
పుష్పం : అడవి మందారం
జాతిరత్నం : గోమేధుకం
వస్త్రం : నల్లటి వస్త్రం
నైవేద్యం : మినుగులతో కూడిన అన్నం
 
____________________________________________________________________________________   

కేతువు :
భార్య చిత్రలేఖఆస్తి నష్టంచెడు అలవాట్లుపుత్ర దోషంమొదలైనవి తొలగాలంటే కేతు పూజలు చేయాలి.ఉత్తరం - పడమటి ముఖాసీనుడై ఉంటాడు.

అదిదేవత : చిత్రగుప్తుడు
ప్రత్యధిదేవత : బ్రహ్మ
వర్ణం : ఎరుపు
వాహనం : గద్ద
ధాన్యం : ఉలవలు
పుష్పం : ఎర్రని కలువ
వస్త్రం : రంగురంగుల వస్త్రం
జాతి రత్నం : వైడుర్యం
నైవేద్యం : ఉలవల అన్నం.ఈ బ్లాగును శోధించుRelated Posts Plugin for WordPress, Blogger...