శ్రీ మేధా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం

మీరు జన్మించిన తేది, సమయం, ప్రదేశం ఈ మూడు సమాచారములు మాకు తెలియచేసినచో మీ వ్రుత్తి,వ్యాపార,ఆరోగ్య,ఆర్ధిక పరిస్తితులు, దాంపత్యం, విద్య, ఉద్యోగ, వివాహ, కుటుంబవ్యవహారాలు, సంతానం, రాజకీయ వ్యవహారాలు,ప్రేమ వ్యవహారములు,కుజ దోషం, కాలసర్ప దోషం మరియు వివాహ, ఉపనయన, గృహప్రవేస, జప, హోమ, వ్రత, అన్నప్రసన, నామకరణం లకు ముహూర్తములు పెట్టబడును. P.V.RADHAKRISHNA CELL :+91 7013390324, Mail us :parakrijaya@gmail.com
Get your horoscope by giving Date, time and place of birth. Do you have mobile no. 9966455872 Live chat with WhatsApp Pantula Venkata RadhaKrishna.Get a solution to your horoscope problems

6, డిసెంబర్ 2020, ఆదివారం

కాలభైరవ జయంతి

రేపు కాలభైరవ జయంతి అనగా 07/12/2020


కాలభైరవ జయంతి విశిష్టత – కాలభైరవ ఆవిర్భావం ~ పూజా విధానం

ప్రాచీనకాలం నుంచి చాలా శైవ క్షేత్రాలలో కనిపించే విగ్రహం కాలభైరవ విగ్రహం. ముఖ్యంగా కాశీ నగరంలోనే కాకుండా చాలా దేవాలయములలో ఈయన క్షేత్ర పాలకునిగా ఉంటాడు. సాధారణంగా కాలభైరవ స్వరూపం భయాన్ని కలిగించేదిగా ఉంటుంది. కాలభైరవుని విశిష్టత తెలియక ప్రస్తుత రోజుల్లో కాలభైరవుడు అనగానే చాలామంది *కుక్క(శునకం)* అని తేలిగ్గా అనేస్తారు. కానీ సాక్షాత్తు శివుడే కాల భైరవుడై సంచారించాడని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆయనను పూజించినచో కాలమును మార్చలేకపోయినా మనకు అనుకూలంగా మలచుకోవచ్చు.

ముఖ్యంగా 
అసితాంగ భైరవుడు , రురు భైరవుడు , 
చండ భైరవుడు , 
క్రోధ భైరవుడు , 
ఉన్మత్త భైరవుడు , 
కపాల భైరవుడు , 
భీషణ భైరవుడు , 
సంహార భైరవుడు , అనే ఎనిమిది నామాలతో వివిధ ముద్రలతో భైరవుడు దర్శనమిస్తూ ఉంటాడు.


కాలభైరవ వృత్తాంతం : -


పరమశివుడిని అవమానపరచిన బ్రహ్మదేవుడిపై శివుడు ఆగ్రహానికి గురియై భైరవుడిని సృష్టించి బ్రహ్మదేవుడి తలను ఖండించమని ఆదేశిస్తాడు. క్షణమైనా ఆలస్యం చేయకుండా బ్రహ్మదేవుడి యొక్క ఐదు శిరస్సులలో అవమానించిన శిరస్సులను ఖండించాడు. అనంతరం బ్రహ్మహత్యాపాతకం నుంచి బయటపడటానికై పరమశివుని అనుగ్రహం మేరకు బ్రహ్మదేవుడి యొక్క కపాలంను చేతితో పట్టుకుని అనేక ప్రాంతాలను దర్శిస్తూ ఎక్కడైతే ఆ కపాలం పడుతుందో అక్కడితో పాపప్రక్షాళన అవుతుందని చెప్పాడు. తుదకు భైరవుని చేతిలో కపాలం కాశీ నగరంలో పడటం వలన ఆ నగరమును బ్రహ్మకపాలంగా పిలుస్తారు.

