శ్రీ మేధా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం

మీరు జన్మించిన తేది, సమయం, ప్రదేశం ఈ మూడు సమాచారములు మాకు తెలియచేసినచో మీ వ్రుత్తి,వ్యాపార,ఆరోగ్య,ఆర్ధిక పరిస్తితులు, దాంపత్యం, విద్య, ఉద్యోగ, వివాహ, కుటుంబవ్యవహారాలు, సంతానం, రాజకీయ వ్యవహారాలు,ప్రేమ వ్యవహారములు,కుజ దోషం, కాలసర్ప దోషం మరియు వివాహ, ఉపనయన, గృహప్రవేస, జప, హోమ, వ్రత, అన్నప్రసన, నామకరణం లకు ముహూర్తములు పెట్టబడును. P.V.RADHAKRISHNA CELL :+91 7013390324, Mail us :parakrijaya@gmail.com
Get your horoscope by giving Date, time and place of birth. Do you have mobile no. 9966455872 Live chat with WhatsApp Pantula Venkata RadhaKrishna.Get a solution to your horoscope problems

21, అక్టోబర్ 2014, మంగళవారం

నవరత్నములు అశుభముగ్రహాలు వారి రత్నములు
రవి - మాణిక్యము
చంద్రుడు - ముత్యము
కుజుడు - పగడము
బుధుడు - మరకతము(పచ్చ)
గురువు - పుష్యరాగము
శుక్రుడు - వజ్రము
శని - నీలము
రాహువు - గోమేధుకము
కేతువు - వైడూర్యము

ఈ రత్నములలో గురుపాలితులవి శనిపాలితులు, శనిపాలితులవి గురుపలితులు ధరించిన తప్పక దుష్ఫలితములను ఇచ్చును
గురు వర్గము: సూర్యుడు, చంద్రుడు, కుజుడు, గురువు, కేతువు.
శని వర్గము: శని, శుక్రుడు, బుధుడు, రాహువు.


చాలా  మంది జ్యోతిష్యులు నవరత్నములని అన్నింటిని ఒకే ఉంగరములో
దరించవచ్చని అందరికి ధరింప చేస్తున్నారు. ఇది చాలా తప్పు దీని వలన ఆశుభమే తప్ప శుభం లేదు శాస్త్రం చెప్పిందని ఇది మంచిదే అని అంటున్నారు కానీ ఎలా మంచిది అని అడిగితె ఒక్కో కారణం చెపుతున్నారు. గ్రంధాలూ వ్రాసిన వారు మనుషులే కదా వారేమి అయోనిసంభూతులు కాదుకదా తప్పుచేయకుండటానికి. ఇప్పడు ఉన్నది కృత్రిమ జ్యోతిషము దీనివలన ప్రజలు నష్టపోతున్నారు దొంగ జ్యోస్యులు లాభపడుతున్నారు.ఏ జాతకునికి ఐనను నవరత్నము ధరింప వద్దు. ఎంతటివాడికి ఐనను కష్టాలు
తప్పవు.

గురు, శుక్ర, పూర్ణ చంద్ర, శుద్ధ బుధులు శుభులు అని మిగిలిన వారు అనగా
కుజ, శని, రాహు, కేతు లు పాపులు అని వారు అన్న శాస్త్రాలలోనే ఉన్నది,
అలాంటప్పుడు పాపులు కీడు చేస్తారు కదా మరి వారి రత్నములు ధరిస్తే ఎలాశుభం చేస్తాయి.

నిజానికి గ్రహాలలో పాపులు ఎవ్వరు లేరు అందరు పూజనీయులే. లగ్నానుసారంగా శుభ, పాప గ్రహాలు ఏర్పడుతాయి.

జాతకుడు పుట్టిన నక్షత్రము ప్రకారము కొందరు రత్నాన్ని సూచిస్తారు ఇది మరో తప్పు నక్షత్రము గ్రహ ప్రారంభ దశను సూచిస్తుంది దానిపైనే చంద్రుడు
ఉంటాడు.  రోహిణి నక్షత్రము ఇది చంద్ర దశ ప్రారంభ నక్షత్రము చంద్రుడు
ముత్యమునకు అధిపతి కావున రోహిణి నక్షత్రములో జనించిన వారు ముత్యము ధరించవచ్చును అని చెపుతున్నారు, మరి లగ్నము ఏమి కావ
లి. నక్షత్రము పై ఉన్నది చంద్రుడే కదా లగ్నము ధనుస్సు ఐనప్పుడు కటకాధిపతి చంద్రుడు లగ్నానుసరంగాఅష్టమాధిపతి అవుతాడు. ధనుర్లగ్నానికి చంద్రుడు శత్రువు కదా అప్పుడు ఎలా ముత్యము ధరిస్తే శుభము కలుగు తుందో వారికే తెలియాలి.

