శ్రీ మేధా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం

మీరు జన్మించిన తేది, సమయం, ప్రదేశం ఈ మూడు సమాచారములు మాకు తెలియచేసినచో మీ వ్రుత్తి,వ్యాపార,ఆరోగ్య,ఆర్ధిక పరిస్తితులు, దాంపత్యం, విద్య, ఉద్యోగ, వివాహ, కుటుంబవ్యవహారాలు, సంతానం, రాజకీయ వ్యవహారాలు,ప్రేమ వ్యవహారములు,కుజ దోషం, కాలసర్ప దోషం మరియు వివాహ, ఉపనయన, గృహప్రవేస, జప, హోమ, వ్రత, అన్నప్రసన, నామకరణం లకు ముహూర్తములు పెట్టబడును. P.V.RADHAKRISHNA CELL :+91 7013390324, Mail us :parakrijaya@gmail.com
Get your horoscope by giving Date, time and place of birth. Do you have mobile no. 9966455872 Live chat with WhatsApp Pantula Venkata RadhaKrishna.Get a solution to your horoscope problems

3, జూన్ 2014, మంగళవారం

ప్రశ్న (జ్యోతిష శాస్త్రము)


ప్రశ్న (జ్యోతిష శాస్త్రము)     -    వికీపీడియా   


వికీపీడియా నుండి
జ్యోతిష శాస్త్రము లో "'ప్రశ్న"' ఒక ప్రత్యేకమైన విభాగం. మనసులో తలచుకొన్న ప్రశ్నలకి , సులభంగా, సమాధానాలు చెప్పే శాస్త్రమే ```ప్రశ్న శాస్త్రము. ఆ శాస్త్రంలో ```తీసా యంత్రము చాలా చాలా .ముఖ్యమైనది.

తీసా యంత్రము

ఈ తీసా యంత్రంలో మూడు భాగాలు ఉన్నాయి. మొదటిది తీసా యంత్రము. రెండవది 30 ప్రశ్న చక్రాలు .ఇక చివరిది 30 సమాధాన చక్రాలు .ప్రశ్న చక్రాలు బ్రహ్మ , విష్ణు, మహేష్’, హనుమాన్’, ఇంకా పంచ భూతాలు ,ద్వాదశ రాశులు, నవ గ్రహాలు ఇత్యాది పేర్లతో మొత్తం 30 చక్రాలు ఉన్నాయి.సమాధాన చక్రాలు కూడా అవే పేర్లతో ఒక్కొక్క చక్రంలో 15 సమాధానాలతో నిండి ఉన్నాయి.ఇక నిర్ణాయక యంత్రమైన తీసాలో , నాలుగు నిలువు , నాలుగు అడ్డుగా ఉండే 16 గళ్ళలో అంకెలు మొత్తం కూడితే 30 వచ్చేలాగ ఉంటాయి ! నిజానికి తీసా అంటేనే 30 అని అర్థం ! హిందిలో “తీస్’’ అంటే ముఫ్ఫై అని అందరికీ తెలిసినదే కదా ! అలాగే సంస్కృతంలో “త్రింశ’’ అంటే ముఫ్ఫై అని అర్థం .అందుకే ఈ యంత్రాన్ని తీసా యంత్రము అని అంటారు. ఈ యంత్రం నమూనా చూడండి.
Teesa yantramu model.png

ప్రశ్న చక్రాలు

 • హనుమాన్ (1 ) నా మనో వాంఛ పూర్తి అవుతుందా లేదా ?
 • అగ్ని (2) నాకు ఈ సంవత్సరం ఎలా గడుస్తుంది ?
 • వాయువు (3) ఈ కార్యంలో లాభమా లేక నష్టమా ?
 • జలము (4) నాకు ఈ ప్రదేశంలో లాభం కలుగుతుందా లేక అన్య ప్రదేశంలో కలుగుతుందా ?
 • పృథ్వి (5) ఈ పారిపోయిన వ్యక్తి తిరిగి వచ్చునా లేదా ?
 • ఆకాశము (6) నా నష్ట ద్రవ్యము (పోయిన వస్తువు) దొరుకునా లేదా ?
 • మేషము (7) ఈ వ్యక్తిని నమ్మవచ్చా, కూడదా ?
 • వృషభము (8) ఈ యాత్ర వలన లాభమా లేక నష్టమా ?
 • మిథునము (9) నేను చేయదలచుకున్న పని సఫలమవుతుందా ,లేక విఫలమవుతుందా ?
 • కర్కాటకము(10) ఈ వివాహం చేసుకొంటే లాభమా , లేక నష్టమా ?
 • సింహము (11) ఈ వ్యాపారంలో భాగస్వామ్యం వల్ల ,లాభమా లేక నష్టమా?
 • కన్య (12) ఈ స్త్రీ గర్భంలో శిశువు పురుషుడా లేక స్త్రీ శిశువా?
 • తుల (13) ఇతని రోగము బాగవుతుందా , లేదా?
 • వృశ్చికము (14) ఈ వ్యాజ్యం (కోర్టు కేసు) నుండి ఈ వ్యక్తికి ముక్తి లభిస్తుందా ,లేదా?
 • ధనస్సు (15) ఈ రోజు నాకు ఎలా గడుస్తుంది ?
 • మకరము (16) ఈ వ్యక్తి ప్రేత భాధతో పీడింపబడుతున్నాడా , లేక రోగముతోనా?
 • కుంభము (17) ఈ స్థలము కొంటే లాభమా , నష్టమా?
 • మీనము (18) ఈ వైద్యునితో రోగము నయమగునా , లేదా?
 • సూర్యుడు (19) నా నివాస గృహంలో ఏవైనా దోషాలు కలవా?
 • చంద్రుడు (20) ఈ కేసు గెలుస్తానా లేదా ?
 • కుజుడు (21) ఈ వార్త నిజమగునా , కాదా?
 • బుధుడు (22) ప్రస్తుత కష్టము నుండి నాకు విముక్తి కలదా, లేక లేదా?
 • గురుడు (23) ఈ ఉద్యోగము వలన నాకు లాభమా, నష్టమా?
 • శుక్రుడు (24) ఈ పోటీ పరీక్షలలో నాకు విజయం లభిస్తుందా , లేదా?
 • శని (25) ఈ వస్తువు నాకు అచ్చుబాటు అవుతుందా,లేదా ?
 • రాహువు (26) ఈ తప్పిపోయిన పశువు ఏ దిక్కుగా వెళ్లింది?
 • కేతువు (27) ఈ వ్యక్తి జీవించి ఉన్నాడా, లేక మరణించాడా?
 • బ్రహ్మ (28) నాకు అప్పు దొరుకుతుందా, లేదా?
 • విష్ణువు (29) ఈ సంవత్సరంలో నాకు ప్రమోషన్’ దొరుకునా, లేదా?
 • మహేశ్వరుడు(30) నాకు సమీప భవిష్యత్తులో బదిలీ అవకాశం కలదా, లేదా?
ఇవే 30 ప్రశ్న చక్రాలు. వీటిలోని ఏదైనా ప్రశ్నని అడగదలచుకొంటే , ఆ ప్రశ్న సంఖ్యని ఒక చోట వ్రాసి ఉంచుకోవాలి. తరువాత తీసా యంత్రం లోని ఏదైనా ఒక సంఖ్యని తలచుకొని , రెండు సంఖ్యలని కలిపి వచ్చిన సంఖ్య 30 దాటకుండా ఉంటే దానిని అలాగే స్వీకరించి నేరుగా సమాధాన చక్రాల నుండి ,సమాధానం చూసుకోవాలి.ఒక వేళ రెండు సంఖ్యల మొత్తం 30 దాటితే ఆ సంఖ్య నుండి 30 తీసేసి మిగిలిన శేషాన్ని బట్టి , సమాధాన చక్రాల నుండి జవాబు తెలుసుకోవాలి. ఇంతేనండి ! ఈ తీసా యంత్రం చూసే పద్ధతి ! చెప్పే సమాధానాలు నిజమవుతాయంటే నమ్మండి ! ఇక సమాధాన చక్రాల లోని జవాబులు తెలుసుకొందాం.