శ్రీ కాలభైరవ జయంతినాడు భైరవుడిని పూజిస్తే సకల గ్రహదోషాలు , అపమృత్యు దోషాలు తొలగిపోతాయని , ఆయురారోగ్యాలు పెంపొందుతాయని మంత్రశాస్త్ర గ్రంధాలు చెబుతాయి.

దేవాలయములలో క్షేత్రపాలకునిగా కాలభైరవుడు ఉంటే క్రింది శ్లోకమును చెప్పి ముందుగా అయన దర్శనం చేయవలెను.

*తీక్ష్ణ దంష్ట్ర ! మహాకాయ !కల్పాంతదహనోపమ |*
*భైరవాయ నమస్తుభ్యం అనుజ్ఞాం దాతు మర్హసి ||*

పూజా విధానం  : -

శ్రీ కాలభైరవ పూజని అన్ని వర్గాలవారు చేయవచ్చు. కాలభైరవ పూజను చేసేవారు నల్లని వస్త్రాలు ధరించడం మంచిది. శ్రీ కాలభైరవుడి విగ్రహానికిగాని , చిత్రపటానికిగాని పూజ చేయవచ్చు. శనివారం , మంగళవారాలు కలభైరవుడికి అత్యంత ప్రితికరమైన రోజులు. పూజలో భాగంగా కాలభైరవుడి మినపగారెలు నివేదించాలి. కాలభైరవ పుజని సాయంత్రం 5 – 7 గం..ల మధ్య చేస్తే మంచిది. శ్రీ కాలభైరవ హోమం చేయించుకుంటే సకల గ్రహబాధలు అనారోగ్య బాధలు తొలిగిపోతాయి.

పూజను చేయలేనివారు *శ్రీ కాలభైరవాష్టకం , భైరవ కవచం , స్తోత్రాలు* పఠించడంవల్ల భైరవానుగ్రహాన్నీ పొందవచ్చు.


కాలభైరవాష్టకం


*దేవరాజసేవ్యమానపావనాంఘ్రిపంకజం వ్యాలయజ్ఞసూత్రమిందుశేఖరం కృపాకరమ్ |*
*నారదాదియోగిబృందవందితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౧ ||*

*భానుకోటిభాస్వరం భవాబ్ధితారకం పరం నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనమ్ |*
*కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౨ ||*

*శూలటంకపాశదండపాణిమాదికారణం శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయమ్ |*
*భీమవిక్రమం ప్రభుం విచిత్రతాండవప్రియం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౩ ||*

*భుక్తిముక్తిదాయకం ప్రశస్తచారువిగ్రహం భక్తవత్సలం స్థిరం సమస్తలోకవిగ్రహమ్ |*
*నిక్వణన్మనోజ్ఞహేమకింకిణీలసత్కటిం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౪ ||*

*ధర్మసేతుపాలకం త్వధర్మమార్గనాశకం కర్మపాశమోచకం సుశర్మదాయకం విభుమ్ |*
*స్వర్ణవర్ణకేశపాశశోభితాంగనిర్మలం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౫ ||*

*రత్నపాదుకాప్రభాభిరామపాదయుగ్మకం నిత్యమద్వితీయమిష్టదైవతం నిరంజనమ్ |*
*మృత్యుదర్పనాశనం కరాలదంష్ట్రభూషణం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౬ ||*

*అట్టహాసభిన్నపద్మజాండకోశసంతతిం దృష్టిపాత్తనష్టపాపజాలముగ్రశాసనమ్ |*
*అష్టసిద్ధిదాయకం కపాలమాలికాధరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౭ ||*

*భూతసంఘనాయకం విశాలకీర్తిదాయకం కాశివాసిలోకపుణ్యపాపశోధకం విభుమ్ |*
*నీతిమార్గకోవిదం పురాతనం జగత్పతిం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౮ ||*

*కాలభైరవాష్టకం పఠంతి యే మనోహరం జ్ఞానముక్తిసాధకం విచిత్రపుణ్యవర్ధనమ్ |*
*శోకమోహలోభదైన్యకోపతాపనాశనం తే ప్రయాంతి కాలభైరవాంఘ్రిసన్నిధిం ధ్రువమ్ ||*


 
సమస్త ప్రాణులను తనలోకి లయం చేసుకొనే పరమశివుని మరొక రూపమే భైరవ స్వరూప.