జ్యోతిష శాస్త్రములో ముక్యమైనవి లగ్నము తదుపరి గ్రహాలు, నక్షత్రాలు.
లగ్నమే ప్రాణవాయువు, లగ్నమే సాధన, లగ్నమే    ముక్యము లగ్నము లేనిది జ్యోతిష శాస్త్రము అడుగుకుడా ముందుకు వేయలేదు.

రత్నాలు ధరించుటకు ముందు లగ్నాన్ని పరిశీలించాలి. లగ్న, పంచమ,
నవమాధిపతులను గమనించి వారి రత్నములను మాత్రమే ధరించాలి తప్ప వేరే వారివి ధరిస్తే కష్టాలు తప్పవు.

eg: మకర రాశిని చూద్దాము. మకారానికి లగ్నాధి పతి శని(శనికి నీలము)
పంచమాధిపతి శుక్రుడు(శుక్రునికి వజ్రము) నవమాధిపతి బుదుడు[బుడునికి పచ్చ(ఆకుపచ్చ)] ధరించ వచ్చు, రాహువు శనిపాలితుడే కావున గోమేధుకము కూడాధరించ వచ్చు.

లగ్నము ప్రకారము రత్నము సుచించుటే క్షేమము.

నవరత్నములు ధరించుట వలన ఆ జాతకునికి లేక తన భార్య పిల్లకు కష్టాలు
తప్పవు. వంశమే నాశనము చేయగల శక్తి ఉన్నది.

9, అక్టోబర్ 2014, గురువారం

కాక్ - సి.వో.సి (coc) అంటే ఏమిటి?


వాస్తులో "కాక్" పదానికి ఎంతో ప్రాముఖ్యత వుంది. ఇంటిలో ఎంతో కాలంగా ఉపయోగించని వస్తువుల్ని ఏరిపారేసి ఆయా దిక్కుల్లోని పంచభూతాలకు
పరిశుభ్రమైన గాలిని అందించే ప్రక్రియనే క్లియరింగ్ ఆఫ్ క్లట్టర్ (సి.వో.సి - coc - కాక్) అంటారు. ఇంటి ఆవరణ, వంటగది, పడక గదులను తప్పనిసరిగా ఈ ప్రక్రియతో ఎప్పుడూ క్లీన్ చేస్తూనే వుండాలి. అంటే అష్టదిక్పాలురకు నిరంతరం పంచభూతాలతో అనుసంధానం వుండేట్లు చేస్తూనే వుండాలన్నమాట.

తూర్పులోని చెత్త అంటే పనికిరాని సామానులుంటే అది మీ పరువు
ప్రతిష్టలపైనా, వృత్తి మీదా, డబ్బు పైనా వ్యతిరేక ప్రభావం చూపిస్తుంది.
పడమరలోని చెత్త దరిద్రాన్ని, నీటి కొరతను, శరీరంలో డీహైడ్రేషన్‌ను
కల్గిస్తుంది. దక్షిణంలోని చెత్త వల్ల అనారోగ్యం, ఉత్తరంలోని చెత్తవల్ల
అధిక ఖర్చులూ, నైరుతీలోని చెత్తవల్ల నిద్ర పట్టకపోవడం, వాయవ్యంలోని
చెత్తవల్ల పిల్లలు చదువులో వెనుకబడిపోవడం, ఈశాన్యంలోని చెత్తవల్ల దైవ
కృపకు దూరం అయ్యి శ్వాస సంబంధమైన వ్యాధులతో బాధ పడటం వంటివి
సంభవిస్తాయి.

ఏ గది ఎక్కడ, ఏ వస్తువులు ఎక్కడ?