సమాధాన చక్రాలు

 • అగ్ని చక్ర ఫలాలు.:
(1) మీరు అదృష్టవంతులు.మీ కోరిక నెరవేరుతుంది. (2) మీ బదిలీ సమీప భవిష్యత్తులో జరిగే అవకాశం లేదు. (3) ప్రమోషన్ దొరుకుతుంది, కాని సూర్యుని ఆరాధన చేయాలి. (4) ఉద్యోగ, వ్యాపారాలు చేయండి .అప్పు దొరుకుతుంది. (5) జీవించి ఉండడం సందేహంగానే ఉంది. (6) పశువు దక్షిణ దిశగా వెళ్లింది. దొరికే అవకాశం లేదు. (7) దీనిని కొంటే నష్టం కలుగుతుంది. (8) జయం కలుగుతుంది. కాని కుజుని ఆరాధన చేయండి. (9) ఈ ఉద్యోగం వల్ల లాభం కలుగుతుంది. (10) ఈ కష్టం నుండి శీఘ్రంగానే నివారణ కలుగుతుంది. శివుని ఆరాధన చేయండి. (11) ఈ వార్త జరిగినది నిజమే . (12) కేసు గెలవడం సందేహంగా ఉంది, కేతువుని ఆరాధన చేయండి, మంచి జరగ వచ్చు. (13) ఈ ఇల్లు అశుభం . (14) ఈ వైద్యునితో జబ్బు నయమవుతుంది . (15) అవును, లాభదాయకమే.
 • వాయు చక్ర ఫలితములు :
(1) ఈ సంవత్సరం సంతోష జనకంగా ఉంటుంది. (2) మీ కోరిక నెరవేరుతుంది . (3) అవును, బదిలీ జరిగే యోగం గోచరిస్తోంది . (4) ప్రస్తుతం ప్రమోషన్’ లభించే అవకాశం తక్కువగా ఉంది. (5) ఉద్యోగ వ్యాపారాలు చేయాలనుకొంటే అప్పు దొరుకుతుంది. (6) జీవించి ఉండడం అనుమానాస్పదంగా ఉంది. (7) పశువు దక్షిణ దిశగా వెళ్లింది. దొరికే అవకాశం తక్కువ. (8) కొనవద్దు, నష్టం కలగ గలదు. (9) సఫలత పొందగలరు. (10) ఉద్యోగం చేస్తే లాభిస్తుంది. (11) ఈ కష్టం నుండి ఆలస్యంగా నివారణ కలుగుతుంది. (12) ఈ వార్త అబద్ధం. (13) కేసు గెలవడం సందేహం. రాజీ చేసుకోండి . (14)ఈ ఇల్లు అచ్చుబాటు అవుతుంది. (15) ఈ వైద్యుని వల్ల రోగ నివారణ ఆలస్యంగా అవుతుంది.
 • జల చక్ర ఫలితములు :
(1) ఈ కార్యము వల్ల లాభం ఉంది. గురు ధ్యానం చేయండి. (2) ఈ సంవత్సరం కష్టదాయకంగా ఉంటుంది. కుజునికి శాంతి జరిపించండి. (3) మీ వాంఛ తీరే అవకాశం తక్కువగా ఉంది. (4) మీ సమీప భవిష్యత్తులో బదిలీ అయే అవకాశం లేదు. (5) అవును, ప్రమోషన్ ఆశించవచ్చు . (6) సమయం బాగు లేదు అప్పు దొరకదు. (7) జీవించి ఉండే అవకాశం తక్కువ. (8) పశువు ఉత్తర-పశ్చిమ దిశగా వెళ్లింది. దొరికే అవకాశం తక్కువ. (9) కొనండి, లాభం ఉంది. (10) అవును, సఫలత కలదు. (11) ఉద్యోగం చేస్తే లాభం కలుగుతుంది . (12) ఆలస్యంగా విపత్తు నుండి విరామం దొరుకుతుంది. (13) ఈ వార్త అబద్ధం . (14) కేసు గెలుస్తుంది. (15) ఈ ఇల్లు నిర్దోషంగా ఉంది. శుభం కలుగుతుంది.
 • ప్రుథ్వీ చక్ర ఫలితములు:
(1) అన్య ప్రదేశానికి వెళ్తే లాభం కలుగుతుంది. (2) ఈ కార్యంలో లాభం కలుగుతుంది. (3) మీకు ఈ సంవత్సరం సామాన్య శుభం. (4) కొంత పూర్తి అవుతుంది,కాని మరికొంత మిగిలి పోతుంది. (5) ఉద్యోగంలో త్వరలోనే బదిలీ అవుతుంది. (6) ప్రమోషన్’ ఆశించ వద్దు. (7) అప్పు దొరకదు. (8) జీవించి లేడు . ఆ పైన దేవుని దయ. (9) పశువు ఉత్తర దిశగా వెళ్లింది. వెతికితే దొరుకుతుంది. (10) కొనవద్దు, హాని జరుగును . (11) అవును, సఫలత కలుగుతుంది. (12) ఈ ఉద్యోగ విషయంలో నమ్మకం లేదు. (13) ఈ దినము బాగాలేదు, అశాంతి తొలగదు. (14) ఈ వార్త జరిగినది నిజమే. (15) దేవుని దయవల్ల జయం కలుగుతుంది.
 • ఆకాశ చక్ర ఫలితములు:
(1) పారిపోయిన వ్యక్తి దూరమవుతూ ఉన్నాడు. తిరిగి వచ్చుట కష్టము . (2) ఈ స్థలములో లాభం కలదు. సంతోషించు. (3) ఈ పనిలో హాని కలుగును. (4) ఈ సంవత్సరం మీకు శుభ ఫలితాలు ఇస్తుంది. (5) మీ కోరిక ఆలస్యంగా నెరవేరుతుంది . (6) అవును, మీకు బదిలీ శీఘ్రంగా అవుతుంది. (7) ప్రస్తుతం ప్రమోషన్’ గురించి ఆశించవద్దు. (8) అప్పు దుర్లభం . (9) అతను జీవించే ఉన్నాడు. (10) పశువు తూర్పు దిశగా వెళ్లింది, త్వరపడితే దొరుకుతుంది . (11) లాభం కలుగును, కొనవచ్చు. (12) సఫలత పొందే అవకాశం తక్కువ. (13) ఈ ఉద్యోగం వలన హాని ఎక్కువ , నీ అంతట నీవే వదలి వేస్తావు . (14) ఈ కష్టము నుండి విముక్తి ఆలస్యంగా లభిస్తుంది. (15) ఈ వార్త నిజమేనని అనిపిస్తోంది.