కాలము  అనబడే కుక్కను వాహనంగా  కలిగి ఉంటాడు కనుక. ఈయనను కాలభైరవుడు అని అంటారు. నుదుటున విభూతి రేఖలను ధరించి , నాగుపాముని మొలత్రాడుగా చుట్టుకుని…  గద , త్రిశూలం , సర్పం , పాత్ర చేతబట్టి దర్శనమిచ్చే కాలభైరవుడు సాక్షాత్తూ పరమశివుని మరొక రూపమైన కాలుడి స్వరూపం.  ఆయన ఆదేశానికి సిద్ధమన్నట్టుగా పక్కనే కుక్క దర్శనమిస్తూ వుంటుంది.

శ్రీ కాల భైరవ అష్టమి రోజున దేవాలయంలో కాలభైరవుడికి కర్పూర తైల చూర్ణముతో  అభిశేకము చేయించి , గారెలతో మాల వేసి… కొబ్బరి , బెల్లం నైవేద్యంగా పెట్టినచో జాతకంలో వున్న సమస్త గ్రహదోషములు తొలగి ఈశ్వర అనుగ్రహంతో  ఆయుష్షు పెరుగును.

అంతేకాక  ఎనిమిది మిరియాలు ఒక తెల్ల గుడ్డలో కట్టి వత్తిగా చేసి , భైరవుని తలచుకొని 2 దీపాలు నువ్వుల నూనెతో వెలిగించినచో భైరవుని అనుగ్రహం వల్ల అష్టమ , అర్ధాష్టమ , ఏలినాటి శని దోషములు ఉన్నవారు శనిదోషాల నుంచి విముక్తులు కాగలరు.

శ్రీ కాలభైరవ అష్టమి రోజున ఆలయంలో భైరవ దర్శన చేసి . భైరవుడి వాహనమైన కుక్కకి పెరుగన్నం  తీపి పదార్థాలను నైవేద్యంగా పెట్టడం వల్ల అపమృత్యు దోషాలు తొలగిపోతాయి.


*కాలభైరవ గాయత్రి*

*ఓం కాల కాలాయ విద్మహే*
*కాలాతీతాయ ధీమహి*
*తన్నో కాలభైరవ ప్రచోదయాత్ ॥*కాలభైరవ జయంతి పై ముఖ్యమైన  సమయాలు

సూర్యోదయం డిసెంబర్ 07, 2020 6:47 అపరాహ్నం
సూర్యాస్తమయం డిసెంబర్ 07, 2020 5:37 అపరాహ్నం
అష్టమి తిథి ప్రారంభమైంది డిసెంబర్ 07, 2020 6:47 అపరాహ్నం
అష్టమి తిథి ముగుస్తుంది డిసెంబర్ 08, 2020 5:17 అపరాహ్నం

27, నవంబర్ 2020, శుక్రవారం

శని త్రయోదశి 28-11-2020

శని త్రయోదశి కేవలం శనిదేవుడి ఆరాధనకే కాదు..!

కర్మ సిద్ధాంతం ప్రకారం మనిషి చేసే కర్మలకు ప్రతిఫలం అనుభవించి తీరాలి. మంచి కర్మలకి మంచి ప్రతిఫలం, చెడు కర్మలకి చెడు ప్రతిఫలం అనుభవించి తీరాలి. దీనిని అందజేసేది శనీశ్వరుడు.
    