సైద్ధాంతికపరంగా ఏ గది ఎక్కడ వుంటే మంచిది. ఏ గదిలో ఏయే వస్తువుల్ని
వుంచుకోవచ్చు అనే విషయాన్ని ఈ చిత్రం ద్వారా తెలుసుకోవచ్చు. అయితే
సిద్ధాంతం వేరు, దానిని జౌపయోగికంగా (ప్రాక్టికల్) ఉపయోగించడం వేరని మనం తెలుసుకోవాలి. పెన్సిలిన్ ఇంజక్షన్ మందులోని ఫార్ములా ఒకటే అయినా భిన్నరకాల వ్యాధులకు దానిని ఉపయోగించే తీరుమారినట్లుగా అన్నమాట.ఈ చిత్రం కేవలం సిద్ధాంతపరమైన గదుల అమరికలను, వాటిలో వుంచాల్సిన వస్తు సముదాయాల్ని మాత్రమే సూచిస్తుంది. ఇదే రీతిలో ఇళ్ళు కట్టిన వారందరికీ అభివృద్ధి వుంటుందన్న నియమం లేదు. ఆయా వ్యక్తుల జాతకాల్లోని గ్రహబలాన్ని అనుసరించి ఇంటి నిర్మాణంలోని గదుల హోదా, వుంచాల్సిన వస్తువుల జాబితాలో మార్పు చెందుతాయని గ్రహించాల్సివుంది.

నాలుగు ప్రధాన దిక్కులైన తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అనేవి మనిషి
జీవితంలోని నాలుగు పురుషార్థాలైన ధర్మ, అర్థ, కామ, మోక్షాలకు పరోక్షమైన
సూచికలు (ప్రతీకలు). తూర్పు ధర్మం, పడమర కామము, ఉత్తరం అర్థము (డబ్బు) ,దక్షిణం మోక్షము(మృత్యువు - పరలోక ప్రయాణాలు మొదలైనవి అని అర్థము). ఒక్కో దిక్కు, ఆ దిక్కును పాలించే దేవతలకు ఇష్టమైన రంగులూ, వస్తువులూ వుంటాయి. 

8, అక్టోబర్ 2014, బుధవారం

కాలానుగుణ "వాస్తు" అంటే?జ్యోతిష్య శాస్త్రంలో సమానంగా ఎదుగుతున్న ప్రాచీన భారతీయ సంప్రదాయ శాస్త్రాలలో 'వాస్తు' ఓ విభాగం . కొన్ని సందర్భాల్లో ఇది జ్యోతిష్య శాస్త్రాన్ని సైతం అధిగమించి ఎదుగుతోందనడానికి నిదర్శనం, ఈ వాస్తు పట్ల దేశ వ్యాప్తంగా పెరుగుతున్న ఆదరణే అని చెప్పవచ్చు. అయితే కేవలం మార్కెట్లో పుస్తకాలు కొని చదివి వాస్తును తెలుసుకోవాలనుకుంటే మాత్రం గృహస్తు లేదా భవన నిర్మాణ నిర్మాతలు పప్పులో కాలేసినట్లే. మారుతున్న కాలంతో పాటుగా భారతీయ వాస్తులో సైతం కొన్ని అధునాతనమైన మార్పులు ప్రయోగాత్మకంగా మార్చవలసి వస్తున్నా, వాటివల్ల జరిగే ప్రయోజనపు పాళ్ళు అధికంగా వుండటంతో, అటు ఆర్కిటెక్టులూ, ఇటు శాస్త్రీయ సిద్ధాంతులు సైతం వీటిని తమ నిర్మాణాల్లో అమలు పర్చేందుకు ముందుకు రావడం ఒక స్వాగతించవలసిన శుభపరిణామం.సాధారణంగా వాస్తులో ప్రధానమైనది నిర్ధిష్టమైన కొలతలతో కూడిన “ఆయముల” నిర్ణయం. ఇంటిలోని ఏయేదిక్కుల్లో, యేయే ఆయములు వుంటే ఎలా కల్సివస్తుందో చెబుతుందీ పద్ధతి. దీనినే పాశ్చాత్యులు 'బాగ్‌వా' అంటారు. ఇళ్ళు లేదా భవంతిని నిర్మించబోయే భూమిని అష్టదిక్పాలకులు పాలిస్తుంటారు. ఒకొక్క దిక్కునూ ఒకొక్క దేవత శాసించి, నియంత్రిస్తుంటుంది.