 • మేష చక్ర ఫలితములు:
(1) ఈ వస్తువు దొరుకుట సందేహము. (2) పారిపోయిన వ్యక్తి శీఘ్రముగా వచ్చును. (3) అన్య ప్రదేశమునకు వెళ్ళినచో లాభము కలుగును. (4) ఈ పనిలో లాభ నష్టములు మధ్యమముగా ఉన్నవి. (5) ఈ సంవత్సరము మీకు కష్ట దాయకము. రాహువునకు శాంతి చేయండి. (6) మీ కోరిక పూర్తికాదు (7) బదిలీ యోగము కలదు. (8) ప్రస్తుతము ప్రమోషన్’ లభించే అవకాశం లేదు. (9) ఒక మిత్రుని ద్వారా అప్పు లభిస్తుంది. (10) అతను జీవించే ఉన్నాడు. (11) పశువు ఉత్తర దిశగా వెళ్లింది, దొరికే అవకాశం ఉంది. (12) కొనవద్దు, హాని కలుగును. (13) సఫలత కష్టదాయకము . (14) ఈ ఉద్యోగం వలన లాభదాయకమే . (15) కష్టము నుండి విముక్తి ఆలస్యము.
 • వృషభ చక్ర ఫలితములు:
(1) అవును యితడు నమ్మకస్తుడే. (2) పోయిన వస్తువు తిరిగి దొరుకుతుంది. (3) పారిపోయిన వ్యక్తి తిరిగి వచ్చేందుకు ఆలస్యం అనివార్యం. (4) మీకు ఈ స్థలం లోనే లాభము కలదు. (5) ఈ పనిలో లాభము మధ్యమము. (6) ఈ సంవత్సరం మీకు మిశ్రమ ఫలితములు:ఇస్తుంది.బుధుని పూజించండి. (7) మీ కోరిక పూర్తి అయే అవకాశం లేదు. (8) బదిలీ శీఘ్రంగా అవుతుంది. (9) ప్రమోషన్ అయే యోగము గోచరిస్తున్నది. (10) అప్పు దొరుకుతుంది. (11) అతను జీవించి ఉన్నాడు. (12) పశువు పూర్వోత్తర దిశగా వెళ్లింది.దొరకుట దుర్లభము. (13) కొనవద్దు, హాని కలదు. (14) పరిశ్రమ ద్వారా సఫలత కలుగుతుంది. (15) ఈ ఉద్యోగం ద్వారా లాభం కలదు.
 • మిథున చక్ర ఫలితములు:
(1) అవును, ఈ యాత్ర వలన లాభము కలదు. (2) ఇతను విశ్వాస పాత్రుడు (3) ఈ వస్తువు దొరకుట కఠినం . (4) పారిపోయిన వ్యక్తి తిరిగి వచ్చును, నమ్మకం ఉంచండి. (5) అన్య ప్రదేశమునకు వెళ్ళినచో లాభము కలదు. (6) ఈ పనిలో హాని కలదు. (7) ఈ సంవత్సరం ప్రత్యేక దిశలోనూ విపరీతముగా ఉన్నది. కేతుగ్రహ శాంతి చేయండి. (8) ప్రస్తుతము మీ కోరిక నెరవేరదు. (9) బదిలీ యోగము కలదు, దేవుని పూజించండి. (10) అవును, ప్రమోషన్’ యోగము కలదు. (11) అప్పు దొరికే అవకాశము లేదు. (12) అతను జీవించి ఉండుట సందేహాస్పదంగా ఉంది. (13) పశువు ఉత్తర దిశగా వెళ్లింది. దొరుకుట దుర్లభము. (14) కొనవచ్చు, లాభము కలుగును. (15) అత్యంత పరిశ్రమ చేత సఫలత కలుగుతుంది.
 • కర్కాటక చక్ర ఫలితములు:
(1) సఫలత ప్రాప్తిస్తుంది. (2) ఈ యాత్ర వలన లాభాంశము తక్కువ. (3) ఇతను విశ్వాసపాత్రుడైనవాడు కాడు . (4) ఈ వస్తువు దొరుకుట కష్టము. (5) పారిపోయిన వ్యక్తి తిరిగి వచ్చుట ఆలస్యము. (6) అన్య ప్రాంతమునకు పోయిన యెడల లాభము కలదు. (7) ఈ పనిలో హాని ఉన్నది. (8) ఈ సంవత్సరము విశేష హానికరముగా ఉన్నది. శని పూజ చేయండి. (9) ఒక మిత్త్రుని సహాయము వలన మీ కోరిక నెరవేరుతుంది. (10) బదిలీ జరుగును కాని ఆలస్యము. (11) అవును, ప్రమోషన్’ ఈ సంవత్సరము ఉన్నది. (12) అప్పు దొరికే అవకాశము లేదు. (13) ఇతను జీవించి ఉండుట సందేహముగా ఉన్నది . (14) పశువు పశ్చిమ దిశగా వెళ్ళినది. వెతికినచో దొరుకును. (15) కొనవచ్చు, లాభము కలదు.
 • సింహ చక్ర ఫలితములు:
(1) అవును, ఈ వివాహము లాభదాయకమే . (2) సఫలత కలుగును. (3) వెళ్ళవద్దు. హాని కలుగును. (4) ఇతను విశ్వాసపాత్రుడైన వాడే. (5) పోయిన వస్తువు దొరుకును. (6) పారిపోయిన వ్యక్తి తిరిగి రాడు (7) ఈ స్థలము వదలవద్దు, ఆలస్యముగానైనా లాభము కలుగుతుంది. (8) ఈ పనిలో హాని కలుగనున్నది. (9) ఈ సంవత్సరము మీకు దుఃఖ దాయకము. శనిని పూజించండి. (10) మీ కోరిక పూర్తి అవుతుంది. (11) ప్రస్తుతము బదిలీ అవకాశములు తక్కువ. (12) ప్రమోషన్’ ఈ సంవత్సరము దొరకదు. (13) సమయము బాగు లేదు, అప్పు దొరకదు. (14) ఇతను జీవించే ఉన్నాడు. (15) పశువు పశ్చిమ దిశగా వెళ్లింది. శీఘ్రంగా దొరుకుతుంది