భారతీయులు కర్మ సిద్ధాంతాన్ని బలంగా నమ్ముతారు. ముఖ్యంగా హిందువులకు కర్మ సిద్ధాంతంపై నమ్మకం ఎక్కువ. దీని ప్రకారం మనిషి చేసే కర్మలకు ప్రతిఫలం అనుభవించి తీరాలి. మంచి కర్మలకి మంచి ప్రతిఫలం, చెడు కర్మలకి చెడు ప్రతిఫలం అనుభవించి తీరాలి. ఈ బాధ్యతలను శనీశ్వరుడికి పరమేశ్వరుడు అప్పగించాడు. అందుకే ఆయనను కర్మ ఫలదాత అంటారు. ఒడిదొడుకులు ఎదురైనప్పుడే జీవితం విలువ గురించి తెలుస్తుంది. మనిషికి అప్పుడప్పుడూ మొట్టికాయలు వేస్తూ లోపాలను సరిదిద్దేది శనిదేవుడు. ప్రాణాలతో ఉన్నప్పుడు వారి పాపాలకు తగిన ప్రాయశ్చిత్తాన్ని కలిగిస్తాడు.

సూర్యభగవానుడు, ఛాయా సంతానమే శనిదేవుడు. అందుకే ఆయనను సూర్యపుత్రడు అనీ, ఛాయాసుతుడు అనీ అంటారు. నవ గ్రహాల్లో కీలకమైన శని.. జాతక చక్రంలోని ఒక్కో రాశిలో దాదాపు రెండున్నర ఏళ్లు సంచరిస్తాడు. అంటే రాశి చక్రంలో ఒకసారి ప్రయాణానికి దాదాపు 30 ఏళ్లు పడుతుంది. నిదానంగా సంచరిస్తాడు కాబట్టి శనికి మందగమనుడు అనే పేరు ఉంది. అయితే, రాశిచక్రంలో ఆయన ఉండే స్థానాన్ని బట్టి ఫలితాలు కూడా ఉంటాయి. జాతకరీత్యా శని ప్రభావం అధికంగా ఉన్నప్పుడు తమకు తక్కువ శ్రమ కలిగించాలని శనీశ్వరుని వేడుకుంటారు. అందుకోసం నవగ్రహాలు ఉండే ఆలయాన్ని దర్శిస్తారు. ఇక త్రయోదశి తిథి వచ్చే శనివారం నాడు ఆయనను పూజిస్తే మరింత త్వరగా ఉపశమనం కలిగిస్తాడని నమ్మకం. అయితే, శని త్రయోదశికి ఎంతో విశిష్టత ఉంది. శనివారం శని భగవానునికీ, అటు విష్ణుమూర్తికీ ప్రీతికరమైన రోజు కాగా, త్రయోదశి శివునికి ఇష్టమైన తిథి.

స్థితి, లయకారులిద్దరికీ ఇష్టమైన రోజుగా శనిత్రయోదశి స్థిరపడింది. దీని ప్రాముఖ్యతని మరింతగా వివరించేలా ఒక పురాణ గాథ కూడా ప్రచారంలో ఉంది. ఒకసారి కైలాసానికి వెళ్లిన నారద మహర్షి శనీశ్వరుడి గురించి పొగడటం మొదలుపెట్టాడు. ఎంతటివారైనా శని ప్రభావం నుంచి తప్పించుకోలేరన్నాడు. ఈ మాటలకు ఆగ్రహించిన శివుడి.. ‘శని ప్రభావం ఎవరి మీద ఉన్నా లేకున్నా, నా మీద మాత్రం పనిచేయదు’ అని అన్నాడు. ఇదే మాటను నారదుడు యథాతథంగా శనిదేవుని వద్దకు మోసుకువెళ్లాడు.‘నా ప్రభావం నుంచి తప్పించుకోవడం ఎవరి తరమూ కాదు. ఇది సృష్టి ధర్మం,’అని చెప్పిన శని.. పరమేశ్వరుని ఫలానా సమయంలో పట్టిపీడించి తీరతానని అన్నాడు.శని శపథం గురించి విన్న శివుడికి ఏం చేయాలో అర్థంకాక, మాట నెరవేరితే తన ప్రతిష్ఠకే భంగం కలుగుతుందని భావించాడు. అందుకే శని చెప్పిన సమయానికి అతని కంటపడకుండా ఉండేందుకు భూలోకంలో ఒక చెట్టు తొర్రలో దాక్కొన్నాడు.