తూర్పును ఇంద్రుడు, పడమరను వరుణుడు, ఉత్తరానికి కుబేరుడు, దక్షిణానికి యముడు, ఈశాన్యమునకు ఈశానుడు, ఆగ్నేయానికి అగ్ని, వాయవ్యానికి వాయువు, నైరుతీదిశను నిరుతి అనే ఎనిమిదిమంది దిక్పాలకులు పాలిస్తుంటారు.

ఇంద్రుడికి ప్రతినిధి సూర్యుడు, వరుణుడికి  శనీశ్వరుడు, కుబేరునికి బుధుడు, యమునికి కుజుడు, ఈశానునికి గురువు (బృహస్పతి), అగ్నికి శుక్రుడు, వాయువునకు కేతువు, నిరుతికి రాహువు ఉపప్రతినిధులు. మనలో చాలామందికివాస్తు వేరు జ్యోతిష్యం వేరు అనే ఒక భిన్నాభిప్రాయముంది. అయితే సరియైన శాస్త్రం తెలిసిన వాస్తు లేదా జ్యోతిర్వేత్తలు నేటి ఈ వాస్తును జ్యోతిర్శాస్త్రంలోని ఒక విడదీయరాని అంతర్భాగంగా మాత్రమే పరిగణిస్తున్నారు. వాస్తవానికి ఇదే నిజం కూడానూ.

ఉదాహరణకు, సైద్ధాంతిక వాస్తు నియమాలను అనుసరించి చూచితే యజమాని నిద్రించే మాష్టర్ బెడ్‌రూం (పడకగది) నైరుతిదిశలో కానీ వాయవ్యంలో కానీ వుండాలి. అదే విధంగా వంటగది (కిచెన్) అనేది ఆగ్నేయంలో వుండాలి. కానీ మీ జాతకంలో అగ్నిని ఉపప్రతినిధిగా చెబుతున్న శుక్రుడు ఈశాన్యరాశి అయిన మీనంలో వున్నాడనుకోండి అప్పుడు మీ పడకగది పై సిద్ధాంతానికి భిన్నంగా ఈశాన్యంలో నిర్మించుకుంటేనే బాగా కలిసివస్తుంది. జాతకచక్రంలోని 12 రాశుల్లో శుక్రుడు ఏ రాశిలో తన పూర్తి బలాన్ని కల్గివున్నాడో ఆ రాశి ప్రాతినిధ్యం లేదా ఆ రాశీనాథుడు ప్రాతినిధ్యం వహించే దిశగా కానీ, లేదా అటువంటి రాశీనాధుడున్న దిక్కునకానీ పడకగది వుంటే బ్రహ్మాండంగా కల్సివస్తుంది.

దిక్కులూ - జాగ్రత్తలు -  ప్రాముఖ్యతలు

తూర్పులో బరువులు వుండకూడదు. అలా వుంటే సంతానం, ఐశ్వర్యాల వంటివి లభించవు. బావులు, బోర్లు ఈ దిశలో వుండరాదు. పడమర దిశలో ఎక్కువ స్థలాన్ని వదలరాదు. ఇది తూర్పు దిశకన్నా కొంచెం ఎత్తుగా వుండేట్టు చూసుకోవాలి. నైరుతీ, వాయవ్యాలకు తగలకుండా బావులు, బోర్లు కనుక నిర్మించుకుంటే సకల శుభాలు కలుగుతాయి. ఉత్తర దిశ, దక్షిణ దిశ కంటే పల్లంగా వుండాలి. ఉత్తరం ఎంత పెరిగితే యజమానికి అంత ధనలాభం కలుగుతుంది. ఉత్తరం వల్ల సంతానం, విద్య, ఆదాయం, పలుకుబడి ఇబ్బడిముబ్బడిగా పెరుగుతాయి.