 • కన్యా చక్ర ఫలితములు:
(1) భాగస్వామ్యంలో లాభం కలదు. (2) ఈ వివాహము మీకు హితకరము. (3) సఫలత సందేహాస్పదంగా ఉంది, రాహువు పూజ చేయండి. (4) ఈ యాత్ర వలన లాభము లేదు. (5) ఇతను నమ్మకమైన వాడు. (6) పోయిన వస్తువు దొరకదు. (7) పారిపోయిన వ్యక్తి ఇప్పట్లో రాదు. (8) అన్య ప్రాంతమునకు పొతే లాభము కలదు. (9) అవును, దిని వల్ల లాభము కలుగును. (10) ఈ సంవత్సరము మీకు లాభదాయకము. (11) మీ కోరిక నెరవేరుతుంది. (12) బదిలీ శీఘ్రముగా జరుగును. తూర్పు దిశగా కావచ్చును. (13) ప్రమోషన్’ దొరికే అవకాశము తక్కువ. (14) ఒక మిత్రుని సహాయముతో అప్పు దొరుకును. (15) ఇతను జీవించి ఉన్నాడు.
 • తులా చక్ర ఫలితములు:
(1) పుత్రుడు జన్మిస్తాడు. (2) భాగస్వామ్యం వలన లాభము కలదు. (3) ఈ వివాహము వలన మీకు లాభము కలుగదు. (4) ప్రయత్న పూర్వక సఫలత కలుగనున్నది. (5) ఈ యాత్ర వలన లాభము కలదు. (6) ప్రతీ వ్యక్తి పైన విశ్వాసము పెంచుకోవద్దు . (7) పోయిన వస్తువు దొరకదు. (8) పారిపోయిన వ్యక్తి వచ్చును, నిరీక్షించి ఉండండి. (9) మీకు ఈ ప్రాంతము లోనే లాభము ఉన్నది. (10) లాభము కలదు. (11) ఈ సంవత్సరము మీకు అత్యుత్తమము, సంతోష జనకముగా ఉన్నది. (12) ఈ యీ కోరిక పూర్తి కానున్నది. (13) బదిలీ సమీప భవిష్యత్తులో కలదు. (14) పమోషన్ ‘ శీఘ్రంగా కలుగును. (15) ఒక మిత్రుని సహాయము ద్వారా అప్పు దొరుకును.
 • వృశ్చిక చక్ర ఫలితములు
(1)అవును ఇతను రోగము నుండి విముక్తుడు అవుతాడు. (2)పుత్ర రత్నము కలుగ గలదు. (3)భాగస్వామ్యం వలన హాని కలిగే భయము కలదు. (4) మీకు ఈ వివాహము హితకరము (5) వెళ్లి ప్రయత్నమూ చేయండి, సఫలత కలుగుతుంది. (6) యాత్ర చెయ్యవద్దు. హాని కలుగును. (7) ఈ వ్యక్తిని నమ్మవద్దు. (8) పోయిన వస్తువు దొరికే ఆశ తక్కువ. (9) పారిపోయిన వ్యక్తి తిరిగి వచ్చుటకు ఆలస్యము కలదు. (10) ఈ స్థలము లోనే లాభము కలదు. (11) ఈ పనిలో లాభము కలదు. (12) మీకు ఈ సంవత్సరములో భాగ్యోదయము కలదు. (13) మీ కోరిక నెరవేరదు. (14) ప్రస్తుతము బదిలీ అవదు. (15) ప్రమోషన్’ యోగము రానున్నది.
 • ధనుష్’ చక్ర ఫలితములు:
(1) పాపము నుండి విముక్తి కలుగును. (2) పథ్యము పాటించక పొతే రోగము తిరుగ బెడుతుంది. (3) ఈ గర్భములో పుత్ర రత్నము జన్మించును . (4) భాగస్వామ్యంలో లాభము తక్కువ. (5) అవును, వివాహము హితకరము. (6) సఫలత సందిగ్ధముగా ఉన్నది.శని పూజ చేయండి. (7) ఈ యాత్ర వలన హాని కలుగును. (8) ఈ వ్యక్తి విస్వశనీయత సందేహించ వలసినదిగా ఉన్నది. (9) పోయిన వస్తువు సురక్షితముగా ఉన్నది. ప్రయత్నము చేయుము, దొరుకును. (10) పారిపోయిన వ్యక్తి ఆలస్యముగా వచ్చును. (11) ఈ స్థానము లోనే లాభము కలదు. (12) అవును, ఈ పనిలో హాని కలదు. (13) మీకు ఈ సంవత్సరము అనేక ప్రకారమైన కష్టములు కలుగ గలవు. (14) మీ కోరిక పూర్తి అవుతుంది. (15) బదిలీ గురించి ఆశించకండి. దుర్గా ఆరాధన చేస్తే ఫలితం కలగవచ్చు.
 • మకర చక్ర ఫలితములు:
(1) ఒక సత్పురుషుని దర్శనం వలన మీకు కూడా లాభం కలుగుతుంది. (2) ఈ ఆరోపణ నుండి ఆలస్యముగా విముక్తి కలుగుతుంది. (3) అవును, రోగికి నయమవుతుంది. రాహువుకి శాంతి చేయండి. (4) ఈ గర్భస్థ శిశువు కన్యారత్నము అగును. (5) లాభము కలుగును, కాని కొన్ని నెలల సమయము పట్టవచ్చును. (6) ఈ వివాహము మీకు లాభదాయకమే . (7) సఫలత సందేహముగా ఉన్నది, శనికి శాంతి చేయండి. (8) ఈ యాత్రలో హాని జరుగును. (9) అవును, ఇతను నమ్మకస్తుడే. (10) పోయిన వస్తువు దొరకదు. (11) పారిపోయిన వ్యక్తి త్వరలోనే వచ్చును. (12) మీరు అన్య ప్రాంతంలో ప్రయత్నిస్తే లాభము కలుగును. (13) ఈ పనిలో హాని కలుగును. (14) ఈ సంవత్సరము మీకు లాభదాయకమే . (15) ఒక మిత్రుని సహాయము వలన మీ కోరిక నెరవేరును.
 • కుంభ చక్ర ఫలితములు:
(1) శారీరిక వ్యాధి మాత్రమే . (2) ఈ దినము నానా ప్రకార చింతలు, చికాకులతో గడచును. (3) రాహువునకు శాంతి చేయండి, విముక్తి కలుగుతుంది. (4) పుత్రుడు పుట్టును. (5) ఈ రోగిని బ్రహ్మ బాధ పీడిస్తోంది , తంత్రము ద్వారా చికిత్స చేయించండి. (6) లాభము కన్నా నష్టమే ఎక్కువ. (7) ఈ వివాహము హానికరముగా ఉన్నది. (8) సఫలత కఠినం , కుజునికి శాంతి చేయండి. (9) ఈ యాత్ర లాభదాయకం. (10) ఈ ప్రాణి విశ్వాసపాత్రుడే. (11) పోయిన వస్తువు లభించ గలదు. (12) పారిపోయిన వ్యక్తి దూరంగా పోవుచున్నాడు, ఆలస్యముగా తిరిగి చేరును. (13) మీకు అన్య ప్రాంతమునందు లాభము కలుగును. (14) ఈ కార్యములో విజయము కలుగును . (15) ఈ సంవత్సరము మీకు విశేష లాభదాయకము.
 • మీన చక్ర ఫలితములు:
(1) కొనవచ్చును, లాభము కలుగును. (2) గుప్త రోగముతో పీడింప బడుతున్నాడు . (3) ఈ దినము చింత వ్యథలతో గడచును. (4) విముక్తి కలగుట కష్టము, బుధునికి శాంతి చేయండి. (5) మందులు ఇస్తూనే ఉండండి.రోగము నిమ్మలిస్తుంది శుక్రుని పూజ చేయండి. (6) పుత్రిక పుట్టును. (7) లాభము కలుగ వచ్చును. కాని శనికి శాంతి చేయండి. (8) ఈ వివాహము మీకు హితకరము . (9) సఫలతను పరిశ్రమతో సాధించండి . (10) లాభము కలుగును ,యాత్ర సాగించండి. (11) ఈ ప్రాణి విశ్వాసపాత్రుడే. (12) పోయిన వస్తువు దొరకుట కఠినం. (13) పారిపోయిన వ్యక్తి దూరమవుతూ ఉన్నాడు. తిరిగి వచ్చుట ఆలస్యమగును. (14) ఈ స్థానమునందే లాభము కలుగును. (15) ఈ పనిలో లాభము మధ్యమము .
 • సూర్య చక్ర ఫలితములు:
(1) కార్య సిద్ది ,కలుగును .కాని ఆలస్యం కాగలదు. (2) కొనండి, లాభము కలుగును. (3) ప్రేత బాధ కలదు. (4) సత్సంగము వలన లాభము కలుగును. (5) విముక్తి కలుగును.శుక్రునికి శాంతి చేయండి. (6) పథ్యము పాటించక పోతే , రోగము పెరుగును. (7) పుత్రిక పుట్టును. (8) లాభ ప్రాప్తికి కుజుని బాధ కలదు,శాంతి చేయండి. (9) ఈ వివాహము హితకరము . (10) సఫలత నిశ్చయం . (11) యాత్ర చేయవద్దు, హాని కలుగును. (12) ఈ ప్రాణి విశ్వాసపాత్రుడు కాడు . (13) పోయిన వస్తువు ఒక స్త్రీ తీసినది, దొరకుట కష్టము. (14) పారిపోయిన వ్యక్తి, ఆలస్యముగా ఇంటికి చేరును. (15) ఈ స్థలము నందే లాభము కలుగును, కొంత కాలము సంతోషముగా గడపండి.
 • చంద్ర చక్ర ఫలితములు:
(1) మహా దోష రహితముగా ఉన్నది. (2) కార్యము యథా సంభవముగా జరుగుతుంది. (3) హాని కలుగును. (4) చేతబడి జరిగినది. (5) ఈ దినము సుఖముగా నడుచును. (6) విముక్తి కష్టము, శనికి పూజ చేయండి. (7) రోగము అసాధ్యమని తోచుచున్నది, శనికి శాంతి చేయండి. (8) పుత్రుడు పుట్టును, కాని మొండి పట్టుదల కలవాడు అగును. శనికి శాంతి చేయించండి. (9) భాగస్వామ్యం లాభదాయకమే . (10) ఈ వివాహము హితకరము . (11) సఫలత కలిగే అవకాశము కలదు. (12) హాని కలుగును, ప్రయాణము చేయవద్దు. (13) ఈ ప్రాణి విశ్వాసపాత్రుడు కాడు నమ్మవద్దు. (14) పోయిన వస్తువు దొరుకును ప్రయత్నము చేయుము. (15) పారిపోయిన వ్యక్తి ఆలస్యముగా చేరును.
 • కుజ చక్ర ఫలితములు:
(1) విజయము కలుగుతుంది. కాని గురునికి దాన జపములు చేయండి. (2) ఇంటిలో ఎటువంటి దోషములు లేవు. (3) కార్య సిద్ది కలుగుట యందు సందేహము కలదు. (4) కొనండి, లాభము కలదు. (5) గ్రహ బాధ కలదు. కుజునికి శాంతి చేయండి. (6) ఈ దినము చింతాముక్తి కలుగును. (7) విముక్తి కఠినం , శనికి శాంతి చేయండి. (8) రోగి అవపథ్యము వలన రోగము పెరిగినది. కుజునికి శాంతి చేయండి. (9) పుత్రిక పుట్టును. (10) లాభము కలుగును, భాగస్వామ్యం చేయండి. (11) ఈ వివాహము హితకరము . (12) సఫలత కలుగుట యందు అడ్డంకులు కలవు, కేతువు పూజ చేయండి. (13) యాత్ర వలన హాని కలుగును. (14) ఈ ప్రాణి విశ్వాసపాత్రుడే. 15) పారిపోయిన వ్యక్తి తిరిగి రాదు, వెతకుట వ్యర్థము.
 • బుధ చక్ర ఫలితములు:
(1) ఈ వార్త నిజమే. (2) కేసు గెలువ గలవు (3) ఈ ఇంటికి చోర భయము ఉన్నది.రాహువు పూజ చేయుము. (4) కార్య సిద్ది కలుగుట యందు సందేహములు కలవు. (5) లాభదాయకంగా ఉంటుంది. (6) ఎవరో చేతబడి చేయించారు. (7) ఈ దినము చింత , వ్యథలతో గడచును. (8) విముక్తి కఠినం . కుజునికి శాంతి చేయండి. (9) రోగము నుండి ముక్తి కష్టము. చంద్రునికి పూజ చేయించండి. (10) పుత్రుడు పుట్టును. (11) పరదేశము నందు భాగస్వామ్యం చెయ్యండి.లాభము కలుగును. (12) ఈ వివాహము వలన హాని కలుగును. (13) సఫలత చాలా కష్టము. కుజుని పూజ చేయండి. (14) యాత్ర వలన లాభము కలుగును. (15) ఈ ప్రాణి విశ్వాసపాత్రుడే.
 • గురు చక్ర ఫలితములు:
(1) ఈశ్వరుని అనుగ్రహం వలన మీకు ఈ కష్టము నుండి విముక్తి కలుగును. (2) ఈ వార్తలో నిజమున్నది. (3) రాహువునకు పూజ చేయించండి, అప్పుడే విజయము సిధ్ధించ గలదు. (4) ఈ ఇంటిలో ప్రేత బాధ కలదు, పాతిపెట్టిన ఎముకలు కూడా ఉన్నాయి. (5) చాల ప్రయత్నము ,పొగడతలు,ప్రశంసలు వలన కార్య సిద్ది కలుగును. (6) కొనవద్దు, హాని కలుగును. (7) శారీరిక వ్యాధి కలదు, భయము పెరిగే అవకాశములు ఎక్కువ. (8) చింతించ వలసిన విషయమే. (9) ఆలస్యముగా విముక్తి కలుగ గలదు. చంద్రునికి పూజ చేయండి. (10) అవును ఇతను రోగముక్తుడు కాగలడు. (11) పుత్రిక పుట్టును. (12) స్వప్నమునండు కూడా భాగస్వామ్యం గురించి ఆలోచించ వద్దు. (13) ఈ వివాహము మంచిది కాదు. (14) ప్రయత్న పూర్వక కార్య సిద్ది కలదు. (15) ఈ యాత్ర వలన సామాన్య లాభము కలదు.
 • శుక్ర చక్ర ఫలితములు:
(1) ఈ ఉద్యోగము వలన లాభము కలదు. (2) అతి కష్టము మీద త్వరలోనే విముక్తి కలుగ గలదు. (3) ఈ వార్త అసత్యము. (4) బుదునికి శాంతి చేయుట వలన విజయము కలుగును. (5) ఈ ఇల్లు నిర్దోషముగా ఉన్నది. (6) కార్య సిద్ది కలుగుట యందు శని బాధ ఉన్నది. శాంతి చేయుము. (7) హానికరము కాగలదు , కొనవద్దు. (8) బ్రహ్మ దోషము కలదు. (9) ఈ దినము సుఖ శాంతులతో గడచును. (10) అతను, విముక్తుడు కాగలడు, సూర్య శాంతి చేయుము. (11) పథ్యము చేయక పోవుట వలన రోగము పెరుగును, విశ్రాంతి దొరకదు. (12) పుత్రుడు పుట్టును, కాని కేతువునకు పూజ చేయుము. (13) భాగస్వామ్యం వలన లాభము కలిగే ఆశ లేదు. (14) ఈ వివాహము హితకరము . (15) సఫలత పొందే ఆశ కలదు.
 • శని చక్ర ఫలితములు :
(1) సఫలతా ప్రాప్తి కలదు. (2) ఈ ఉద్యోగము వలన లాభము కలదు. (3) సమయము బాగులేదు, రాహువునకు శాంతి చేయుము. (4) ఈ వార్తలో కొంత నిజము కలదు. (5) విజయము కలుగును. (6) ఇల్లు అశుభము, శని పూజ చేయండి. (7) వైద్యుడు కోపముతో ఉన్నాడు, రోగ ముక్తి కష్టము. (8) కొనవద్దు, హాని కలుగును. (9) భూత బాధ కలదు. అతి కష్టము.చేత సాధ్యము కాగలదు . (10) ఈ దినము లాభదాయకంగా జరుగును. (11) కేతువునకు శాంతి చేసినచో విముక్తి కలుగును. (12) ఆలస్యముగా మంచి జరుగును. (13) పుత్రుడు పుట్టును, కాని ప్రసవము కష్టము కాగలదు . (14) లాభము కలదు. భాగస్వామ్యం చేయుము. (15) ఈ వివాహము శుభ ఫలితములు ఇవ్వ గలదు.
 • రాహు చక్ర ఫలితములు:
(1) ఈ వస్తువును కొనుము, లాభము కలుగును. (2) సఫలత పొందే సంభవము కలదు. (3) ఈ ఉద్యోగమును నమ్ముకోవద్దు, హాని కలుగ గలదు. (4) ప్రస్తుతము కష్టము నుండి విముక్తి కలుగదు . (5) ఈ వార్త యందు నిజము కలదు. (6) కేసు బలహీనము, శనికి శాంతి చేయుము. (7) ఈ ఇల్లు సంతాన పక్షములో బాధాకరముగా ఉన్నది. (8) వైద్యుని వల్ల మీకు అనుకూలత కలగదు. (9) కొనండి, లాభము కలదు. (10) శారీరిక దోషము ఉన్నది. విశేష ఉపచారము వలన మంచి కలుగును. (11) ఈ దినము సుఖ శాంతులతో గడుచును. (12) విముక్తి కలుగును, కాని కేతువునకు పూజ చేయండి. (13) రోగముక్తి కష్టము, కుజునికి శాంతి చేయండి. (14) పుత్రుడు పుట్టును,భాగ్యశాలి కాగలడు (15) భాగస్వామ్యం వలన లాభము పొందే అవకాశములు ఎక్కువ.