మర్నాడు కైలాసానికి వచ్చిన శనిదేవుడిని చూసిన శివుడు ‘నన్ను పట్టి పీడిస్తానన్న నీ శపథం ఏమైంది’ అంటూ పరిహసించాడు. దీనికి శని ‘ప్రభూ! ఈ ముల్లోకాలకూ లయకారుడవైన నువ్వు ఆ చెట్టు తొర్రలో దాక్కొన్నావే! అది నా ప్రభావం కాదా. దీన్ని శని పట్టడం అనరా?’ అన్నాడు. శనిదేవుని శక్తిని గ్రహించిన పరమేశ్వరుడు.. ఈ రోజు నుంచి శనిత్రయోదశి నాడు ఎవరైతే నిన్ను పూజిస్తారో వారికి నీ అనుగ్రహంతో పాటు నా అభయం కూడా దక్కుతుందన్నారు. ఇక నుంచి నువ్వు శనీశ్వరుడు అన్న పేరుతో కూడా పరఢవిల్లుతావని ఆశీర్వదించాడు. అప్పటి నుంచి త్రయోదశి తిథి వచ్చే శనివారం నాడు నువ్వుల నూనెతో శనీశ్వరుని అభిషేకించి, తమని చూసీచూడనట్లుగా సాగిపొమ్మని వేడుకుంటున్నారు.

               *ఓం శం శనైశ్చరాయ నమః*
      

24, జులై 2020, శుక్రవారం

నాగ పంచమి రోజు ఏం చేయాలి

*#25-07-2020 రేపు_గరుడ_పంచమి_లేదా_నాగ_పంచమి*


శ్రావణమాసంలో ఆచరించే ముఖ్యమైన పండుగలలో " గరుడ పంచమి" ఒకటి. గరుత్మంతుడు సూర్యరధసారధి అయిన అనూరుడికి తమ్ముడు. మేరు పర్వతంతో సమానమైన శరీరం కలవాడు, సప్తసముద్రాల్లోని జలాన్నంతటినీ ఒక్కరెక్క విసురుతో ఎగరగొట్టగల రెక్కల బలం కలవాడు. అందువలనే అతడికి సువర్ణుడు అనే పేరు కుడా ఉన్నది.

గరుడపంచమికి సంబంధించి భవిష్యత్పురాణంలో ప్రస్తావన ఉంది. సముద్రమధనంలో " ఉచ్పైశ్రవం" అనే గుఱ్ఱం ఉద్భవించింది. అది శ్వేతవర్ణం కలది. కశ్యపుడు, వినత ల కుమారుడు గరుడుడు. ఓ రోజు వినత ఆమే తోడుకోడలు కద్రువ విహార సమయంలో ఆ తెల్లటి గుఱ్ఱాన్ని చుసారు. కద్రువ, వినతతో గుఱ్ఱం తెల్లగా ఉన్న తోకమాత్రం నల్లగా ఉంది అని చెప్పగా, వినత గుఱ్ఱం మొత్తం తెల్లగానే ఉంది అని చెప్పింది. వాళ్ళిద్దరు ఒ పందెం వేసుకొన్నారు, గుఱ్ఱపు తోక నల్లగాఉంటే వినత కద్రువకు దాస్యం చేయలని, గుఱ్ఱం మొత్తం తెల్లగా ఉంటే వినతకు కద్రువ దాస్యం చేయలని పందెం.

కద్రువ తన కపటబుద్దితో. సంతానమైన నాగులను పిలిచి అశ్వవాలాన్ని పట్టి వ్రేలాడమని కోరగా. దానికి వారెవ్వరు అంగీకరించలేదు. కోపగించిన కద్రువ " జనమేజయుని సర్పయాగంలో నశించాలని" శపించింది. ఒక్క కర్కోటకుడు అనే కుమారుడు అశ్వవాలాని పట్టి వ్రేలాడి తల్లి పందాన్ని గెలిపించాడు.