దక్షిణంలో జాగా ఎంత తగ్గితే అంత మంచిది. అలా లేకుంటే ఇంట్లో వాళ్ళకు ఎప్పుడూ రోగాలుంటాయి, తగ్గవు. వున్న ఆస్తులు అమ్ముకొని దివాళాతీస్తారు. ఈశాన్యం విశాలంగా, పల్లంగా వుండాలి. ఈ దిశలో నీరు వుండకుండా నైరుతీ, పడమర దిశలమీదుగా పారేనీరు ఈశాన్యం ద్వారా వెలుపలికి వెళ్ళడం వల్ల అద్భుతమైన ఫలితాలు కల్గుతాయి. కానీ సంప్రదాయవాదులు ఈ దిశలో బావికానీ, బోరు కానీ వెయ్యమనే చెబుతూ వస్తున్నారు. ఇది సరికాదు. ఆగ్నేయంను పల్లంగా వుంచకూడదు. గోతులూ, సంపులూ వుంచరాదు. అలా చేసినట్లయితే ఇంటిలోని స్త్రీలకు పలురకాల రోగాలతోపాటుగా లైంగిక, వివాహ సంబంధమైన అవరోధాలు ఏర్పడతాయి. ఇక నైరుతి బాగా కురచగా వుండి ఎంత ఎత్తుగా వుంటే అంతమంచిది. ఈ దిశలో ఎంతగా బరువుంటే అంత లాభం కలుగుతుంది.  నైరుతీలో గుంటలు, గోతులూ, బావులు, బోర్లు ఎట్టి పరిస్థితుల్లో వేయకూడదు. అలా వుంటే మొండి రోగాలూ, ఆస్తులు అమ్ముకోవడం జరిగితీరుతుంది.


వీటన్నింటినీ చదివిన తర్వాత మీకేమనిపిస్తోంది? సరే నేనే చెబుతాను. ఈ ఎనిమిది దిశలు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పంచభూతాలను తలపింపజేస్తున్నాయి. అవి అగ్ని (ఫైర్), జలము (వాటర్), వాయువు (ఎయిర్), భూమి లేదా పృథ్వీ (ఎర్త్), ఆకాశము (స్కై). అయితే చైనీయుల వాస్తులో అగ్నికి బదులుగా దారువు (వుడ్ - చెక్క), ఆకాశానికి బదులుగా లోహము (మెటల్) అనేవి వుంటాయి. వాస్తు ఏ దేశానికి చెందినదైనా అందులోని మూల సూత్రాలు పంచభూతాలే. ఎందుకంటే మన (జీవుల) శరీరాలన్నీ కూడా ఈ పంచ భూతాలతోనే నిర్మించబడినవి కావడం వల్ల. చైనీయుల వాస్తులో వాయవ్యాన్ని... మెటల్ (లోహం), ఆగ్నేయదిశను.... దారువు, నైరుతిని.... భూమి (ఎర్త్), దక్షిణాన్ని... అగ్ని (ఫైర్), ఉత్తరాన్ని..... నీరు (వాటర్), ఈశాన్యాన్ని... ఎర్త్ (భూమి), తూర్పును... దారువు (వుడ్), పడమరను... లోహము (మెటల్) అనేవి ప్రభావితం చేస్తాయి.

3, అక్టోబర్ 2014, శుక్రవారం

అమావాస్య - పౌర్ణమి - చంద్రుడు

చాలా మట్టుకు చాలామందికి అపోహలు అనుమానాలు మూడనమ్మకాలు ఉన్నవి.

అమావాస్య - పౌర్ణమి అనగానే చాలా మట్టుకు భయపడుతారు అమావాస్యనా అమ్మో ఆరోజు ఏ పని చేయొద్దు పౌర్నిమనా ఈ రోజు కొన్ని పనులు చేయరాదు అని అమావాస్య నాడు మాంత్రికులు మంత్ర తంత్రాలు నేర్చుకుంటారని భూత ప్రేత పిచచాలు రెచ్చిపోయే రోజని వామాచారములను అనేకము కల్పించి ఏది నిజమో ఏది ఆభద్దమో తేల్చుకోలేక ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నవి. అలాగే జ్యోతిష శాస్త్రములో ప్రతీదానికి చంద్రుడు అవసరమని చంద్రబలం ఆవస్యకమని చంద్రుని ముందు తెచ్చి మిగిలిన గ్రహాలను వెనక్కి నెట్టారు.

నక్షత్రము మనిషిపై ప్రభావము చూపుతాయి అని నక్షత్రములే ముక్యమని తారాబలాన్ని తెచ్చి భాగింపు లెక్కల్ని ఎన్నో చెప్పినారు అవి అనుభవ పూర్వకముగా చూపలేక పాయినవి. ఇలా చాలా ఉన్నవి.