 • కేతు చక్ర ఫలితములు:
(1) పశువు దొరుకును, తూర్పు దిశగా వెళ్లినది . (2) కొనండి, లాభము కలదు. (3) సఫలత కలుగుట యందు సందేహము ఉన్నది. రాహువునకు పూజ చేయండి. (4) నౌకరీ యందు ఆదాయ వ్యయములు సరి సమానము. (5) అవును, శీఘ్రముగా విముక్తి కలుగును. (6) ఈ వార్త అసత్యము. (7) సమయము బాగు లేదు. రాజీ చేసుకొండి , శనిని పూజించండి. (8) ఈ ఇల్లు ఋణ కారకము . (9) ఈ వైద్యునితో కార్యము కాగలడు. (10) కొనండి, లాభదాయకమే . (11) శారీరిక దోషము , నిదానముగా కుదురును. (12) ఈ దినము చింత, వ్యథలతో గడుచును. (13) విముక్తి కష్టము, కుజుని పూజించండి. (14) అవును, రోగికి త్వరలోనే నయమగును. (15) పుత్రుడు పుట్టును, కాని బుధునికి శాంతి చేయండి.
 • బ్రహ్మ చక్ర ఫలితములు:
(1) అవును , ఆ ప్రాణి లేక అతను జీవించే ఉన్నది. (2) పశువు దక్షిణ దిశగా వెళ్లినది. దొరుకుతుంది. (3) ఈ వస్తువు కొంటే హాని కలుగుతుంది. (4) సఫలత పొందగలరు. శనికి శాంతి చేయండి. (5) అవును, నౌకరీ వలన లాభం కలుగుతుంది. (6) సమయం బాగు లేదు, శనికి శాంతి చేయండి. (7) ఈ వార్త అబద్ధము. (8) కేసు దుర్బలము, కుజునికి శాంతి చేయండి. (9) ఇల్లు సమాన్య శుభము. (10) అధికారి వలన కార్యము సిధ్ధించ కలదు. (11) కొనండి, లాభదాయకంగా ఉంటుంది. (12) ప్రేత బాధ ఉన్నది, రావి చెట్టుకి పూజ చేయండి. (13) చింత, వ్యథలు కలవు, రావి చెట్టుకి పూజ చేయండి. (14) అవును, ఈ ఆరోపణ నుండి విముక్తి పొందుట కష్టముగా ఉన్నది. (15) నిదానముగా రోగము నయమగును.
 • విష్ణు చక్ర ఫలితములు:
(1) ఒక మిత్రుని సహాయము వలన అప్పు పొందగలవు. (2) జీవించి ఉన్నది. (3) పశువు తూర్పు దిశగా వెళ్లింది. దొరికే అవకాశం తక్కువ. (4) లాభం కలుగుతుంది, కొనండి. (5) ప్రతియోగిత పరీక్షలో సఫలత కలుగుతుంది. (6) ఈ ఉద్యోగమునకు స్థిరత్వము లేదు. (7) సమయం బాగు లేదు, విముక్తి ఆలస్యము అగును. (8) ఈ వార్త అబద్ధము. (9) కేసు గెలువగలవు. (10) ఇల్లు శుభము సంశయము లేదు. (11) వైద్యుని ద్వారా రోగము కుదురును. (12) కొనవద్దు, హాని కలుగుతుంది. (13) శారీరిక దోషము, పార్థివ లింగ పూజ చేయండి. (14) ఈ దినము సుఖ,శాంతులతో గడవగలదు. (15) అవును, కొన్ని దినములలో విముక్తి కలుగును.
 • మహేష్’ చక్ర ఫలితములు:
(1) ఈ సంవత్సరము ప్రమోషన్’ యోగము కలదు. (2) స్వయముగా అప్పు సాధించ లేవు. (3) జీవించి ఉండుట సందేహము. (4) పశువు దొరుకుట దుర్లభము, దక్షిణ దిశగా వెళ్లినది. (5) కొనండి. లాభము కలదు. (6) సఫలత పట్ల సందేహము కలదు, శనికి శాంతి చేయండి. (7) నౌకరీ వల్ల హాని కలుగుతుంది. (8) ప్రస్తుతము సమయము బాగు లేదు, కుజునికి శాంతి చేయండి. (9) ఈ వార్త సత్యమైనదే. (10) గెలుపు మీదే అవుతుంది. (11) ఈ ఇల్లు శుభము, మరియు సిద్దిదాయకము అవుతుంది. (12) వైద్యుని వల్ల కార్యము అవుతుంది. (13) కొనవద్దు, హాని కలుగుతుంది. (14) శారీరిక వ్యాధి కలదు, నిదానముగా స్వస్థత కలుగుతుంది. (15) ఈ దినము సుఖము శాంతితో గడుచును.
 • హనుమాన్’చక్ర ఫలితములు:
(1) కొంత సమయము తరువాత బదిలీ కలుగ గలదు. (2) మీకు ప్రమోషన్’ కలుగుతుంది. (3) ఈ సమయము నందు అప్పు పుట్టుట సందేహము. (4) అతను జీవించి ఉన్నాడు, కాని రోగ గ్రస్తుడు. (5) పశువు పశ్చిమ దిశగా వెళ్లింది. ప్రయత్నమూ వలన దొరుకుతుంది. (6) కొనవద్దు, హాని కలుగుతుంది. (7) ప్రతియోగిత పరీక్షలలో సఫలత పొందుట అతి కష్టము. (8) ఈ నౌకరీ వలన హాని పొందే అవకాశము ఉంది. (9) కొంత సమయము తరువాత కష్టము నుండి నివారణ కలుగును. (10) అవును, ఈ వార్త నిజమే. (11) కేసు గెలువగలవు. (12) ఈ ఇల్లు శుభముగా లేదు. కేతువునకు శాంతి చేయండి. (13) కార్య సిద్ది ఆశించుట వ్యర్థము కాగలదు. (14) అవును దీనిని కొనండి, లాభము కలదు. (15) ప్రేతబాధ కలదు. తంత్రము ద్వారా నివారణ కలుగును.