కొద్దికాలం తరువాత గర్బవతి అయిన వినత, తనకు పుట్టిన రెండు గుడ్లలో మొదటి దాన్ని పగులగొట్టి చూసింది. అప్పటికి ఇంకా పూర్తిగా ఆకారం ఏర్పడని అనూరుడు బైటకురాగానే " అమ్మా నీ తొందరుపాటువలన నేను అవయవాలు లేకుండానే జన్మించాను, కాని నీవు మాత్రం రెండవ గుడ్డును తొందరపడి పగులగొట్టవద్దు" అని చెప్పి, సూర్యభగవానుడి రధసారధిగా వెళ్ళిపోయాడు. కొద్దికాలం తరువాత జన్మించిన గరుడుడు తల్లి దాశ్యం చూడలేక, దాశ్యవిముక్తి కోసం అమృతం తెచ్చివమ్మన్న నాగుల మాటకు అనుగుణంగా అమృతం తెచ్చిచ్చి, అమ్మకు దాశ్యం నుండి విముక్తి కలిగిచ్చాడు. అమృతభాండాన్ని తీసుకొని వెళ్తున్న గరుత్మంతుడిని ఇంద్రుడు వజ్రాయుధంతో అడ్డుకొనబోగా, తన తల్లి దాస్యత్వం పోగొట్టడానికే ఇలా తీసుకెళ్తున్నానని విన్నవించాడు. 

*నిర్మలమైన మనస్సు, తెలివైన పిల్లలకోసం చేసే పూజ గరుడపంచమి*

గరుడ పంచమి రోజున మహిళలు స్నానాంతరం ముగ్గులు పెట్టిన పీఠపై అరటి ఆకును పరచి, బియ్యంపోసి, వారి శక్తి మేర బంగారు, వెండి నాగపడిగను ప్రతిష్టించి, పూజచేసి, పాయస నైవేద్యం పెడ్తారు. మరి కొన్ని ప్రాంతాలలో పుట్టలో పాలుపోస్తారు. ఇలా మనపూజలందుకొనే గరుడిని వంటి మాతృప్రేమకల కుమారుడు కావాలని తెలిపే గరుడ పంచమి వ్రతం అనంత సౌభాగ్యాలను కలుగచేస్తుంది.

*ఓం నమో భగవతే నాగరాజాయ*
*ఓం నమో భగవతే గరుడదేవాయ*

5, మార్చి 2020, గురువారం

నవగ్రహాలకిపరిహారాలు


1. ఏదోషానికైనా పాపఫలం కారణం అని గుర్తించాలి, దానికి మనదగ్గర ఉన్నదాంట్లో దానంచేస్తే మంచిది)

2. ఆయాగ్రహాలకి బ్రాహ్మణాదుకి ఇవ్వడంతోపాటు తమదగ్గర పనిచేసేవారికి, చుట్టు ఉండే బంధువులకి, స్నేహితులకి సాయం చెయ్యడం, బీదలకి అనాధలకి ఇవ్వడం కూడా పుణ్యకార్యమే)
ఈక్రమంలోనే క్రిందివ్వబడ్డ దానాలు ఎవరెవరికి ఎలాంటివి ఇవ్వవచో ఆలోచించుకొని దానాలు చేయాలి.
అవిచేస్తూ కిందిజపాలు,ఆయాదేవతాపూజలు చేయడం మంచిది.
3. రత్నాలు అందరూ అన్నీ ధరించకూడదు అవి సూచనిబట్టే ధరించాలి(పూజ ,జపం,దానం లేకుండా రత్నధరణ ఫలించదు)
4. ప్రతీ గ్రహానికి జపం (అనగా ఇవ్వబడ్డ సంఖ్య) + తర్పణం + హోమం + దానం) ఇవన్నీ చేయడాన్ని మాములు పరిహారం అంటారు.
5. విశేష సమస్యలకు ఆయాపరిహారాలు పాటించండి.