సూర్యుడు తూర్పున ఉదయించి పడమరన అస్తమిస్తాడు. అస్తమించిన మాత్రాన సూర్యుడు లేనట్లా అలాగే చంద్రుడు కూడా అంతే చంద్ర కళలు భూమిపై ప్రసారమవడం లేని రోజులన్నీ చెడ్డరోజులని అనుకోవడం తప్పు.

నేను మీ అందరిని కోరేదేమిటంటే మీకు తెలుసిన సందేహలని నిర్భయంగా ఇక్కడ అడగవచ్చని ఈ చర్చలో ప్రతిసభ్యులు పాల్గొనాలని మంచి మార్గమును వెతకాలని నా కోరిక.


ఇక్కడ ఒకటి గమనించాలి అమావాస్య నాడు చంద్రుడు మనకు కనిపించడు, చంద్ర కాంతులు భూమిపై ప్రసరిన్చవు అంత మాత్రమునే చంద్రుడు లేడనుకోవద్దు. చంద్రుడు సూర్యుని వెనకకి వెళుతాడు  జ్యోతిష గ్రంధకర్తలు ప్రతీవిషయమునకు చంద్ర బలము ఆవశ్యకము అని చంద్రుడిని ముందుకు నెట్టిరి మిగితా గ్రహములను
వెనక్కి నెట్టిరి. దీని వలన జ్యోశ్యము దెబ్బతినుచున్నది, మానవునికి నమ్మకము చెడి ఇది అంత ఉత్తదే అనే వారు తయారవుతున్నారు. గ్రహములలో ఒకరు గొప్ప ఒకరు తక్కువ అనునది ఏమీ లేదు అందరు పూజ్యనీయములే.అమావాస్య నాడు సూర్యుడు, చంద్రుడు ఒకే రాశిలోకి వస్తారు. పౌర్ణిమ నాడు సూర్య,చంద్రులు ఒకరికి ఒకరు ఎదురుగ అంటే సప్తమములలో ఉంటారు. శనిపాలిత లగ్నములకు అమావాస్య దగ్గర పడుతున్నకొద్దీ వీరు బలవంతులు ఎందుకనగా రాత్రి బలము కలవారు ఈ శని పాలిత లగ్నములవారు. గురుపాలిత లగ్నములకు అమావాస్య దగ్గర పడుతున్నకొద్దీ వీరు బలహీనులు అవుతారు వీరు పగటి పూట బలవంతులు.

రాశిలో చంద్రుడు బలవంతుడా కాదా చుచుకోవలె కాని అమావాస్య పౌర్ణిమ కాదు. చంద్రుడు బుద్ధి కారకుడు అంత మాత్రమున వాహనములో ప్రయాణించిన ప్రమాదమని తలంచరాదు. వాహనమునకు కారకుడు శుక్రుడు వీరికి తెలియక వీరి స్తానములను చూడక కేవలము చంద్రుడిని వలన ప్రమాదము రాదు. కొన్ని లగ్నములవారికి చంద్రుడు శుభుడు వీరికి చంద్రుడు శుభమే చేస్తాడు మిగిలిన లగ్నములకు కీడు చేస్తాడు.

లగ్నము చెప్పక వీరు శుభులు వారు పాపులు అని విభజన చేసినారు తప్ప, కేవలం చంద్రుని పైనే ఆధారపదరాడు. లగ్నమును అనుసరించిన శుభ శుభములు పొంద వచ్చు.

శుభ కార్యములకు పౌర్ణిమ మంచిదే అంటున్నారు కాని ఇది శాస్త్రము వోప్పుకోదు. పౌర్ణిమ రోజు సూర్య చంద్రులు సమసప్తకములలో ఉంటారు. కొన్ని లగ్నముల వారికి రవి శుభుడు కొన్ని లగ్నముల వారికి చంద్రుడు శుభుడు
అటువంటప్పుడు పౌర్ణిమ అందరికి మంచిది కాదు అందరికి శుభము కాదు కొందరికే మంచిది.

ఈ బ్లాగును శోధించుRelated Posts Plugin for WordPress, Blogger...