ఉదాహరణలు:

ప్రశ్న చక్రము ద్వారా మీరు అడగదలచుకొన్న ప్రశ్నను గుర్తించి, ఆ సంఖ్యను ఒకచోట వ్రాసి ఉంచండి. తరువాత తీసా యంత్రములో ఏదో ఒక గదిలో చేతి నడిమి వ్రేలిని గాని, లేక పెన్సిల్’తో గాని ఒక సంఖ్యని ఎంచుకొని దాని సంఖ్యని మొదట ఉంచిన సంఖ్యతో కలపండి. ఇప్పుడు ఆ మొత్తాన్ని బట్టి, సమాధాన చక్రమును గుర్తించండి. ఆ చక్రములో తీసా చక్రము ద్వారా ఎంచుకొన్న సంఖ్య ద్వారా మీకు కావలసిన సమాధానము తెలుసుకోండి . మీరు అడిగిన ప్రశ్న నా మనోకామన పూర్తి అవుతుందా లేదా ? దీని సంఖ్య 1 . తీసా చక్రములో ఎంచుకొన్న సంఖ్య 6 .అనుకొందాం. ఈ రెండింటి మొత్తం 1+6=7 అయింది. ఇప్పుడు ఏడవ సమాధాన చక్రము అంటే మేష చక్రములో, ఆరవ సమాధానము చూడండి.`మనోవాంఛ పూర్తి కాదు ‘’ అని వచ్చింది.

మరొక ఉదాహరణ:

ప్రశ్న --- నేను ప్రతియోగిత పరీక్షలో గెలుస్తానా లేదా? ప్రశ్న చక్ర సంఖ్య 24 . తీసా యంత్రములో ఎంచుకొన్న సంఖ్య 8 అనుకొండి ఈ రెండింటి మొత్తము 24+8=32 అయింది . ఈ సంఖ్య 30 కన్నా ఎక్కువ కదా ! అందు వలన అందులో నుంచి 30 తీసివేయాలి. 32 -30=2 అయింది రెండవ సమాధాన చక్రము, అగ్ని చక్రములో ఎంచుకొన్న సంఖ్య ఎనిమిదవ సమాధానం చూడండి. ``సఫలత కలుగుతుంది, కాని కుజుని పూజించండి.’’ అని ఉంది.

మూలాలు

ఇతర లింకులు

ఈ బ్లాగును శోధించుRelated Posts Plugin for WordPress, Blogger...