చేయాల్సిన పరిహార విధులు :

నవగ్రహాలకి జపాలు పరిహారాలు

సూర్య గ్రహానికి

గ్రహాణాం ఆదిరాదిత్యః లోకరక్షణకారకః ।
విషమస్థాన సంభూతం పీడాంహరతుమే రవిః ॥ ఈశ్లోకాన్ని 6 వేలసార్లు జపించాలి

దానాలు : గోధులు,గోధుమపిండి పదార్థాలు రొట్టెలవంటివి,రాగివస్తువులు.
పూజలు- విష్ణుమూర్తికి పూజ,సూర్యోపాసన.
రత్నాలు- కెంపు ధరించాలి (సూచిస్తేనే జాతకాన్నిబట్టిమాత్రమే ధరించాలి)

చంద్ర గ్రహానికి

రోహిణీశః సుధామూర్తిః సుధాగాత్రః సురాశనః ।
విషమస్థాన సంభూతం పీడాంహరతుమే విదుః ।। ఈ శ్లోకాన్ని (10 వేలసార్లు జపించాలి)

దానాలు : పాలు,తెల్లబట్టలు,బియ్యం వెండి వస్తువులు.నీరుదానంచేయవచ్చులేదా నీటి ట్యాంకర్‌ కట్టించడం.శివాలయం,ఏదైనా తీర్థాలు,
పూజలు-శివారాధన,చంద్రపూజ,చంద్రుడి అష్టోత్తరశతనామాలుచదవటం
రత్నాలు- ముత్యం ధరించాలి(సూచిస్తేనే జాతకాన్నిబట్టిమాత్రమే ధరించాలి)

కుజ గ్రహానికి

భూమిపుత్రో మహాతేజా జగతాం భయకృత్‌సదా ।
వృష్టికృత్‌ సృష్టిహర్తాచ పీడాంహరతుమే కుజః ॥ ఈ శ్లోకాన్ని 7 వేలసార్లు జపించాలి

దానాలు : కారం వస్తువులు,ఎర్రవస్త్రాలు,కందులు,కందిపప్పు.రక్తదానం
పూజలు-దుర్గారాధన,సుబ్రహ్మణ్యారాధన ,కుజపూజ ,కుజఅష్టోత్తరశతనామాలుచదవటం
రత్నాలు- పగడం ధరించాలి(సూచిస్తేనే జాతకాన్నిబట్టిమాత్రమే ధరించాలి)

బుధ గ్రహానికి

ఉత్పాతరూపో జగతాం చంద్రపుత్రోమహాద్యుతిః ।
సూర్యప్రియకరోవిద్వాన్‌ పీడాంహరతుమే బుధః । ఈశ్లోకాన్ని 17 వేలసార్లు జపించాలి

దానాలు :పెసలు,ఆకుపచ్చని దుస్తులు,ఎలక్ట్రానిక్‌వస్తువులు,రోగులకు మందులు ఇవ్వడం,
రత్నాలు- పచ్చ (దీన్నేమరకతం అంటారు) ధరించాలి(సూచిస్తేనే జాతకాన్నిబట్టిమాత్రమే ధరించాలి)
పూజ.విష్ను ఆరాధన,వణిగింద్రపూజ,కుబేరపూజ ఆయాదేవతలఅష్టోత్తరశతనామాలుచదవటం

గురు గ్రహానికి

దేవమంత్రీవిశాలాక్షః సదాలోకహితేరతః ।
అనేకశిశ్య సంపూర్ణః పీడాంహరతుమే గురుః॥ ఈశ్లోకాన్ని 16 వేలసార్లు జపించాలి

దానాలు : పుస్తకాలు,బంగారువస్తువులు,తీపి పిండివంటలు,పట్టుబట్టలు.పండ్లు.
పూజలు.హయగ్రీవ,సరస్వతీ,లలితా ,బుధగ్రహాల పూజలు ఆయాదేవతలఅష్టోత్తరశతనామాలుచదవటం.
రత్నాలు- పుష్యరాగం ధరించాలి(సూచిస్తేనే జాతకాన్నిబట్టిమాత్రమే ధరించాలి)

శుక్ర గ్రహానికి

దైత్యమంత్రీ గురుస్తేషాం ప్రాణదశ్చమహామతిః ।
ప్రభుస్తారాగ్రహాణాంచ పీడాంహరతుమే భృగుః ॥ ఈ శ్లోకాన్ని 20వేలసార్లు జపించాలి

దానాలు : చక్కెర,బబ్బెర్లు,అలంకరణ వస్తువులు.పూలు.ఆవు
పూజలు.లలితా ,కాలీ ,శుక్రగ్రహంపూజ చేయడం ఆయాదేవతల అష్టోత్తరశతనామాలుచదవటం
రత్నాలు- వజ్రం ధరించాలి(సూచిస్తేనే జాతకాన్నిబట్టిమాత్రమే ధరించాలి)

శని గ్రహానికి

సూర్యపుత్రో దీర్ఘదేహో విశాలాక్షః శివప్రియః ।
మందచారప్రసన్నాత్మా పీడాంహరతు శనిః ॥ ఈ శ్లోకాన్ని 19 వేలసార్లు జపించాలి

దానాలు : వాడుకున్నవస్త్రాల్లోచినిగిపోనివస్త్రాలు,నల్లని వస్త్రాలు,నూనె,నువ్వులుండలు.అవిటివారు,రోగులకుమందులు,ఆహారం ఇవ్వడం,సిమెంట్‌,నేరేడుపండ్లు,దానంచేయడం,నువ్వులనూనెతో శరీరాన్ని రుద్ది తర్వాత స్నానం చేయడం.

పూజలు,రుద్రాభిశేకం వేంకటేశ్వరారాధన శనివారం వ్రతం పూజలు ఆయాదేవతల అష్టోత్తరశతనామాలుచదవటం.
రత్నాలు- నీలం(దీన్నే ఇంద్రనీలం అంటారు) ధరించాలి(సూచిస్తేనే జాతకాన్నిబట్టిమాత్రమే ధరించాలి)

రాహు గ్రహానికి

అనేకరూప వర్ణైశ్చ శతశఃఅథసహస్రశః ।
ఉత్పాత రూపోజగతాం పీడాంహరతుమే తమః ॥ ఈ శ్లోకాన్ని 18 వేలసార్లు జపించాలి

దానాలు : ముల్లంగివంటి దుంపలు ,మినప్పప్పుతో చేసినవడలు,మినుములు,ఆవాలు
పూజలు,దుర్గారాధన,కాలసర్పపూజలు,సుబ్రహ్మణ్య ,రాహు దేవతలపూజలు ఆయాదేవతల అష్టోత్తరశతనామాలుచదవటం
రత్నాలు-గోమేధికం ధరించాలి (సూచిస్తేనే జాతకాన్నిబట్టిమాత్రమే ధరించాలి)

కేతు గ్రహానికి

మహాశిరో మహావక్త్రో దీర్ఘదంష్ట్రోమహాబలః।
అతనుశ్వ ఊర్ధ్వ కేశశ్చ పీడాం హరతుమే శిఖీ ॥ ఈ శ్లోకాన్ని 7 వేలసార్లు జపించాలి

దానాలు ఉలవలు,మిక్స్‌డ్‌ కలర్స్‌ వస్త్రాలు,ఆహారం,
పూజలు,దుర్గారాధన,కాలసర్పపూజలు,సుబ్రహ్మణ్య ,రాహు దేవతలపూజలు ఆయాదేవతల అష్టోత్తరశతనామాలుచదవటం
రత్నాలు- వైఢూర్యం ధరించాలి(సూచిస్తేనే జాతకాన్నిబట్టిమాత్రమే ధరించాలి)

ఈ బ్లాగును శోధించుRelated Posts Plugin for WordPress, Blogger...